Home రాష్ట్రీయ వార్తలు ‘దీక్ష’ పేరుతో దగా!

‘దీక్ష’ పేరుతో దగా!

మహాత్మాగాంధీ ఆశయ స్ఫూర్తితో బ్రతుకుతున్న నన్నే ప్రధాని నరేంద్ర మోడీ విమర్శి స్తారా అని ముఖ్యమంత్రి చంద్ర బాబు ఒక మాటన్నాడు.. నిజంగా గాంధీ చనిపోబట్టి బ్రతికిపో యాడుగాని, బ్రతికుంటే మాత్రం ఈ మాట విని.. అదిరిపోయే వారేమో…!

గాంధీ ఆశయాలను పాటించడం అంటే… ఖద్దరు చొక్కా, ఖద్దరు ఫ్యాంటు ధరించి తిరగడం అను కుంటున్నాడు చంద్రబాబు. అదే గాంధేయవాదం అనుకుంటున్నాడు. గాంధీ మార్గంలో బ్రతకడం అంటే ఆయనలాగా గోచీ పెట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని నడవడం కాదు. ఖద్దరు చొక్కాలు వేసు కున్న ప్రతివాడూ గాంధేయవాది కాలేడు. గాంధీ మార్గం అంటే నిరాడంబరత… సచ్ఛీలత… నిజాయితీ… నిజాలే చెప్పడం. చంద్రబాబుకు ఇవి సెట్‌ అవుతాయా? ఏడాది వయసులో 20కోట్ల ఆస్తి కలిగిన మనుమడు, ఐదేళ్ళలో వేలకోట్ల లాభాలలోకి వెళ్లిన వ్యాపార సంస్థలు వున్న చంద్ర బాబుకు గాంధేయవాదం గురించి మాట్లాడే అర్హత వుందా? అసలు ప్రత్యేకహోదా కోసం ధర్మపోరాట దీక్ష పేరుతో ఢిల్లీలో ఆయన చేసిన కార్యక్రమం చూస్తే దీక్షలు ఇలా కూడా చేయొచ్చు అని జాతీయ రాజకీయ ప్రతినిధులే ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఢిల్లీలో ఇలాంటి హైటెక్‌ దీక్ష ఇంతవరకు జరగ లేదని అక్కడి మీడియా కోడై కూసింది.

ఢిల్లీ కేంద్రంగా ఎన్నో రాజకీయ పార్టీలు దీక్షలు చేశాయి. కేంద్రానికి తమ నిరసనను తెలియజేశాయి. ఏపిలోని ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కూడా ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో పెద్దఎత్తున దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే చంద్రబాబు చేసినంత ఖరీదైన దీక్షను దేశ రాజకీయ చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ చేయలేదు. ప్రత్యేక విమానాలు, ప్రత్యేక రైళ్ళు, 3500 ఏ.సి గదులు… దాదాపు 12కోట్ల ఖర్చు. ఇందులో మళ్ళీ శివాజీ, దివ్యవాణి వంటి ప్యాకేజీ స్టార్స్‌. గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కించాల్సిన దీక్ష ఇది. ఇలాంటి దీక్ష చూస్తే గాంధీ మహాత్ముడు కూడా అవాక్కయిపోయేవారేమో!

ఈ కాస్ట్‌లీ దీక్ష వల్ల చంద్రబాబు సాధించేదే మైనా వుందా? ఏమీ సాధించలేమనే సంగతి ఆయనకూ తెలుసు. కాని ప్రతిపక్షం వైకాపాకు ప్రత్యేకహోదా కోసం పోరాడుతుందన్న ఖ్యాతి పోకుండా చేయడం కోసం ఈయన డ్రామాలు మొదలుపెట్టాడు.

అసలు ఏపికి ప్రత్యేకహోదాకు పాడె కట్టిందే చంద్రబాబు. కేంద్రం ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ప్రతిపాదించినప్పుడు ఆనందంతో అంగీకరించింది ఆయనే! మరి ప్యాకేజీతో ఏం ఉపయోగం, ఎంత ఉపయోగం, ఎవరికి ఉపయోగం అన్న సంగతి వారికే తెలియాలి. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది చంద్ర బాబే! ఉత్తమ ప్యాకేజీ ఇచ్చారంటూ అప్పట్లో కేంద్రమంత్రిగా వున్న ముప్పవరపు వెంకయ్య నాయుడికి ర్యాలీలు నిర్వహించి సన్మానాలు చేసింది కూడా వీళ్ళే! ప్రత్యేకహోదా డిమాండ్‌తో పోరుబాట పట్టిన ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డిని విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నది ఈ ప్రభుత్వమే! హోదా అంటే జైలుకే అని బెదిరించింది వీళ్లే! హోదా వల్ల ఏమొస్తుందండి… హిమాచల్‌లో ఏం జరిగింది. ఉత్తరాఖండ్‌లో ఏం అయ్యింది… హోదాపై ముందు నన్ను ఎడ్యుకేట్‌ చెయ్యండి అంటూ ఆ అంశంపై అసెంబ్లీ సాక్షిగా వెటకారంగా మాట్లాడింది చంద్రబాబునాయుడే!

కేంద్రంతో ప్యాకేజీకి ఒప్పుకుని, దాని ద్వారా నిధులు రాబట్టి కేంద్ర పథకాలకు తన ముసుగు తగిలించుకున్న చంద్రబాబు ఎన్నికలు సమీపించే సరికి ప్లేటు ఫిరాయించాడు. జగన్‌కు ఎక్కడ హోదా పోరాటం క్రెడిట్‌ పోతుందనే భయంతో బీజేపీకి కటీఫ్‌ చెప్పి, ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి దీక్షలు చేస్తున్నాడు. ఇలాంటి వాటికి కూడా దీక్షలు, ధర్మపోరాటాలని పేరు పెడితే… మరి అప్పుడు గాంధీజీ చేసిన దీక్షలకు, ఇటీవల అన్నాహజారే చేసిన దీక్షలకు పేర్లు మార్చాలేమో?!

బాబు బిస్కెట్లకేనా?

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే మొనగాడిగా చంద్రబాబుకు భలే పేరుంది. అయితే ఒకప్పుడు ఆ పేరు రాజకీయంగా వుండేది. ఇప్పుడు మరో రకంగా వుంది.

ఈమధ్య ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతి రేకంగా దేశంలోని విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తుండడం చూస్తున్నాం. కర్నాటకలో ముఖ్య మంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారో త్సవం అప్పటి నుండి వీరి కలయికకు అంకురార్పణ జరిగింది. ఇక అప్పటి నుండి అవకాశం వచ్చినప్పుడల్లా కలుస్తూనే వున్నారు. ఈ కూటమిలో దాదాపు 22 పార్టీల దాకా వున్నాయి. కాంగ్రెస్‌ను మొదలు కొని ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలవలేని పార్టీలూ వున్నాయి. వీళ్లందరు కూడా మోడీ బాధితుల సంఘంగా ఏర్పడ్డారు. వీరిలో ఒకరిద్దరు తప్పితే మిగిలిన అన్ని పార్టీలలో అవినీతిపరులకు, అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నాయకులకు లెక్కే లేదు. ఈ బ్యాచ్‌ అంతా కూడా ఈమధ్య చంద్రబాబును ఎక్కువుగా ఫాలో అవుతున్నారు. శరద్‌పవార్‌ లాంటి సీనియర్‌ నాయకులు కూడా చంద్రబాబు పిలవగానే పరుగెత్తుతున్నారు. మొన్న ఢిల్లీలో చంద్రబాబు 12కోట్ల వ్యయంతో చేసిన ఖరీదైన దీక్షకు కూడా కాంగ్రెస్‌తో సహా 22 పార్టీల నాయకులు హాజరయ్యారు. వీళ్లెవరు కూడా ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలనే అంశంపై గట్టిగా అడిగేవాళ్ళు కాదు. కేవలం చంద్రబాబు పిలవబట్టి వచ్చారు. మరి బాబు పిలుపుకు అంత పవర్‌ వుందా అంటే.. వుందనేచెప్పొచ్చు.

దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్ర బాబును పేర్కొంటూ ఓ సంస్థ నివేదిక ఇవ్వడం తెలిసిందే! ఆయన ధనిక సీఎమ్మే కాదు… ప్రాంతీయ పార్టీలలో ధనిక పార్టీ కూడా ఈరోజు తెలుగుదేశమే! ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు కూడా అంతటి ఆర్ధిక శక్తి లేదు. కర్నాటకలో దళ్‌(ఎస్‌)కు చంద్రబాబు సహకారం వుందన్నది జగమెరిగిన సత్యం. ఇక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌ను నడిపించింది చంద్రబాబే! ఇక మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ విజయం వెనుక తన హస్తం ఉందని చంద్రబాబే స్వయంగా చెప్పుకున్నాడు. కాంగ్రెస్‌, దళ్‌(ఎస్‌) పార్టీలను ఆర్ధికంగా ఆదుకున్న చంద్రబాబునాయుడు, రేపు తమను మాత్రం ఆదుకోకపోతాడా? అన్న నమ్మకంతోనే మిగిలిన పార్టీలు కూడా ఆయన పిలుపుకు స్పందిస్తు న్నాయని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here