Home జిల్లా వార్తలు ‘దిశా’ నిర్దేశకుడిగా విపిఆర్‌

‘దిశా’ నిర్దేశకుడిగా విపిఆర్‌

ఇటీవలే కేంద్ర హోం పార్లమెంటరీ కమిటి సభ్యుడిగా పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నియమించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన బాధ్యతను కూడా ఆయనకు అప్పగించింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కో ఆర్డినేషన్‌ అండ్‌ మెయింటెనింగ్‌ కమిటి(డిఐఎస్‌హెచ్‌ఏ) ఛైర్మెన్‌గా నియమిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ మరియు గనులశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘దిశా’ కమిటీ ఛైర్మెన్‌గా జిల్లాలో కేంద్రప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయన్నది ఆయన పర్యవేక్షిస్తారు. పథకాలలో లోటుపాట్లు గురించి కేంద్రానికి తెలియజేస్తారు. జిల్లాలో దాదాపు 40కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని, వాటిని ప్రతి ఒక్క అర్హునికి అందేలా చేస్తానని ఈ సందర్భంగా ఎంపి విపిఆర్‌ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన నరేంద్రసింగ్‌ తోమార్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here