Home గల్పిక జనసందోహంతో కిక్కిరిసిన చంద్రబాబు సభలు

జనసందోహంతో కిక్కిరిసిన చంద్రబాబు సభలు

ఢిల్లీలోని టెన్‌జనపథ్‌… సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, దిగ్విజయ్‌సింగ్‌, మనీష్‌ తివారి వంటి నాయకులున్నారు. వి.హెచ్‌.హనుమంతురావు అప్పుడే వంటింట్లో నుండి కాఫీ కప్పులతో వచ్చి అందరికీ ఇచ్చాడు. అందరూ కాఫీ తాగు తుండగా… సోనియా వుండి… దేశ వ్యాప్తంగా ఎన్నికల ట్రెండ్‌ ఎలావుంది అని అడిగింది. వెంటనే దిగ్విజయ్‌సింగ్‌ కలుగజేసుకుని… ఏం ట్రెండోనమ్మా… అంతా కొత్తగా చూస్తున్నాం, జనాలు తెలివి మీరిపోతున్నారు. జనాలకు తెలివితేటలొస్తే ఇక అసలు మనం గెలవగలమా? మన చేతికి అధికారం వస్తుందా? దేశ ప్రజలను గొర్రెలను చేసి 60ఏళ్లు పరిపాలించాం. ఇప్పుడు సెల్‌ ఫోన్‌లు, టీవీలు వచ్చి ప్రజల్లో తెలివి తేటలు పెంచాయి. మన పార్టీ గురించి జనానికి నిజాలు తెలుస్తున్నాయి. మధ్యలో ఈ రిలయన్స్‌ వాళ్ళ జియో నెట్‌వర్క్‌ ఒకటి… వాళ్ళ వల్ల పల్లెటూర్లలో వాళ్ళు కూడా చెడిపోయి మన పార్టీని అస హ్యించుకుంటున్నారు. ఈ టెక్నాలజీ ఇలాగే పెరిగి జనాలకు మన గురించి పూర్తిగా తెలిస్తే మీరు ఇటలీకి పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అందుకు సోనియా… దీనికి పరిష్కారం లేదా? అని అడిగింది. అందుకు దిగ్విజయ్‌… వుంది, మనం పొరపాటున ఈసారి అధికారంలోకి వస్తే ముందు రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ను రద్దు చేయాలి, సెల్‌టవర్లు కూల్చేయాలి. టీవీలలో దూరదర్శన్‌ ఛానల్‌ మాత్రమే వచ్చేలా చేయాలి. సెల్‌ కంపెనీలు రద్దు చేసి బిఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌లకు మళ్ళీ ప్రాణం పోయాలి. ఫోన్‌ చేయాలంటే ప్రజలు ఎస్‌టిడి బూత్‌లకు పరుగులు తీసేలా చెయ్యాలి. ప్రతి గ్రామానికి రోడ్లు లేకుండా, రవాణా లేకుండా చేయాలి, ఎడ్లబండ్ల మీద మళ్ళీ తిరగాలి. మనం ఇచ్చిన బియ్యం, కిరోసిన్‌, ఉప్పు, పప్పు లాంటివి తీసుకుని ప్రజలు బ్రతకాలి. అప్పుడే కాంగ్రెస్‌కు పాత వైభవం వస్తుం దని చెప్పాడు. ఈసారి మన ప్రభుత్వం వస్తే అలాగే చేద్దామని సోనియా చెబుతుండగా, బయట నుండి ‘అమ్మా’ అనే పిలుపు వినిపించింది. సోనియా అటు చూసింది. అక్కడ ఓ నడివయసు యువతి… ముఖమంతా నల్లగా మట్టి గొట్టుకుపోయి, చింపిరి చింపిరి జుట్టుతో బట్టలు మాసిపోయి వుంది. ఆమెను చూసి సోనియా విసుగ్గా… ఈ అడుక్కునే వాళ్ళకు వేళాపాళా లేదు… మంచి బిజీలో వున్నప్పుడే వచ్చి డిస్టర్బ్‌ చేస్తుం టారు అంటూ… హనుమాన్‌జీ బయట అడుక్కునే వాళ్లొచ్చారు… ఒక చపాతి తెచ్చి ఇవ్వు అని కేకేసింది. అది విని బయట వున్న యువతి… అమ్మా… నేను ప్రియాంకను అని అరిచింది. ఆ మాట విని సోనియా ఆశ్చర్యంతో ఆమె వద్దకు పరుగు పెట్టింది. తీక్షణంగా చూసింది. నిజమే తన బిడ్డ ప్రియాంక గాంధీనే. ఏంది తల్లీ ఇట్లా అయ్యావు అని బాధగా అడిగింది. దానికి ప్రియాంక… ఇట్లాగాక ఇంకెట్లా అవుతారు? మీ కొడుకును కాదని నన్ను ప్రచారానికి తిప్పుతుంటివి… ఈ ఎండలకు మాడిమసైపోయాను అంటూ ఏడవసాగింది. సోనియా ఆమెను ఓదార్చి… లోపలకెళ్లి స్నానం చేసిరాపో, భోజనం చేద్దువు అని చెప్పి పంపింది. అంతలో అక్కడకు హైటెక్‌రత్న చంద్ర బాబునాయుడు వచ్చాడు. సోనియా ఆయనను కూర్చోబెట్టి… చంద్రబాబుజీ మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుంది అని అడిగింది. అందుకాయన… వై.యస్‌. చనిపోయాక ఆ జగన్‌ను సీఎం చేసుం డాల్సింది. మీరు ఆ పని చేయకపోబట్టి ఇప్పుడు వైసిపి రూపంలో నాకు చుక్కలు చూపిస్తున్నాడు. అతని ప్రచారం ముందు మేము చాలడం లేదు. స్టార్‌ క్యాంపెయి నర్లు కావాలి… అని అన్నాడు. మరి రాహుల్‌ను పంపమంటావా అని సోనియా అడిగింది. ఎందుకు… మా లోకేష్‌తోనే మేం తల బొప్పికట్టి చస్తున్నాం, మళ్ళీ ఇంకో తలనొప్పి ఎందుకు అని ప్రశ్నించాడు. అలాగైతే ఇంకెవరి చేత ప్రచారం చేయిస్తారని సోనియా అడి గింది. అందుకు చంద్రబాబు… మన మిత్రపక్ష నేతలైన ఫరూక్‌ అబ్దుల్లా, అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌లను ఆంధ్రాకు తీసుకుపోయి ప్రచారం చేయిస్తానని అన్నాడు. గుడ్‌… ఇంకా అవసరమైతే చెప్పండి… పాకి స్థాన్‌, ఇటలీ వాళ్లను కూడా రంగంలోకి దించుతామని సోనియా అంది. అవసర మైతే చెబుతాలే మేడం అంటూ చంద్ర బాబు అక్కడ నుండి లేచాడు.

—-

ఉండవల్లిలోని తన ఇంట్లోని గదిలో చంద్రబాబు దిగాలుగా కూర్చుని వున్నాడు. ఎదురుగా టిడిపి నాయకులు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్‌, కళా వెంకట్రావ్‌లు వున్నారు. ఏం సార్‌, అంత బాధగా వున్నారని పుల్లారావు అడిగాడు. చంద్ర బాబు ఉండి… మనం ఫరూక్‌ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌లను తీసుకొచ్చినా జనం రావడం లేదు. ఆ జగన్‌ సభలకేమో తండోప తండాలుగా వస్తున్నారని, ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించాడు. అప్పుడే ఇంట్లో నుండి మంగళగిరి ప్రచారానికిపోతున్న లోకేష్‌ ఆ మాటలు విన్నాడు. తన తండ్రి మాటల్లోని బాధను అర్ధం చేసుకున్నాడు. వెంటనే లోకేష్‌ ఆ గదిలోకి వెళ్లి… డాడీ నో వర్రీ… మన సభలకు జనం రావడం లేదనేగా మీ బాధ… రేపట్నుండి మీ సభలు చూడండి… జన సందోహంతో కిక్కిరిసిపోతాయి అని గట్టిగా చెప్పేసి వెళ్లి పోయాడు. లోకేష్‌ మాటలతో చంద్ర బాబులో ఏదో తెలియని ధైర్యం వచ్చింది.

——

పక్కరోజు చంద్రబాబు ప్రచారంలో భాగంగా నెల్లూరు వెళ్లాడు. అప్పటికే సభా ప్రాంగణం వేలాది జనంతో కిక్కిరిసి పోయింది. అప్పటికే స్టేజీ మీద ప్రియాంక చోప్రా, సోనాక్షిసిన్హా, దీపికా పదుకొనే వంటి బాలీవుడ్‌ భామలు, హంసా నందిని, కాజల్‌, అనుష్క వంటి తారల నృత్యాలతో అనసూయ, రష్మి, శ్రీముఖి వంటి యాంకర్ల వ్యాఖ్యానాలతో ఆ ప్రాంతం రచ్చరచ్చగా వుంది… జనాల కేరింతలతో మార్మోగుతోంది. అందరి నోట లోకేష్‌ జిందాబాద్‌ అనే నినా దాలు… మంత్రి నారాయణ ఆ జనం మధ్యలో నుండి బలవంతంగా స్టేజీ మీదకు చేరుకుని మైకు పట్టుకుని… ఇప్పటివరకు మన తారల నృత్యాలు చూసి ఆనందించారు… ఇప్పుడు మన ప్రియ తమ నాయకుడు చంద్రబాబునాయుడు స్పీచ్‌ విని తరించండని కోరాడు. వెంటనే జనంలో నుండి… ”చంద్రబాబు స్పీచ్‌ వద్దు… ప్రియాంక స్టేజీ షోలే మాకు ముద్దు” అనే స్లోగన్‌లు మొదలయ్యాయి. క్రింద నుండి అది విని చంద్రబాబు… లోకేషా… మన సభలకు జనాన్ని తండోపతండాలు తీసుకొస్తానంటే.. ఏదో అనుకున్నాను, ఇలా తీసుకొస్తా వనుకోలేదని మనసులో అనుకుంటూ తల పట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here