Home జిల్లా వార్తలు ట్రయిల్‌(రైల్‌)రన్‌ విజయవంతం

ట్రయిల్‌(రైల్‌)రన్‌ విజయవంతం

నెల్లూరుజిల్లా కృష్ణపట్నం, కడప జిల్లాలోని ఓబుళవారిపల్లె మధ్య 95 కిలోమీటర్ల రైల్వేలైన్‌ పూర్తి కావొచ్చింది. వెలుగొండల్లో 7 కిలోమీటర్ల సొరంగ మార్గం ట్రాక్‌ మిగిలివుంది. మార్చికల్లా ఈ రైల్వేలైన్‌ ప్రారంభించే దిశగా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ లైన్‌పై రైల్వే అధికారులు రైల్‌ ఇంజన్‌తో ట్రయిల్‌రన్‌ నిర్వహిం చారు. అరటిపిలకలు, మామిడి ఆకులతో అలంకరించిన ఇంజన్‌తో ఓబుళవారిపల్లి నుండి వెలుగొండల్లో సొరంగ మార్గం వరకు ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. 120 కిలోమీటర్ల వేగంతో కొత్తగా వేసిన ట్రాక్‌పై రైలింజన్‌ పరుగులు తీస్తుంటే ఆ ట్రాక్‌ ఇరువైపుల గ్రామాల ప్రజలు ఎంతో ఆసక్తితో తిలకించారు. ఓబులవారిపల్లి నుండి చెర్లోపల్లి, మంగంపేట స్టేషన్‌లను దాటుకుని రైలు వెలుగొండ సొరంగ మార్గంలోకి కిలోమీటరు దాకా వెళ్లింది. వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కు వెళ్లి ఓబులవారిపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ట్రయిల్‌ రన్‌ విజయవంతం కావడంతో రైల్వే అధికారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కాగా, ఉపరాష్ట్రపతి యం.వెంకయ్య నాయుడు ప్రత్యేక చొరవతో నిర్మితమైన మార్గమిది. ఈ లైన్‌లో ముందుగా ప్రయాణికులను చేరవేసే ప్యాసింజర్‌ రైళ్లను నడపాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రైల్వే అధికారులు ఆఘమేఘాల మీద ఈ మార్గంలోని రైల్వేస్టేషన్‌లన్నింటిని ప్రయాణీకులు రైలు ఎక్కి దిగేందుకు వీలుగా తీర్చిదిద్దు తున్నారు. రైల్వేలైన్‌ ప్రారంభం కాగానే నెల్లూరు, కడపల మధ్య ప్యాసింజర్‌, మెమూ రైళ్లను తిప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here