Home రాష్ట్రీయ వార్తలు తల్లి.. చెల్లి… మధ్యలో జగన్‌

తల్లి.. చెల్లి… మధ్యలో జగన్‌

తల్లి… కొడుకు… చెల్లి… రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దుమ్ము దులుపుతున్న కుటుంబం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న కుటుంబం… అదే వై.యస్‌. కుటుంబం.

వైసిపి అధినేతగా ఓ పక్క వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి సుడిగాలి ప్రచారం… ఇంకో పక్క ఆయన తల్లిగా నా బిడ్డకు ఒక అవకాశమిచ్చి మీ రాజన్న రాజ్యం తీసుకుని రాండంటూ వై.యస్‌.విజయమ్మ ప్రచారం… మరోపక్క జగన్‌ సోదరిగా తన అన్నకు చేయూతగా… ”ప్రజాతీర్పు… బైబై బాబు” అంటూ షర్మిల ఇస్తున్న పిలుపులు… తెలుగుదేశం శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజల స్పందనలో

ఈ ముగ్గురూ ఒకరికొకరు తీసిపోవడం లేదు. ముగ్గురి సభలకు కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు. వారి ప్రసంగాలకు సైతం విశేష స్పందన వస్తోంది. ప్రతిరోజూ ముగ్గురూ మూడు జిల్లాల్లో పర్యటనలు సాగిస్తూ… రాష్ట్రం అంతటా కూడా వైసిపి కేడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభలకు తగ్గకుండా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌ ప్రచారానికి, జగన్‌ చేస్తున్న పోరాటానికి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలమ్మలు కొండంత అండగా నిలిచారని చెప్పవచ్చు. కాని, ఇక్కడ చంద్రబాబుకు ఆ ఛాన్స్‌ లేకుండా పోయింది. భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు ప్రచారానికి రారు, కొడుకు లోకేష్‌ వుంటే మంగళగిరిలో దింపాడు. లోకేష్‌ రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేసినా పార్టీకి అంతగా ఒరిగేదేమీ వుండదు. అభ్యర్థులు కూడా ఆయన ప్రచారాన్ని ఇష్టపడరు. చంద్రబాబు ఒక్కడే పార్టీ ప్రచారకర్త. ఆయన ఫరూక్‌ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ లాంటి జాతీయ నాయకులను ప్రచారానికి తీసుకొచ్చాడు. వీళ్ళ వల్ల తెలుగుదేశంకు అదనంగా నాలుగు ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రచారంలో పచ్చ మీడియా చంద్రబాబుకు పూర్తి అండగా వుంది. కొన్ని పత్రికలు, ఛానెల్స్‌ అయితే తెలుగుదేశం జెండాను తమ సంస్థల ‘లోగో’ల స్థానంలో పెట్టుకోలేదన్న మాటేగాని అవి చంద్రబాబు కోసం పార్టీ ఏజెన్సీలలాగే ప్రచారం చేస్తున్నాయి. అయితే వీళ్ళ ప్రచారమంతా కూడా వైయస్‌ కుటుంబసభ్యుల ప్రచారం ముందు వెలవెలబోతోంది.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here