Home రాష్ట్రీయ వార్తలు జోడుగుర్రాలపై నారా వారి సవారీ

జోడుగుర్రాలపై నారా వారి సవారీ

ఎన్నికలొచ్చేసరికి ఏదో ఒక పార్టీ తోడు వెదుక్కోవటం చంద్రబాబు నైజం. పొత్తు లేకుండా ఆయన ఒంటరిగా ఎన్నికలకు పోయిన సందర్భమే లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనల సహకారంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడన్నది బహిరంగ సత్యం. మరి వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు లేకుండా ముందుకు పోగలడా? 2014 ఎన్నికల్లో ఆయనకు సహకరించిన బీజేపీ, జనసేనలు రెండూ కూడా ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా వున్నాయి. ఆ పార్టీలు సొంతంగా పోటీ చేస్తే ఓట్ల చీలిక ఖాయం. చంద్రబాబు అంత దూరం రాణిస్తాడా? ఎన్నికల సమయానికి ఏదో ఒక పార్టీతో అంటకాగకుండా వుంటాడా?

చంద్రబాబు ఇప్పుడు జోడుగుర్రాల మీద సవారీ చేస్తున్నాడు. ఎన్డీఏ నుండి బయటకొచ్చాక ఈమధ్య కాంగ్రెస్‌తో స్నేహం పెరిగింది. కాంగ్రెస్‌ను అప్పుడప్పుడూ పొగుడుతున్నాడు కూడా! ఏపిలో కాంగ్రెస్‌ తిరిగి బలం పుంజు కుంటే వైకాపా ఓట్లు చీలతాయనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ నాయ కత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గా లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేసే విధంగా, తద్వారా వైసిపి ఓట్లు చీల్చే పద్ధతిలో ప్లాన్‌ చేసాడు. ఇప్పుడు పాత స్నేహితుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో చంద్రబాబు ప్లాన్‌ను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

చంద్రబాబుకు కాంగ్రెస్‌ లైన్‌లోనే వుంది. చంద్రబాబు కంటే జగన్‌ ఓడిపోవడమే వారి లక్ష్యం. ఇక బీజేపీ, జనసేనలనే తిరిగి దారిలోకి తెచ్చుకోవాల్సి వుంది. పేరుకు బీజేపీ, టీడీపీలు నాటకాలాడుతున్నాయి గాని, ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారిగా మిత్రత్వం కొనసాగుతూనే వుంది. రేపు ఒకవేళ చంద్రబాబుతోనే అవసరం పడుతుందేమోనన్న ముందుచూపుతో బీజేపీవాళ్ళు కూడా ఆయనపై దూకుడుగా పోవడం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతిపై ప్రవాహంలా విమర్శలు చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర నాయకులే వెర్రివెంగళప్పలవుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్‌, తెలుగుదేశంలు జగన్‌పై కక్షగట్టి కేసులు సృష్టించి ఆయనను జైలుకు పంపాయి. ఈరోజు కేంద్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తే చంద్రబాబు చాలా అంశా లలో బుక్కవుతాడు. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాలలో ఎన్ని బొక్కలున్నాయన్నది మొన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకే తెలి సుండాలి. భూసేకరణ నష్టపరిహారాన్ని 11రెట్లు పెంచడమన్నది వరల్డ్‌ రికార్డ్‌. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా చూడని అవినీతిని గడ్కరీ పోలవరం నిర్మాణంలో చూసుంటాడు. ‘ఓటు-నోటు’ కేసుపై కేంద్రం దృష్టి పెట్టి వున్నా చంద్రబాబుకు చిక్కులు తప్పవు. ఈ కేసు మూలన పడి వుంది. వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులు టీడీపీలోకి ఫిరాయించారు. లోక్‌సభ స్పీకర్‌ ఏ మాత్రం పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేసివున్నా ఈపాటికి ఈ ముగ్గు రిపై వేటుపడుండేది. కాని, బీజేపీ ఆ విధంగా చేయలేదు. అంటే ఆ పార్టీ టీడీపీని పూర్తిగా దూరం చేసుకోలేదు. అమరావతి రాజధాని మొదలుకొని విదేశీ టూర్లు, పుష్కరాలు, పట్టిసీమ… ఇలా ఏది చూసినా అవినీతి అక్రమాల గుట్టలే! కేంద్రం పూర్తిస్థాయిలో దృష్టిపెడితే చంద్ర బాబుకు చుక్కలు చూపించడం పెద్ద సమస్య కాదు. కాని, బాబుతో కొనసాగుతున్న అంతర్గత సాన్నిహిత్యం వల్లే బీజేపీవాళ్ళు ఆయనపై దాడి చేయలేకున్నారు.

వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్ర రాజకీయా లలో ఏదైనా జరగొచ్చు. వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్‌ను రెచ్చగొట్టొచ్చు. అనుకూల ఓటు చీలకుండా వుండేందుకు మళ్ళీ బీజేపీ, జనసేనలతో అంటకాగొచ్చు. చాలా ముందుచూపుతోనే చంద్రబాబు ఏ దారినీ పూర్తిగా మూసేయకుండా వున్నాడు.

బయటపడ్డ రహస్య మైత్రి…

టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించడం వెనుక కూడా ఈ రెండు పార్టీల రహస్య మైత్రి బయటపడుతోంది. ప్రత్యేకహోదా కోసం పోరాడుతూ వైసిపి 13సార్లు అవిశ్వాస తీర్మాణం నోటీసులిచ్చినా స్పీకర్‌ ఆమోదించలేదు. ప్రత్యేకహోదా డిమాండ్‌ తోనే 5మంది వైసిపి ఎంపీలు రాజీనా మాలు చేసారు. ఇప్పుడు వాళ్ళు లోక్‌ సభలో లేరు. టీడీపీ వాళ్ళు ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకుని ప్రత్యేకహోదా కోసం ఏనాడు పార్లమెంటులో పోరాడలేదు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ చూసిన తర్వాతే టీడీపీ ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రత్యేకహోదా కావాలంటున్నారు. కాని పార్లమెంటులో ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ళుగా పోరాడింది వైసిపి ఎంపీలే! ఈ నాలుగేళ్ళు వాళ్ళు కోరితే ఏ రోజూ స్పీకర్‌ అవిశ్వాసతీర్మానంపై చర్చకు అనుమ తివ్వలేదు. ఇప్పుడు టీడీపీ సభ్యులు అడిగీ అడగంగానే అనుమతినిచ్చారు. ఇది రహస్య బంధంలో భాగమై ఉండొచ్చు.

అయితే ఇంకో అనుమానం లేక పోలేదు. అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ అంత సులభంగా అనుమతించదు. వాళ్ళకు పక్కా ప్రణాళిక ఉండొచ్చు. అవి శ్వాస తీర్మానంపై పార్లమెంటులో శుక్ర వారం జరిగే చర్చలో అటు కాంగ్రెస్‌ను ఇటు టీడీపీని కంబైన్డ్‌గా ఉతికి ఆరేసే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర విభజన బిల్లు విషయం తీసుకుంటే ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్లులో చేర్చలేదు. ఆరోజు మీరు బిల్లులో పెట్టుంటే ఈరోజు మేము అమలు చేయడానికి ఆస్కారం ఉండేదని వాదించ వచ్చు. విభజన బిల్లు విషయంలో కాంగ్రెస్‌ నోరు మూయించడానికి బీజేపీకి అవ కాశముంది.

అదే సమయంలో టీడీపీ తీరును ఎండగట్టవచ్చు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేకప్యాకేజీ కావాలన్నది చంద్రబాబే! కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత కేంద్రానికి ధన్యవాదాలు తెలు పుతూ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఇక విభజన బిల్లులో పేర్కొన్న పలు కార్యక్ర మాలను కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు అందులో ఇమిడివున్న అక్రమాలను కూడా సభాముఖంగా బయటపెట్టేందుకు బీజేపీకి అవకాశ ముంది. ఏపిలో ప్రభుత్వ అవినీతిని, చంద్ర బాబు ద్వంద్వప్రమాణాలను ఎండగట్టేం దుకు బీజేపీవాళ్ళు అవిశ్వాస తీర్మానంపై చర్చను వాడుకున్నా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here