Home జిల్లా వార్తలు త్యాగధనుల కలలకు సాకారం.. స్త్రీ విద్యకై ఆవిర్భవించిన ప్రాకారం

త్యాగధనుల కలలకు సాకారం.. స్త్రీ విద్యకై ఆవిర్భవించిన ప్రాకారం

గత మూడు వారాలుగా ‘ఇదీ కస్తూరిదేవి కథ’ పేరుతో వస్తున్న వాస్తవ అక్షర కథనాలకు విశేష స్పందన లభిస్తోంది. సుమారు 90సంవత్సరాల క్రితం మొదలైన ఈ విద్యాలయం చరిత్రని పూసగుచ్చినట్లు ‘లాయర్‌’ పాఠకులకు అందిస్తూ… అవసరమైన సాక్ష్యాధారాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ నిజానిజాలను నెల్లూరీయులకు తెలియజేసే క్రమంలో ముందుకు సాగుతోంది మా(మీ) ‘లాయర్‌’. ఎందరో త్యాగమూర్తులు మహోన్నత ఆశయాలతో ఎన్ని కష్టాలు ఎదురైనా జంకకుండా ఈ సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారు. 9దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థను, సంస్థ ప్రతిష్టని అప్రతిష్టపాలు చేయడం ఏ ఒక్కరి తరమూ కాదు. పటిష్టాత్మక శాసనాలతో కట్టుదిట్టమైన నిర్ణయాలతో రూపొందిన సంస్థ నియమనిబంధనల ప్రకారం సంస్థ ఆస్తులను పరులపాలు చేయడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. ఈ కమిటి ఏ చర్య తీసుకున్నా అది సంస్థ అభివృద్ధి కోసం దోహదపడాలే తప్ప, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోరాదు. ఇలాంటి అనేక కఠినమైన నిర్ణయాలతో కూడిన బైలాస్‌ను ఆనాటి కమిటి సభ్యులు రూపొందించారు. నాటి ఆ మహనీయుల ఆలోచనలు, ఆశయాలు, నిర్ణయాలు ‘లాయర్‌’ పాఠకుల కోసం అందిస్తున్నాం.

స్త్రీ విద్యకు ఎలాంటి వసతులు లేని నాటి రోజుల్లో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధురాలైన శ్రీమతి పొణకా కనకమ్మ గారు, మరికొందరు మహనీయులు అందరూ కలసి బాలికాభ్యున్నతి కోసం ఎన్నెన్నో వ్యయప్రయాసలు పడి

శ్రీ కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపిం చారు. జిల్లాలో స్త్రీవిద్యకు నారు వేసి నీరు పోసింది వారే. అందుకు ఆనాడు వారెన్నో కష్టాలు కూడా ఎదుర్కొన్నారు. ఎందరో మహానుభావుల కృషి, వదాన్యుల సహకా రంతో ఈ సంస్థ నానాటికీ అభివృద్ధి చెందుతూ జిల్లాకే తలమానికంగా నిలి చిందంటే అదంతా ఆ మహనీయుల కృషి వల్లనేనని వేరే చెప్పనక్కర లేదు. అప్పట్లో ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉన్న వదాన్యులు శ్రీ తిక్కవరపు రామిరెడ్డిగారు ఈ పాఠశాల కోసం ఉదారంగా అప్పట్లోనే 50వేల రూపాయలు (ఇప్పుడు ఎన్ని కోట్ల విలువో చెప్పలేం) విరాళం అందజేశారంటే ఎంత గొప్పవిషయమో చూడండి!.. పాఠశాల అభివృద్ధికి ఆ నిధి ఎంతగానో దోహద పడింది. విద్యాలయం పూర్వచరిత్రలో ఈ వివరాలన్నీ ఎంతో స్పష్టంగా ఉన్నాయి.

శ్రీ కస్తూరిదేవి కమిటీ యొక్క అధికారములు :

1. (ఎ) సంస్థ యొక్కగాని, సంస్థల యొక్కగాని ధనము-స్తిర చర ఆస్తులపైన కమిటీకి అధికారము కలిగియుండవ లయును. సదరు ఆస్థి కమిటీకి చెందినది.

(బి). తనకు అవసరమని తోచినటుల సంస్థయొక్క నిధిని గవర్నమెంటువారిచే అంగీకరింపబడిన యెట్టి సొసైటీలోగాని, మరి యే సంస్థలలోగాని నిలువచేయుటకు సర్వాధికారమున్నది.

(సి) సంస్థ పురోభివృద్ధి దృష్ట్యా కార్య కలాపములు గావించుటకు, సంస్థకు సంబంధించిన నిధి, ఆస్తుల సక్రమ నిర్వ హణ, సమర్ధనీయమైన పరిపాలన విష యంలో కమిటీకి సర్వాధికారము కలదు.

(డి) నిర్ధేశింపబడిన లేక తన ఆధ్వ ర్యాన నిర్ధేశింపబడనున్న ఆదేశములను అమలుజరుపుట, అజమాయిషీ చేయుటల్లో కమిటీ సంపూర్ణ అధికారము కలిగి యుండును.

(ఇ). ఉపాధ్యాయులను, తక్కిన సిబ్బం దిని నియమించుటకు, యెవరెవరు యేయే పనులను నిర్వర్తించవలసినది గూడా నిర్ణ యించుటకు అధికారము కలిగియుండ వలయును. ఉపాధ్యాయబృందము యొక్క, తక్కిన సిబ్బందియొక్క పరిస్థితుల కను గుణ్యంగా జీతము నిర్ణయించుట, మార్పు చేయుట, స్కేళ్లను మార్చుటను కమిటీ నిర్వర్తించును.

(ఎఫ్‌). అవసరమైనప్పుడు సిబ్బందిపై క్రమచర్య తీసుకొనుటకు అధికారము కలిగియుండును.

(జి) సంస్థ చక్కగా నడచుటకు అవసర మైన బైలాలను, చట్టములను చేయుటకు కమిటీకి అధికారము కలిగియుండును.

(హెచ్‌) ఇదివరలో తాము చేసిన చట్ట ములను, బైలాలను, నిబంధనలు మొద లగువాటిని అవసరమైనప్పుడు రద్దు చేయు టకు గాని, తాత్కాలికముగా నిలుపుటకు గాని, వాటిలో మరికొన్నిటిని చేర్చుటకు గాని అధికారము ఉండును….

ష.రా: అయిదుమంది సభ్యులకు తక్కువుగా కాకుండా హాజరైన కమిటి వారిచే గావింపబడు ప్రతి చర్య గాని, ప్రొసీడింగ్స్‌ గాని, చట్టసమ్మతముగా యుండును.

కమిటీ కార్యకర్తల బాధ్యతలు:

2. (ఏ) అధ్యక్షుని అధికారములు,

వారు నెరవేర్చవలసిన విధులు :

అధ్యక్షుడు తాను హాజరైన ప్రతిసభకు ఆధిపత్యం వహించవలయును. సంస్థ యొక్క పరిపాలన, దాని విధానములపై సర్వాధికారము కలిగియుండవలయును. అధ్యక్షుడు హాజరుకాని సభకు, అప్పుడు హాజరైన సభ్యుల్లో ఒకరిని సదరు సభకు ఆధిపత్యము వహించుటకు ఎన్నుకొన వలయును. అట్లు తాత్కాలికముగా ఎన్నుకొనబడిన సభ్యునికి ప్రస్తుతమునకు అధ్యక్షునికి ఉన్న అధికారములుండును.

(బి) కార్యదర్శి అధికారములు..

వారు నెరవేర్చవలసిన విధులు :

1. కమిటీని సమావేశపరచుటకు అధికారము ఉండవలయును. బడ్జెటు మీటింగుకు ఏడుదినముల వ్యవ ధియు, సాధారణ సభకు మూడు దినముల వ్యవధియు ఉండవలయును. సదరు మీటింగు నోటీసులో చర్చించబడు అంశ ముల జాబితా చేర్చబడవలయును. సభ జరుగుచుండునప్పుడు ఏ సభ్యుడు గాని చర్చకు సంబంధించిన రికార్డులు కావల యునని కోరిన, సదరు రికార్డు ఇవ్వ వలయును. కార్యదర్శి లేని సమయయులో అధ్యక్షుడు గాని, వారి ఉత్తర్వు పొందిన ఇతర సభ్యుడుగాని సభ్యుల సమావేశ మునకు తాఖీదు పంపవలయును. అధ్య క్షుడుగాని, లేక ఏ ముగ్గురు సభ్యులుగాని ఏదైనా ముఖ్యమైన విషయము, లేక విషయములు చర్చించుటకు సభ్యుల సమావేశము జరుపమని వ్రాతమూల కముగ తెలియజేసేపక్షమున, కార్యదర్శి అట్టి సమావేశము ఏర్పాటు చేయవలయును.

2. సమావేశము యొక్క తీర్మానము లన్నింటిని రికార్డు చేసి పెట్టవలయును.

3. కమిటీకి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచుండవలయును.

4. జమ, ఖర్చులకు జవాబుదారిగా యుండవలయును.

5. సంస్థకు సంబంధించిన యావత్తు ఆస్తికి జవాబుదారిగానున్నూ, కరస్పాం డెంట్‌గానున్నూ యుండవలయును.

6. కమిటీవారు కోరిన ప్రతి విషయ మునకు సంజాయిషీ ఇవ్వవలయును.

7. సంస్థ యొక్క సిబ్బంది మీద అవసరంగా క్రమచర్య తీసుకొనవలసి వచ్చినప్పుడుగాని, తాత్కాలికంగా ఎవరి నైనా ఉద్యోగంలో అవసరంగా ఉంచు టకుగాని, కమిటీ సభ్యులను సమావేశ పరచి వారి అనుమతి పొందుటకు కాలయాపన కలుగను కావున, కార్యదర్శి అట్టి సందర్భములలో, కమిటీ తరఫున తానే ఉత్తరువులను జారీచేయుటకు అధికారం ఉండవలయును. ఇది మరుసటి కమిటీ సమావేశములో మంజూరు కావలసి యుండును.

8. అత్యవసరమైన సందర్భంలో కమిటీ నిర్ణయాన్ని సర్క్యులేషన్‌ పొందుటకు అధికారము కలిగియుండును. కాని ఆ విధంగా తీసుకోబడ్డ నిర్ణయం మరుసటి సమావేశములో కమిటీ అంగీకారము కొరకు ప్రతిపాదించవలెను.

9. కమిటీకి సంబంధించిన నోటీసులు, ఉత్తరములు, ప్రొసీడింగ్సు తీసుకొను అధికారము కలిగిఉండవలెను.

10. కమిటీవారిచే తనకివ్వబడిన అధికారములను అమలుజరపవలయును.

11. ప్రతి అకడమిక్‌ సంవత్సరమునకు ఒక నెల ముందుగానే సంస్థకు సంబం ధించిన చిత్తుబడ్జెట్‌ను కమిటీ వారి మం జూరుకు ఉంచవలెను. ప్రతి ఖర్చు పద్దు బడ్జెటు అలాట్‌మెంట్‌కు లోబడి యుండ వలయును.

12. కమిటీకి సంబంధించిన కోర్టు వ్యవహారములన్నియు కమిటీ తరఫున కార్యదర్శి జరుపవలయును. డాక్యుమెంట్లు వగైరాలు యావత్తును కార్యదర్శి చేవ్రాలు చేయవలయును.

3. కోశాధిపతి అధికారములు :

సంస్థకు సంబంధించిన యావత్తు పైకమును జమ తీసుకొనుచూ, కమిటీ వారు తీర్మానించిన బ్యాంకీలలో డిపాజిట్‌ చేయ వలయును. కార్యదర్శి ఉత్తరువు మేరకు బ్యాంకిమీద చెక్కులు వ్రాయుచుండ వలయును. ప్రతిఖర్చుకు కార్యదర్శిగారిచేత మంజూరు కాబడిన ఓచరు ఉంచ వలయును.

4 ఆడిట్‌ – 5 గుమాస్తా :

కమిటీ లెక్కలు ప్రతి సంవతం సర్టిఫైడ్‌ ఆడిటర్‌ చేత ఆడిట్‌ కాబడవలయును. కమిటీవారు ఆడిటరును వారికిచ్చు వేత నమును నిర్ణయించవలయును. గుమాస్తా.. ప్రతి విద్యార్థిని ఇచ్చు జీతమును తీసుకుని రశీదులో తానున్నూ, పాఠశాలలోని హెడ్‌మిస్ట్రస్‌నున్నూ చేవ్రాలు చేయ వలయును. గుమాస్తా వసూళ్ళు చేసిన సదరు మొత్తమును ప్రతి సాయం త్రము హెడ్‌మిస్ట్రసు గారి వద్ద చెల్లించవలయును. ఆమె దానిని బ్యాంకిలో, కోశాధిపతి పేరిట జమ కట్ట వలయును.

మిసలేనియస్‌ :

(ఏ) సంస్థకు హానికరములగు ఏ విషయములు గాని, సంస్థకు అవమానము కలుగజేయు ఏ ప్రకటన గాని కమిటీ గాని, సభ్యులుగాని, స్కూలు సిబ్బంది గాని ప్రచురించరాదు.

(బి) అవసర ఖర్చులకుగాను కార్యదర్శి వద్ద 50 రూపాయలు ఉంచవలయును”… ఇవీ నాటి కమిటీ నిర్ణయించుకున్న విధి విధానాలు. 1946 మే 2వ తేదిన కస్తూరిదేవి విద్యాలయం పురోభివృద్ధికి వారు తీసుకున్న నిర్ణయాలు.

అప్పట్లోనే ఆ కమిటీ నియమ నిబం ధనలను ఎంత పటిష్టవంతంగా రూపొం దించారో చూడండి. ఎవరెంతగా ప్రయ త్నించినా ఆ ఆస్తులను కానీ, విద్యాలయం నిధులను గానీ ఎవరూ ఏవిధంగానూ చేజిక్కించుకోలేరు.. ఎవరూ దోచుకోలేరు కూడా. అంత పకడ్బందీగా కమిటీని ఏర్పాటు చేశారు. విద్యాలయం పురోభి వృద్ధికైనా సరే, కమిటీ అంగీకరిస్తే తప్ప ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగ డానికి అసలు వీలే లేదు. విద్యాలయ పురోభివృద్ధికి ఏమి చేయాలో.. ఏమి చేస్తే బావుంటుందో.. నిర్ణయించేదంతా కమి టీయే తప్ప మరొక మాట లేదు. ఎందు కంటే, అప్పట్లో ఎందరో సమాజసేవా పరాయ ణులు, విజ్ఞులు కలసి రూపొం దించిన కమిటీ నియమ నిబంధనలివి. కమిటీ అధికారాలేమిటో అందులో ఎంతో పకడ్బందీగా ఉన్నాయి. సంస్థ చక్కగా నడుచుటకు ఆ కమిటీ తన గత నిర్ణయా లను మార్చుకోవచ్చు, కొత్త అంశాలను చేర్చుకోవచ్చు కూడా. ఇదంతా ఆ కమిటీ నియమ నిబంధనల్లో స్పష్టంగా ఉన్నాయి. ‘శ్రీ కస్తూరిదేవి విద్యాలయ కమిటీ అంగ నిర్మాణం’ అనే పేరుతో 1952వ సంవ త్సరం జూన్‌లో ఆ నిర్ణయాలను (7పేజీలు) ముద్రించారు. ‘నెల్లూరు శ్రీ కస్తూరిదేవి విద్యాలయ కమిటీవారి మెమోరాండము’ అనే పేరుతో అది ఆప్పట్లో ప్రచురితమైంది కూడా. (‘లాయర్‌’ పాఠకుల కోసం శ్రీ కస్తూరిదేవి విద్యాలయ కమిటీ అంగ నిర్మాణం.. దానిలోని విషయాలను ఇక్కడ వివరంగా అందించాం). సంస్థ పురోభి వృద్ధి ధ్యేయంగా చేసే కార్యకలాపాల విషయంలో కమిటీకి ఎంతటి విశేషమైన అధికారాలుంటాయో ఈ పూర్వకథనంతా ఆసాంతం మనసుపెట్టి చదివితే మనకే అర్ధమవుతుంది.

సంస్థ పురోభివృద్ధే లక్ష్యం:

సంస్థ పురోభివృద్ధే కమిటీ లక్ష్యం. అందుకనుగుణంగా తీసుకున్న నిర్ణయా లను అమలుచేయడం కమిటీ బాధ్యత. అదే విధంగా కమిటీకి ఉన్న హక్కులు కూడా కమిటీ మెమొరాండంలో స్పష్టంగా ఉన్నాయి. సంస్థ స్థిరచరాస్తులపై కమిటీకి అధికారం ఉంటుందని, ఆ ఆస్తి కమిటీకి చెందిందని, సంస్థ పురోభివృద్ధి దృష్ట్యా కార్యకలాపాలు గావించేందుకు, సంస్థకు సంబంధించిన నిధి, ఆస్థుల సక్రమ నిర్వహణ, సమర్ధనీయమైన పరిపాలన విషయంలో కమిటీకి సర్వాధికారం

ఉంటుందని కమిటీ అధికారాల్లో (ఏ-సి) పొందుపరిచారు. అంతేకాదు, సంస్థ చక్కగా నడిచేందుకు అవసరమైన బైలా లను, చట్టాలను చేసేందుకు కమిటీకి అధికారం ఉంటుందని, సంస్థ పురోభి వృద్ధికి ఇవసరమైతే ఇదివరలో తాము చేసిన చట్టాలను, బైలాలను, నిబంధనలు మొదలైన వాటిని అవసరమైనప్పుడు రద్దుచేసేందుకు, లేదా తాత్కాలికంగా నిలుపుదల చేసేందుకు, లేదా వాటిలో మరికొన్నిటిని చేర్చుటకు కమిటీకి అధికారం ఉంటుందని (జి-హెచ్‌) స్పష్టం చేశారు.

ఆ మహనీయుల త్యాగనిరతి ఏనాటికీ విస్మరించలేనిది :

దేశభక్తి, సమాజసేవాభావం ఉన్న నాటి మహనీయులు నిరుపేదలైన బాలి కలకు విద్య బోధించడానికి ఒక విద్యా లయాన్ని స్థాపించేందుకు అప్పట్లో ఎంతగా కష్టపడ్డారో, ఎంతగా ఆలోచించి ఆ సంస్థ పురోభివృద్ధికి బాటలు వేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వారి అకుంఠిత సేవా భావానికిి హ్యాట్సాఫ్‌ చెప్పక తప్పదు. వారి త్యాగనిరతిని మనం ఏనాటికీ విస్మరిం చలేం. అప్పట్లో వీరితో పాటు మరెం దరో దాతలు ఈ సంస్థ అభివృద్ధికి బాటలు వేస్తూ తమవంతు చేయూతనందించారు. ముఖ్యంగా శ్రీ కస్తూరిదేవి విద్యాలయం భవన నిర్మాణాలకు, అభివృద్ధికి అప్పట్లో దాతలు, వివిధ వర్గాల ప్రజలు అందిం చిన సహకారం ఏనాటికీ మరువలేనిది. ప్రముఖదాత తిక్కవరపు రామిరెడ్డిగారు అప్పట్లోనే 50వేల రూపాయలు ఈ విద్యా లయానికి విరాళంగా ఇస్తే, శ్రీయుతులు మేనకూరు బలరామరెడ్డిగారు 10వేల రూపాయలు, రేబాల కోదండరామిరెడ్డి ధర్మసంఘం తరఫున 6వేల రూపాయలు, బెజవాడ గోపాలరెడ్డిగారు 5వేల రూపా యలు, రేబాల పట్టాభిరామిరెడ్డిగారు 3వేల రూపాయలు, వేలూరు సంజీవప్పనాయుడు రూ.2,500, మోపూరు సౌందర్యమ్మ 1000 రూపాయలు మెట్టా శేషమ్మ రూ. 900, వావిళ్ళ వెంకటశాస్త్రులు రూ.500 ఇలా ఎందరో వదాన్యులు తమ విరాళా లిచ్చి జిల్లాలో బాలికావిద్యకు బాటలు వేశారు. ఇంకా పాఠశాలకు అవసరమైన గదుల నిర్మాణానికి కొందరు దాతలు ముందుకువస్తే, మరికొందరు తమవంతు చేయూతగా బీరువాలు, పుస్తకాలు వగై రాలు విరాళంగా ఇచ్చారు.

జి.వి.కె.రెడ్డి వంటి అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం

కస్తూరిదేవి కల్యాణమండపాలపై ఆధారపడి బతకాల్నా?

హవ్వా… ఇదేం చోద్యం, ఇదేం విడ్డూరం, ఇదేం పోరాటం? కస్తూరిదేవి విద్యాలయ కమిటిపై రోజుకో నిందేస్తు న్నారు. జి.వి.కె.రెడ్డి ఇప్పటివరకు కస్తూరిదేవి విద్యాలయ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలుపైగానే వెచ్చించారని ఓ వైపు కమిటి సభ్యులు పదేపదే చెప్తున్నా చెవికెక్కించుకోకుండా… ఆయన కస్తూరిదేవికి ఒక్క రూపాయి కూడా దానం చేయలేదని అవాకులు చవాకులు పేలుతూనే ఉండడం మూర్ఖత్వం. సామాజిక మాధ్యమాలలో అర్ధం పర్ధం లేని సమాచారాలని చేరవేస్తున్నారు.

కస్తూరిదేవి విద్యాలయ అభ్యున్నతి కోసం జి.వి.కె.రెడ్డి అనేక సందర్భాలలో తన వదాన్యతను చాటుకున్నారు. ఆ క్రమంలోనే ఆక్రమణలో వున్న మల్లెతోటలను 2001లో 70లక్షల రూపాయలు చెల్లించి ఖాళీ చేయించారు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా కమిటి వద్ద ఉన్నాయి. ఇక నెలనెలా జీతాల రూపంలో 2లక్షలకు తక్కువ కాకుండా గత పది సంవత్సరాల కాలంలో పలు సందర్భాలలో సుమారు ఒకటిన్నర కోటి రూపాయలు ఇచ్చింది కూడా ఆయనే! ఇవన్నీ జి.వి.కె.రెడ్డి చేయకపోతే నందనారెడ్డి లేదా ఆమెతో గళం కలుపుతున్న ‘సిరిభక్షక’ కమిటి చేసిందా? అలాంటి జి.వి.కె.రెడ్డి కస్తూరిదేవి కళ్యాణ మండపాల బాడుగలు ఏడాదికి 40లక్షలు దిగమింగేస్తున్నారంటూ అసత్యపు ఆరోపణలు చేయడం ఎంతవరకూ సబబు? ఆయన సంస్థలో ఇచ్చే జీతాలలో 1శాతం కూడా వుండదు ఈ నలభై లక్షలు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, చేతికి ఏదనిపిస్తే అది వ్రాయడం ఈ ‘సిరిభక్షణ’ కమిటీకే చెల్లింది.

కస్తూరిదేవి కమిటీకి ఓ ఆడిటర్‌ వుంటాడు. లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. ఎవరికైనా అనుమానాలుంటే ఎప్పుడైనా నివృత్తి చేసుకోవచ్చు. ఇలా అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. పని కట్టుకుని ఓ వర్గాన్ని దూషిండమే ధ్యేయంగా చరిత్ర కలిగిన పెద్ద కుటుంబాలపైన బురద చల్లడమే లక్ష్యంగా నిత్యం ఆరోపణలు చేయడం హాస్యాస్పదం.

కస్తూరిదేవి విద్యాలయానికి జి.వి.కె.రెడ్డి చేసిన ఆర్ధిక సహాయం, ఆయన పలు సందర్భాలలో స్కూలును ఆదుకున్న విషయాలతో పాటు తాను కమిటి సభ్యురాలుగానే వున్నానంటూ మాగుంట పార్వతమ్మ ధీటుగానే సమాధానం చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారానే కాకుండా పత్రికా ప్రకటనల ద్వారా కూడా ఆమె ఈ విషయాలను స్పష్టం చేశారు.

పార్వతమ్మని కమిటీ నుండి తొలగించారని చెప్పేవాళ్ళు ఇప్పుడేమంటారో…?

ఇలా వ్యక్తిగత దూషణలతో బజారుకెక్కడం సిగ్గు చేటైన విషయం. ప్రపంచ స్థాయిలో వ్యాపార లావాదేవీలతో క్షణం తీరిక లేకుండా గడిపే జి.వి.కె.రెడ్డి లాంటివారు తమ వితరణ గుణంతో ఎంతో పవిత్రమైన… చరిత్రాత్మకమైన కస్తూరిదేవి విద్యాలయం పురోగతికి పూనుకోవడం ఎంతైనా అభినంద నీయం! అలాంటి వదాన్యులపై లేనిపోని విమర్శలు చేస్తే ఆకాశంపై ఉమ్మినట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here