అతనొక చిన్న నటుడు.. తక్కువ సినిమాలలో నటించాడు… అందులోనూ గుర్తుండిపోయే క్యారెక్టర్ లేమీ కావు… అయితే ఇప్పుడతను సినిమాలలో కన్నా న్యూస్‌ఛానెల్స్ ద్వారా పాపులర్ అయిపోయాడు. రాష్ట్ర మంతా తెలిసేలా గుర్తింపు పొందాడు. అతడే కత్తి మహేష్. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ జనసేన అభిమాను లకు కొరుకుడు పడని కొయ్యగా మారిన వ్యక్తి.
రాష్ట్ర రాజకీయాలలో పవన్ పాత్ర ఏమిటి అనే దానిపై క్లారిటీ లేదు. పవన్ వ్యవహారశైలిని చూసిన ఎవరికైనా అతను చంద్రబాబు పంజరంలో చిలకేననే విషయం ఇట్టే అర్ధమైపోతుంది. కాకాపోతే పవన్ అభిమానులే ఇంకా అర్ధం చేసుకోవడం లేదు. పవన్ వ్యవహారశైలిపై వైకాపా శ్రేణులు బాగానే ధుమ్మెత్తి పోసాయి. అయితే పవన్‌ను ఆడుకోవడంలో కత్తి మహేష్ ముందు వైకాపా నాయకులు కూడా సరిపోవడం లేదు. టీవీ ఛానల్స్ చర్చా వేదికలలోనూ, సోషల్ మీడియాలోనూ పవన్‌ను కడిగేయడంలో, ఆయనను ప్రశ్నించడంలో కత్తి మహేష్ నిముషం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. ఒక్కోసారి వితండవాదానికి కూడా దిగుతూ పవన్ అభిమానులకు మెంటలెక్కిస్తున్నాడు. పవన్‌పై అతను విపరీత వ్యాఖ్యలు చేసివున్నాడు. అభిమానులకు కోపమొచ్చి కత్తిని తీవ్రస్థాయిలో దూషించడమే కాక అతన్ని చంపుతామని సోషల్ మీడియా ద్వారానే బెదిరించారు. కాని, కత్తి మహేష్ ఇవేమీ లెక్క చేయకుండా పవన్‌పై మరింతగా రెచ్చిపోతున్నాడు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని పవన్‌కే నేరుగా సవాల్ విసురుతున్నాడు. ఈ కత్తిని ఎలా అదుపు చేయాలో తెలియక పవన్ జనసేన జుట్టు పీక్కుంటోంది.
