Home జిల్లా వార్తలు తుప్పు పట్టిన బోర్లు

తుప్పు పట్టిన బోర్లు

నెల్లూరులోని పలు ప్రాంతాల్లో అప్పుడే నీటి కటకట మొదలైంది. వేసవితాపం పెరుగుతున్నకొద్దీ ఈ సమస్య మరింత జటిలం కానుంది. ఇప్పటికే వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో బావుల్లో నీరు కూడా ఇంకిపోతోంది. అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో మంచినీటి బోర్లు ఉన్నా అవి ఎంతోకాలంగా మరమ్మత్తు లకు గురై ఉండడంతో ఈ ఎండాకాలంలో అవి సరిగా ప్రజలకు ఉపయోగపడడం లేదు. జిల్లావ్యాప్తంగా అనేకప్రాంతాల్లో ఉన్న బోర్లు కూడా నామమాత్రంగానే పని చేస్తున్నాయి. ఎంతోకాలంగా వాటి పర్యవేక్షణను ఆయా ప్రాంతాల్లోని అధికారులు కానీ, సిబ్బంది కానీ పట్టించుకోకపోవడంతో అనేక బోర్లలో నీళ్ళు రాక ప్రజలు నానా బాధలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో నీటి కోసం మహిళలు ఎంతెంతో దూరం వెళ్ళి ఎక్కడో వ్యవసాయభూముల్లో బోర్లలో నీళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో వారి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లాలో మంచినీటి ఎద్దడి ముంచుకురాకముందే జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యలను పరిష్కరించాల్సి

ఉంది. ముఖ్యంగా నెల్లూరులోని 32వ డివిజన్‌లో కావేరినగర్‌, శివాజీనగర్‌ తదితర ప్రాంతాల్లో బోర్లు తుప్పుపట్టి చెడిపోయి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో బోర్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. అయినా బోర్లున్నా నీళ్ళు రాకుంటే ప్రయోజనం ఏముంది?..ఎండాకాలం తీవ్రం కాకముందే అధికారులు వెంటనే అన్ని ప్రాంతాల్లోని బోర్ల స్థితిగతులను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైనవాటికి వెంటనే మరమ్మ తులు చేయించి వాటిని వినియోగంలోకి తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here