Home రాష్ట్రీయ వార్తలు డైవర్షన్‌ అంకుల్స్‌

డైవర్షన్‌ అంకుల్స్‌

తెలుగు టీవీ ఛానల్స్‌లో డైవర్షన్‌ ఆంటీ ఇంటర్వ్యూలను అందరూ చూసే వుంటారు. రానాకు రావాల్సిన మరణాన్ని రామానాయుడుకు డైవర్ట్‌ చేసానని, ఇండియాకు రావాల్సిన సునామీని ఇండోనేషియాకు మళ్లించానని, అమెరికాలో పేలాల్సిన బాంబులను ఆప్ఘనిస్థాన్‌లో పేలేలా చేసానని ఈ డైవర్షన్‌ ఆంటీ చెబుతుంటుంది. చూసేవాళ్ళకు కూడా అదో కామెడీగా వుంటుంది.

ఈ డైవర్షన్‌ ఆంటీ లాగానే ఆంధ్రా రాజకీయాలలో డైవర్షన్‌ అంకుల్స్‌ కూడా తయారయ్యారు. వీళ్ళ పని చంద్రబాబు వ్యతిరేక ఓట్లను వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి పోకుండా డైవర్ట్‌ చేయడం. ఇందుకోసం రాజకీయ తెరపైకి వచ్చిన ఆ డైవర్షన్‌ అంకుల్స్‌ పవన్‌ కళ్యాణ్‌, జె.పి.నారాయణ, జె.డి.లక్ష్మీనారాయణ.

2019 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర విభిన్నంగా వుండబోతోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుకు ఆయన సహకరించారు. కాని రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లేయమని చెప్పినా ఆయన అభిమానాలుగాని, మద్దతుదారులు గాని ఓట్లేయరు. ఆ ఓట్లు ఈసారి జగన్‌కు పడే అవకాశముంది. అలా పడితే చంద్రబాబుకి తీరని నష్టం. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను జగన్‌కు పోకుండా తన వైపుకు మళ్లించుకోడానికే పవన్‌ జనసేన ద్వారా సొంతంగా పోటీ చేసేదానికి సిద్ధమవుతున్నాడు. ఈ పవన్‌ చంద్రబాబు పంజరంలోని చిలుకేనని ముందునుండే అంచనా వుంది. బాబు డైరక్షన్‌లోనే ఈ చిలుక మాట్లాడుతోంది. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు, విమర్శలు అన్నీ కూడా ఆయన వ్రాసిచ్చిన స్క్రిప్ట్‌లో భాగమే! ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, చంద్రబాబు చేస్తున్న రాజ్యాంగ, ప్రజాస్వామ్య ఉల్లంఘనలను ప్రశ్నించకుండా మాటికి మాటికి జగన్‌పై విమర్శలు చేస్తున్నప్పుడే ఈ పవన్‌, బాబు ఏజెంట్‌ అన్నది అర్ధమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి మరో నాయకుడు కొత్తగా పుట్టుకొచ్చాడు. ఆయనే జె.డి.లక్ష్మీనారాయణ. ఒకప్పుడు లోక్‌సత్తా పార్టీని పెట్టి ఆ పార్టీ నడిపే సత్తా లేక రాజకీయాల నుండే తప్పుకున్న జయప్రకాశ్‌ నారాయణ వారసుడిగా నేను వచ్చానంటున్నాడీయన. లోక్‌సత్తాను అద్దెకు తీసుకోవాలనికొని, ఆ ప్రయత్నం మానుకున్నాడు. జనసేనతో పాటు లక్ష్మీనారాయణ ద్వారా కూడా కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను డైవర్ట్‌ చేసే పన్నాగం ఇది. ఇక వీటికి సిపిఎం, సిపిఐ వంటి పార్టీలు కూడా తమవంతు తోడ్పాటునందించడానికి సిద్ధంగా వున్నాయి. మొత్తానికి ఈ డైవర్షన్‌ అంకుల్స్‌ తుది టార్గెట్‌ జగన్‌ను అడ్డుకోవడమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here