నమ్మకానికి అమ్మలాంటిది పిఎస్ఎల్వి సిరీస్. నిజమే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు పిఎస్ఎల్వి అత్యంత నమ్మ కస్తురాలైంది. విశ్వాసంగా వుంటుంది. క్రమశిక్షణ కలిగి చెప్పిన పని చెప్పినట్లు చేసే గుడ్ స్టూడెంట్‌గా వుంది. కాబట్టే పిఎస్ఎల్వి ప్రయోగం అంటే ఇస్రో శాస్త్రవేత్తలకు ఎలాంటి టెన్షన్ ఉండడం లేదు.
ఇస్రో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పిఎస్ఎల్వి మరోసారి నిలబెట్టుకుంది. 29వ తేదీ గురువారం ఉదయం 9.58 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుండి ప్రయో గించిన పిఎస్ఎల్వి-సి43 విజయవంతమైంది. మొత్తం నాలుగు దశలలో జరిగిన ఈ ప్రయోగం ద్వారా 31ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలలో ప్రవేశ పెట్టారు. మన దేశానికి చెందిన 380 కిలోల బరువు గల హైసిస్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. దేశ రక్షణ రంగానికి ఇది సేవలందిస్తుంది. అలాగే అమెరికాకు చెందిన ఫ్లోక్3, ఆర్ ఉపగ్రహాలు 16, గ్లోబల్-1, సిసిరో-8, లీమూర్ 4, హెచ్శాట్-1 ఉపగ్రహాలు మొత్తం 23 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టడం జరిగింది. ఇవి కాకుండా ఆస్ట్రేలియాకు చెందిన సెన్ట్యూరీ, కెన్యాకు చెందిన కేప్లేర్, కొలంబియాకు చెందిన ప్యాక్, ఫిన్లాండ్కు చెందిన లియార్టర్ హలో వరల్డ్, మలేషియాకు చెందిన ఇన్నోశాట్-2, నెదర్లాండ్‌కు చెందిన హిచేర్-1, స్పెయిన్‌కు చెందిన 3క్యాట్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా ఇస్రో అంతరిక్ష వాణిజ్యంపై మరింత నమ్మక మేర్పడింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇక ముందు తమ ఉపగ్రహాల ప్రయోగాలకు ఇస్రోనే
ఉత్తమ మార్గంగా ఎంచుకునే అవకాశాలున్నాయి.
