Home గల్పిక టీడీపీ ఎంపీలకు పార్లమెంటులో సన్మానం

టీడీపీ ఎంపీలకు పార్లమెంటులో సన్మానం

ఢిల్లీలోని పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌. లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులంతా వచ్చివున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ప్రధాని నరేంద్రమోడీ, యూపిఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఇంకా ఏర్పడని ఫ్రంట్‌ ఛైర్మెన్‌, హైటెక్‌రత్న చంద్రబాబు, వివిధ పార్టీలకు చెందిన మమతా బెనర్జీ, శరద్‌పవార్‌, నితీష్‌ కుమార్‌, స్టాలిన్‌, నవీన్‌పట్నాయక్‌, ఒమర్‌ అబ్దుల్లా తదితరులు ఆసీనులై వున్నారు. ఆరోజు రాష్ట్రపతి సెలవులో వుండడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చాడు. టీడీపీ ఎంపీలంతా ఆంధ్రాభవన్‌ నుండి పసుపు కండువాలు మెడల్లో వేసుకుని గుర్రాల మీద బ్యాండ్‌మేళం, బాణాసంచా మోతలతో ర్యాలీగా పార్లమెంటుకు వచ్చారు. పార్లమెంట్‌ గేటు వద్ద మాజీ మంత్రి గల్లా అరుణ తన కొడుకు గల్లా జయదేవ్‌కు దిష్టితీసి బొట్టు పెట్టి లోప లకు పంపింది. అందరూ రాగానే…. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్య క్షోపన్యాసం మొదలుపెడుతూ… దేశం లోని అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపం చంలో వున్న 198దేశాల భాషల్లో సభ్యు లకు స్వాగతం పలికాడు. ఆయన భాషా ప్రావీణ్యానికి సభ్యులు చప్పట్లతో అభినం దించారు. వెంకయ్య తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఎప్పుడూ తిట్టు కుంటూ తన్నుకుంటుండే మనం ఎంతో సామరస్యంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి ముఖ్యకారణ మైన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీని, అలాగే తెలుగుదేశం ఎంపీలను మనం ఘనంగా సన్మానించుకోవలసిన అవసర ముంది. ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ప్రారంభిం చాలని కోరుతున్నాను… అని చెబుతుం డగా… సభ మధ్యలో నుండి ఏం పొడి చారని వారికి సన్మానం అనే అరుపు విని పించింది. ఎవరా అని అందరూ అటు వైపు చూసారు. అక్కడ సేవాసుధాకర, వైసిపి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి… పార్లమెంట్‌లో అడుగుపెట్టాక ఫస్ట్‌టైం నోరు విప్పాడు. ఆ విప్పడం కూడా గర్జిస్తూ… అందరూ ఆశ్చర్యంగా తనను చూస్తుండగానే వేమిరెడ్డి మరింత ఆవే శంతో ఏం పొడిచారని చేస్తున్నారు సార్‌ వారికి సన్మానాలు, ప్రత్యేకహోదా తెచ్చారా… పోలవరం నిర్మించారా… అమరావతికి ఇటుకలు పేర్చారా… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కట్టారా…? ఎందుకు చేయాలి సార్‌ వారికి సన్మానాలు అంటూ ప్రశ్నించాడు. ఆయన ఆవేశం చూసి అన్నిపక్షాల సభ్యులతో పాటు సొంత పార్టీ వైసిపి సభ్యులు కూడా నిశ్చేష్టు లయ్యారు. ఆ సమయంలో వారి కంటికి ఆయన… కనిపించని నాలుగో సింహం అంటే ఇలాగే వుంటుందేమో అన్నట్లు కనిపించసాగాడు. ఓ ఐదు నిముషాలు నిశ్శబ్ద వాతావరణం… ఆ తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ… వెంకయ్య… ప్రభాకరా, ఈ సభకు నువ్వు కొత్త… నీకు ఈ సభ కొత్త. వాళ్ళకెందుకు సన్మానం చేస్తున్నామో తెలుసుకోవాలంటే నిన్ను ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్ళాల్సిందే అని చెప్పి వేమిరెడ్డి కళ్ళముందు వేళ్ళతో ఎయిర్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేసి సీన్‌లు ప్లే చేసాడు.

———————

అది బీజేపీ కార్యాలయం. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు అనంతకుమార్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీ, నిర్మలాసీతారామన్‌, సురేష్‌ప్రభు, పలువురు ఎంపీలు నీరసంగా కూర్చుని వున్నారు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి భవన్‌లో పంజరంలోని చిలుకలా కొట్టు కుంటున్న వెంకయ్యకు ఒక్కసారి తన పార్టీ ఆఫీసు చూడాలనిపించింది. అయితే రెగ్యులర్‌ గెటప్‌లో వెళితే అందరూ గుర్తు పట్టేస్తారని, ప్రోటోకాల్‌ నియమాలను

ఉల్లంఘించినట్లవుతుందని భావించి వెంటనే గెటప్‌ మార్చాడు. జీన్స్‌ఫ్యాంట్‌, అయిదారు రంగులు కనిపించే టీషర్ట్‌ వేసుకుని నెత్తిన శ్రీలంక క్రికెటర్‌ మలింగ లాగా జట్టు కనిపించేలా విగ్గు పెట్టుకుని ‘హార్లీడేవిడ్‌సన్‌’ బైక్‌పై రయ్‌ మంటూ బీజేపీ ఆఫీసుకు దూసుకుపోయాడు. బయట బైక్‌ పార్క్‌ చేసి లోపలకు వెళ్లాడు. వెంకయ్యను చూడగానే రాజ్‌నాథ్‌సింగ్‌… ఏయ్‌ ఎవర్నువ్వు, ఏ దేశం నుండి వచ్చావ్‌, అయినా అనుమతి లేకుండా లోపలకు రావడమేనా… ఏయ్‌ సెక్యూరిటీ ఇతనిని లోపలకు ఎవరు పంపించారు, బయటకు పంపించేయండి అని అరుస్తుండగా వెంకయ్య టక్కున తన నెత్తిన వున్న విగ్గు తీసాడు. అంతే అందరూ ఆయన్ను చూసి షాక్‌ అయ్యారు. కొద్దిసేపటికి మోడీ తేరుకుని… ఏం వెంకయ్యాజీ ఈ గెటప్‌లో వచ్చారు అని అడిగాడు. ఏం చేయమంటారు… మీరేమో నన్ను ఆ ఉపరాష్ట్రపతి భవన్‌లో బిగిస్తిరి, నా మనసేమో పార్టీ ఆఫీసు మీదకు లాగుతుండె… ఇక ఉండబట్టలేక పార్టీ ఆఫీసును చూసిపోదామని వచ్చాను. అయినా మీరేంటి దిగులుగా వున్నారని వెంకయ్య అడిగాడు. అందుకు మోడీ… జీవితంలో రోజూ పరుగెడుతూనే వున్నాం. దేశదేశాలు తిరుగుతున్నాం, భారత ప్రతిష్టను పెంచుతున్నాం… దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ జెండాను ఎగరేస్తున్నాం… అయినా కూడా మా జీవితాలలో ఏదో తెలియని లోటుం దనిపిస్తోంది. దాని వల్లనే మానసికంగా ఉత్తేజితులం కాలేకపోతున్నామన్నాడు. దానికి వెంకయ్య… మీ మానసిక

ఉల్లాసం తర్వాత… రేపు అవిశ్వాస తీర్మానం వుంది… ఆ చంద్రబాబు అసలే ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ… అస్త్రశస్త్రాలతో మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టి పుష్కరాల నదుల నీళ్ళన్నీ తాగించగలడు… ఆయన శిక్షణలో టీడీపీ ఎంపీలు రాజకీయ యోధులుగా సభకు వస్తారు. వారి దాడిని తట్టుకోవాలంటే కష్టం… రేపు సభలో టీడీపీ ఎంపీలు చేయబోయే భీకరదాడిని తలచుకుంటే నాకే భయం వేస్తుంది. ఇక మీ పరిస్థితి ఎలా వుంటుందో… జాగ్రత్త! ముందు టీడీపీ ఎంపీల దాడిని ఎదుర్కోవ డానికి ప్రిపేర్‌కండి అని చెప్పాడు. ఇక్కడితో సీన్‌లు అయిపోయాయి. వేమిరెడ్డి అంతా చూసి… ఇక్కడ వాళ్ళకు సన్మానం చేసేంత సీనేముంది అని ప్రశ్నిం చాడు. అది పార్ట్‌-1, ఇప్పుడు పార్ట్‌-2 చూడు… నువ్వు రాజ్యసభలో కూర్చు న్నావు కాబట్టి ఇది చూసుండవు అంటూ తన సెల్‌ఫోన్‌ తీసి ఒక వీడియో ఆన్‌ చేసాడు వెంకయ్య…

లోక్‌సభలో రాహుల్‌గాంధీ సీరి యస్‌గా ప్రసంగించాడు. ప్రసంగం ముగియగానే నేరుగా మోడీ వద్దకు వెళ్ళి కౌగిలించుకున్నాడు. రాహుల్‌ ఆత్మీయ ఆలింగనంతో మోడీలో మార్పు వచ్చింది. ఎంతసేపు విదేశీ అధ్యక్షులను ఆలింగనం చేసుకోవడం తప్పితే, స్వదేశీ నేతలను ఆలింగనం చేసుకున్నది లేదు. స్వదేశీ నేతల ఆలింగనంలో ఎంత ప్రేముందో ఆయనకు ఆ క్షణంలో తెలిసొచ్చింది. ఇప్పటిదాకా ఇలాంటి ఆత్మీయ స్పర్శను కోల్పోయినందుకు ఆయనలో బాధేసింది. రాహుల్‌ తర్వాత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు మాట్లాడే ఛాన్స్‌ వచ్చింది. అయితే జయదేవ్‌ మాట్లాడలేదు… స్పీకర్‌ ముందు పెద్ద స్క్రీన్‌ ఒకటి ఏర్పాటు చేయించాడు. ఎదురుగా ప్రొజెక్టర్‌ ఒకటి పెట్టాడు. తర్వాత ఆయన మాట్లాడుతూ అధ్యక్షా, ఒక ముఖ్యమంత్రి, ఒక దేశానికి రాజు ఎలా నడుచుకోవాలో నేను మాటల్లో చెప్పను, మీకు చూపిస్తాను అంటూ మొదట ‘భరత్‌ అను నేను’, ఆ తర్వాత ‘బాహుబలి 1 & 2’ సినిమాలు వేసి చూపించాడు. సభ్యులందరూ ఎంతో ఆసక్తిగా వాటిని చూసారు. సినిమాలు అయిపోయాక… మోడీ సభనుద్దేశించి… నేను జీవితంలో ఏం మిస్‌ అవుతున్నానో ఈరోజు తెలిసింది. పరిపాలనా బిజీలో పడి ఎంటర్‌టైన్‌మెంట్‌ను బాగా మిస్సవు తున్నాను. ఈరోజు సభికులందరికీ వినోదం పంచిన రాహుల్‌ను, గల్లా జయ దేవ్‌ను రేపు పార్లమెంటులో సన్మానించ నున్నాం అని ప్రకటించాడు. ఇక్కడితో వెంకయ్య సెల్‌లో వీడియో ఆగిపోయింది. అప్పుడు వెంకయ్య… ఇప్పుడు చెప్పు ప్రభాకరా… వాళ్ళను సన్మానించడం తప్పంటావా? అని అడిగాడు. దానికి వేమిరెడ్డి… ముమ్మాటికీ తప్పే… కేవలం లోక్‌సభలో మాత్రమే ఆ సినిమాలు చూపించి రాజ్యసభలో ప్రదర్శించక పోవడం తప్పుకాదా? మేం మనుషులం కాదా? మాకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలని వుండదా? అని ఆయన వేసిన ప్రశ్నకు వెంకయ్య మరో మాట మాట్లాడ లేకపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here