Home జిల్లా వార్తలు తమ్ముడు తోడొచ్చేనా?

తమ్ముడు తోడొచ్చేనా?

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కొడుకులైన ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డిలు తెలుగుదేశం లోనే వున్నారు. ఇక తండ్రి చనిపోవడంతో రాజకీయంగా కూడా వారికి పెద్దదిక్కు చిన్నాన్న అయిన రామనారాయణరెడ్డే! రామనారాయణరెడ్డి వైసిపిలో చేరితే టీడీపీలో వుండి వీళ్ళు స్వయంగా ఎదిగే పరిస్థితి వుండదు. అదీగాక తెలుగుదేశంలో వున్నప్పుడే ఆనం వివేకాకు అన్యాయం జరిగింది. ఆయనకకు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీని ఇవ్వకుండా అసంతృప్తికి గురి చేసారు. ఈ బాధ ఆయన కొడుకుల్లోనూ వుంది. కాబట్టి రామనారాయణరెడ్డితో పాటే వాళ్ళూ వైసిపిలో చేరే అవ కాశాలెక్కువ.

పోతే ఆనం జయకుమార్‌రెడ్డి పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న! 2014 ఎన్నికలకు ముందే ఆయన తన సోదరులతో విడి పోయాడు. అప్పుడు జైసమైక్యాంధ్ర అభ్యర్థిగా నిలబడ్డాడు. ఎన్నికల తర్వాత తెలుగుదేశంలో చేరి మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నాడు. అప్పటినుండి ఆనం వివేకా, రామనారాయణరెడ్డిలతో దూరం పాటిస్తూ వచ్చాడు. ఈరోజు వివేకా లేడు, రామనారాయణ రెడ్డితో జయకు పెద్ద విభేదాలేమీలేవు. ఇటీవల రామనారా యణరెడ్డి పార్టీ మారుతున్నాడన్న ప్రచారం జరిగినప్పుడు కూడా జయకుమార్‌రెడ్డి చంద్రబాబును కలిసి తాను తెలుగు దేశంలోనే వుంటానని చెప్పొచ్చాడు. ప్రస్తుతానికి ఆయనతో కలిసి తెలుగుదేశంలో కొనసాగుతున్న జయకుమార్‌రెడ్డి తన అన్నతో కలిసి వైసిపిలో చేరే అవకాశాలు లేవు. భవిష్యత్‌లో ఆయన రాజకీయంగా ఎటువైపు అడుగులు వేసినా ఆదాలతో కలిసే నడుస్తాడని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here