Home జిల్లా వార్తలు టిడిపికి టాటా చెప్పిన పెళ్ళకూరు

టిడిపికి టాటా చెప్పిన పెళ్ళకూరు

కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. తెలుగుదేశంలో ఇన్నేళ్ళు కష్టపడ్డా సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదనే బాధతోనే ఆయన పార్టీని వీడాడు.

2009లో కోవూరులో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పార్టీని వదిలి కాంగ్రెస్‌కు మద్దతుగా వెళ్ళాడు. 2012 ఉపఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశంకు అభ్యర్థే లేకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి ఇక్కడ టిడిపి కేడర్‌కు దిక్కయ్యాడు. అయితే 2014 ఎన్నికల్లో పెళ్ళకూరును కాదని కాంగ్రెస్‌ నుండి వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి సీటిచ్చారు. అయితే పెళ్ళకూరుకు ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్ళలో ఏ పదవీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ ఆయన కోవూరు సీటు అడిగాడు. పార్టీ నాయకత్వం ఆయన పేరును కోవూరు, నెల్లూరురూరల్‌తో పాటు నెల్లూరు లోక్‌సభకు కూడా పరిశీలనలో పెట్టారు. అయితే చివరకు ఎక్కడా సీటు రాలేదు. తెలుగుదేశంలో వుంటే ఇంకెంత కాలమైనా ఇలాగే వుంటామని భావించిన ఆయన తెలుగుదేశంకు రాజీనామా పడేసి వైసిపిలో జాయినయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here