Home సింహపురి సమాచారం జయకు లైన్‌ క్లియర్‌ అయినట్లే?

జయకు లైన్‌ క్లియర్‌ అయినట్లే?

జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అసలే బాగోలేదు. దీనికితోడు వర్గ విభేదాలొకటి! నాయకులంతా సమైక్యంగా కలిస్తేనే జిల్లాలో పార్టీ పటిష్టత అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఎవరికి వాళ్ళు తన్నుకుంటుంటే ఇంకా ఘోరంగా వుంటుంది.

జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు రెండు పదవులు వర్గ రాజకీయాలకు కేంద్రంగా మారాయి. ఇందులో ఒకటి నెల్లూరు నగర అధ్యక్ష పదవి. ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడు కావడం తెలిసిందే! జోడు పదవుల కారణంగా నగర అధ్యక్షుడిగా ఆయన స్థానంలో మరొకరిని పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యం లోనే ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వున్న ఆనం జయకుమార్‌రెడ్డి పేరు వినిపిస్తూ వచ్చింది. ఆనం జయకైతే పోటీ లేకుండా ఇవ్వొచ్చనుకున్నారు. అయితే పార్టీలో ఆదాలతో పాటు ఆనంను కూడా వ్యతిరేకించే ఒక వర్గం హఠాత్తుగా బీసీ కార్డును తెరమీదకు తెచ్చింది. ఇంతకాలం నగర అధ్యక్ష పదవిని అగ్రవర్ణాలకే ఇచ్చుకుంటూ వచ్చారని, ఇప్పుడు బీసీలకు ఇవ్వా లంటూ కొత్త నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. నూనె మల్లిఖార్జున యాదవ్‌, ధర్మవరం సుబ్బారావు లాంటి వాళ్ళు ఈ పదవిని ఆశిస్తుండగా, వీరి వెనుక కొందరి డైరెక్షన్‌ వున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదాలకు, నినాదాలకు తెర దించుతూ నెల్లూరు నగర టిడిపి అధ్యక్షుడిగా ఆనం జయకుమార్‌రెడ్డికి తెలుగుదేశం అధిష్టానం ఆమోదముద్ర వేయ నున్నట్లు తెలుస్తోంది. అధికారి కంగా ఆయన పేరు బయటకు రావాల్సివుంది.

ఇలాంటిదే ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కూడా! ఆనం రామనారాయణరెడ్డి ఇక పార్టీలో వుండడని తేలిపోవడంతో, ఇక్కడ కొత్త ఇన్‌ఛార్జ్‌ నియా మకం జరగాల్సివుంది. గతంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అనుచరుడు కన్నబాబు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్ళీ ఇన్‌ఛార్జ్‌ కోసం ఆయనే రంగంలో వున్నాడు. ఇక అటు మంత్రి నారాయణతోనే కాక ఇటు ఆదాల ప్రభాకర్‌రెడ్డితోనూ, పార్టీలోని మిగతా నాయకులతోనూ సత్సంబంధాలు కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి పేరు కూడా ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా బలంగా వినిపిస్తోంది. ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా ‘రెడ్డి’ సామాజికవర్గం నాయకుడినే పెట్టా లనుకుంటే మెట్టుకూరుకే అవకాశం రావచ్చు. ఈయన పేరును పార్టీలో నారాయణ, ఆదాల ప్రతిపాదిస్తుండగా కన్నబాబుకు మాత్రం మంత్రి సోమిరెడ్డి ఆశీస్సులున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు నగర పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక రేపోమాపో జరిగిపోతుంది. ఇక ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ ఎంపికపై చంద్రబాబు ఎవరివైపు మొగ్గుచూపుతాడో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here