Home జిల్లా వార్తలు జనసేన… ఎవరి గెలుపుకు గండి కొడుతుందో?

జనసేన… ఎవరి గెలుపుకు గండి కొడుతుందో?

2009 ఎన్నికల్లో జిల్లాలో ప్రజారాజ్యం 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. నెల్లూరు నగరంలో గెలవడంతో పాటు నెల్లూరురూరల్‌ నియోజకవర్గంలో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయింది. అంతేకాదు, కావలి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోయేలా ప్రజారాజ్యం ఓట్లు చీల్చింది.

అప్పటి ప్రజారాజ్యానికి ప్రతిరూపమే నేటి జనసేన. కాకపోతే అప్పుడు అది ‘అన్నయ్య’ చిరంజీవి పెట్టిన పార్టీ… ఇప్పుడు ‘తమ్ముడు’ పవన్‌ కళ్యాణ్‌ పెట్టిన పార్టీ ఇది. జనసేన పార్టీకి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. కాని, గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో జనసేన వుంది. ముఖ్యంగా నెల్లూరు సిటి, రూరల్‌, కావలి నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం వుండబోతుంది. నెల్లూరు నగరంలో పవన్‌ అభిమానులు బాగానే వున్నారు. ఇక కాపు సామాజికవర్గం బలంగానే వుంది. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి నారాయణ కూడా కాపు సామాజికవర్గాన్నే నమ్ముకుని వున్నారు. కాబట్టి, జనసేనతో నెల్లూరు సిటీలో కొంత తెలుగుదేశానికే ఇబ్బంది కలగొచ్చు. నెల్లూరురూరల్‌లో జనసేన వల్ల అటు వైసిపికి ఇటు టిడిపికి ఓట్లు తగ్గొచ్చు. కావలిలో మాత్రం వైసిపి అభ్యర్థిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన పసుపులేటి సుధాకర్‌ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కావలిలో వడ్డెర వర్గమంతా కూడా తెలుగుదేశం మద్దతు దారులే! రేపు వీళ్లంతా కూడా జనసేనకు మొగ్గు చూపితే నష్టం తెలుగుదేశానికే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here