Home జిల్లా వార్తలు జనసేనాధినేతను… ఉతికి ఆరేసిన అనిల్‌

జనసేనాధినేతను… ఉతికి ఆరేసిన అనిల్‌

తెలుగుదేశం అధినేత చంద్రబాబును, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ను ఉతికి ఆరేయాలంటే వైసిపిలో రాటుదేలిన నాయకులు ఆర్కే రోజా, పి.అనిల్‌కుమార్‌యాదవ్‌లు. జగన్‌ ఆత్మాహుతి దళం సభ్యుల్లాంటి వాళ్ళు. జగన్‌ మీద తమకున్న విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే వున్నారు. ముఖ్యంగా అనిల్‌ పరిస్థితి పూర్తిగా భిన్నం. అనిల్‌ రాజకీయాలలోకి రాకముందు నుండి కూడా మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని. ఆయన సినిమాలకు చొక్కాలు చించుకునేవాడు. ఒక్కో సినిమాను పదేసిసార్లు చూసేంత అభిమానం. అదే అభిమానం పవన్‌కళ్యాణ్‌పై కూడా వుండేది.

కాని, రాజకీయాలకు వచ్చేసరికి సినీ అభిమానం పక్కన పెట్టాల్సి వచ్చింది. 2009 ఎన్నికలప్పుడు అభిమానించిన హీరో చిరంజీవినే తన నోటితో తిట్టాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ను తిట్టాల్సి వచ్చింది. గత నాలుగేళ్ల కాలంలో పవన్‌పై అనిల్‌ విమర్శల జోరు పెంచాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు చెంచాగా మారి ప్రతిపక్ష నేత జగన్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. మొన్న కూడా జగన్‌పై జరిగిన హత్యాయత్నం ‘చిన్న కోడికత్తి గుచ్చుకున్నందుకే ఓ అంటూ తెగ గింజుకుంటున్నాడంటూ’ పవన్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.

మొన్న కాకినాడలో జరిగిన ‘వంచనపై గర్జన’ సభలో పవన్‌ తాట తీసాడు అనిల్‌. మాటకొస్తే కానిస్టేబుల్‌ కొడుకును అంటుంటావ్‌… చిరంజీవి తమ్ముడినని చెప్పుకోలేని నీదీ ఓ బ్రతుకేనా, అసలు చిరంజీవి లేకుంటే నీవెక్కడ అంటూ తూర్పారబట్టాడు. కోడికత్తి అంటూ జగన్‌పై వ్యాఖ్యలు చేస్తున్నావ్‌, అదే కోడికత్తితో నిన్ను గుచ్చమంటావా… అప్పుడు తెలుస్తుంది నీ శక్తి ఏంటో అంటూ నిలదీశాడు. అనిల్‌ కాకినాడ ప్రసంగం సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here