Home జాతీయ వార్తలు ద్రవిడ సూరీడు… అస్తమించాడు

ద్రవిడ సూరీడు… అస్తమించాడు

94 ఏళ్ళ జీవితం.. 80 ఏళ్ళ రాజ కీయం, 60 ఏళ్ళు శాసనసభ్యత్వం, 18 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిత్వం, 50 ఏళ్ళ పార్టీ అధ్యక్షత్వం, 13సార్లు ఓటమి ఎరుగని ఎన్నికల పోరాటం.. అన్నీ కలసిన ద్రవిడ ఉద్యమ సూర్యుడు కలైంజ్ఞర్‌ కరుణానిధి అస్తమించారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ కురువృద్ధుడు, డిఎంకె అధ్యక్షుడు ఈ నెల 7వ తేది సాయంత్రం కన్నుమూశారు. సుమారు ఒకటిన్నర సంవత్సరకాలంగా తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్న ఆయన.. ఇక సెల వంటూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపో యారు. ఆయన మృతితో తమిళనాడు శోకసాగరమైంది. ఎటుచూసినా విషాద వాతవరణంతో తమిళనాడంతా ఆవేదనా భరితమైంది. శాశ్వతనిద్రలోకి జారి పోయిన కన్నతండ్రిని చూసి అళగిరి, స్టాలిన్‌, కనిమొళి తదితరులంతా పెద్ద పెట్టున రోదించారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి కుటుంబసభ్యులంతా తీరని దు:ఖంతో తల్లడిల్లిపోయారు. మరో వైపు అభిమానులు, ప్రజల వేదనారోదన లతో తమిళనాట విషాదం ఆవరించింది. ఆయన అంత్యక్రియలకు జనం లక్షల సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలంతా ఆయన్ను తలచుకొని కన్నీరుమున్నీరయ్యారు. దేశప్రధాని మోడీతో పాటు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్య మంత్రులు చంద్రబాబునాయుడు, కెసిఆర్‌, హెచ్‌డి కుమారస్వామి, పినరయి విజ యన్‌, వివిధపార్టీలకు చెందిన నాయకులు, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి సినీ దిగ్గజాలు, పలురాష్ట్రాల నుంచి అనేక మంది నేతలు, ప్రముఖులంతా తరలివచ్చి ఆయన పార్ధివదేహాన్ని కడసారి సంద ర్శించి కన్నీటి నివాళులర్పించారు.

ద్రవిడ ఉద్యమ సారధి :

ద్రవిడ ఉద్యమ సారధిగా విఖ్యాతి చెందిన కరుణానిధి తమిళనాడు రాజకీ యాల్ని ఏళ్ళతరబడి ఊగించి శాసించారు. ద్రవిడ ఉద్యమాన్ని సాంఘిక సంస్కరణలకే పరిమితం చెయ్యకుండా రాజకీయ ఉద్య మంగా మార్చి తమిళనాట రాజకీయ రంగాన్నే మార్చివేశారు. బ్రాహ్మణవాద వ్యతిరేకత, సామాజిక న్యాయం, హేతు వాదం, నాస్తికత్వం, తమిళభాషా వాదం, హిందీ వ్యతిరేకత వగైరా సిద్ధాంతాల కలయికగా ఉన్న ద్రవిడవాదాన్ని ఒక

ఉద్యమంగా రూపుదిద్దిన నాయకుడు కరుణానిధి. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే పనిచేశారు. జీవితాంతం ఆయన నాస్తికునిగానే జీవితం సాగించారు. కాలక్రమంలో ద్రవిడ ఉద్యమం నీరస పడినా, నేటికీ డిఎంకె మాత్రం నాటి ద్రవిడ ఉద్యమ వాసన మాత్రం కోల్పోలేదు. 1938 ప్రాంతాల్లో రాజకీయాల్లో పాల్గొన్న ఆయన, 1957లో తొలిసారిగా ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం ఏర్పర చుకున్నారు. పరాజయం అన్నదే ఎరుగని ప్రజానాయకునిగా, ఆరుదశాబ్దాల రాజ కీయాల్లో ఏనాడూ ఓడని నేతగా తమిళ నాట ఆయనకున్న స్థానం.. నాటికీ, నేటికీ.. ఏనాటికైనా…చిరస్మరణీయం.

రాజీలేని పోరాటయోధుడు:

కవిగా, రచయితగా, కళాకారునిగా, రాజకీయనాయకునిగా ఆయన తన జీవితంలో బహుపాత్రలను అద్వితీయంగా పోషించి అందరి ప్రశంసలందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.. కలైంజ్ఞర్‌ కరుణా నిధి. ఆయన హయంలో తమిళనాట ప్రజలకు అనేక పథకాలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో కళలకు, భాషా సంస్కృతులకు ఊతమిచ్చి ఊపునందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభ్యుదయం కోసం, తమిళప్రజల అభ్యున్నతి కోసం రాజీలేని పోరాటం సాగించిన మహానేత.. ఎన్నెన్నో సంస్కరణలతో ప్రజల చెంతకు పథకాల ఫలితాలను చేర్చిన ప్రజానేత ఆయన. ప్రాంతీయంగా డిఎంకె పార్టీని ఏర్పాటుచేసి, జాతీయస్థాయిలో సైతం సంకీర్ణ రాజకీయ బావుటాను ఎగురవేసిన రాజకీయ యోధుడాయన. జీవితాంతం తమిళప్రజల సంక్షేమం కోసం అలు పెరుగని కృషిచేసిన యోధుడు కరుణానిధి లేని లోటు ఏనాటికీ తీరనిది. కరుణ మరణంతో తమిళనాడు ఒక పెద్దదిక్కును కోల్పోయినట్లయింది. ఆయన మృతితో..ఓ శకం ముగిసినట్లయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here