Home జాతీయ వార్తలు జీవితకాల ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ నిలిపేస్తాం – ఎయిర్ టెల్

జీవితకాల ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ నిలిపేస్తాం – ఎయిర్ టెల్

సెల్ ఫోన్… ఒకప్పుడు లక్షాధికారులు, కోటీశ్వర్ల సొంతం. కాని, రిలయన్స్ సంస్థ ఆ రంగంలోకి దిగడంతో బికారికి కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటోంది. రిలయన్స్ సంస్థ ఇచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లకు ప్రతిఒక్కరూ సెల్ ఫోన్లపై మోజు పెంచుకున్నారు. అయితే ఈ సంస్థ దెబ్బకు బడా కంపెనీలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు భారీ స్థాయిలో నష్టపోతున్నాయి. ముఖ్యంగా జియో దెబ్బకు ఆ కంపెనీలకు చుక్కలు కనిపిస్తన్నాయి. ఇక లాభం లేదనుకున్నాయో ఏమో… ఆ కంపెనీలు ఇకపై ఇన్ కమింగ్ కాల్స్ కు కూడా టారిఫ్ లను ప్రకటించేసాయని తెలుస్తోంది. అయితే ఈ టారిఫ్ లో ఇన్ కమింగ్ కాల్స్ రిఛార్జ్ ను 35రూపాయలు మినిమంగా చేసి, 28రోజులు వేలిడిటి ఇచ్చాయని తెలుస్తోంది. అంటే ప్రతి ఒక్కరూ నెలకు ఖచ్చితంగా 35రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఇది ఒకందుకు మంచిదే ఏమో. సెల్ ఫోన్ విచ్చలవిడి తనానికి ఈ నిర్ణయం అడ్డుకట్ట వేస్తుందనే అనుకోవాలి. మరోవైపు సామాన్య ప్రజలు మాత్రం ఇలా చేస్తే మేమంతా జియోకు పోర్టబిలిటి మెట్టుకుంటాం… ఆ సంస్థలకు ఇంకొంచెం నష్టమే కలుగుతుందని అంటున్నారు. ఇదీ నిజమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here