Home రాష్ట్రీయ వార్తలు జనం లేరు.. సైన్యం లేదు..

జనం లేరు.. సైన్యం లేదు..

జనసేన… ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీకి ప్రతిరూపం. కాకపోతే అధిపతులు మారారు. అప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి అయితే ఇప్పుడు తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌. 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన మెగాస్టార్‌ చిరంజీవి 2010కల్లా ఆ పార్టీని మూసేసుకోవడం తెలిసిందే! 2009 ఎన్నికల్లో పోటీచేసి 18అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న ప్రజారాజ్యం పార్టీ, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయాలకు గండి కొట్టింది. 2009లో ప్రజారాజ్యం పోటీ చేయకపోయి వుంటే కాంగ్రెస్‌కు 180 నుండి 190 సీట్లు వచ్చుండేవి. ఆ పార్టీ మధ్యలో వుండబట్టే కాంగ్రెస్‌ 155సీట్లకే పరిమితమైంది.

ఇప్పుడు ప్రజారాజ్యంకు ప్రతిరూపమే జనసేన. మెగా అభిమానులే పవర్‌ స్టార్‌ అభిమానులు. ఇక కులపరమైన బలం కొంతవుంటుంది. నెల్లూరు జిల్లా రాజకీయాలపై జనసేన ప్రభావం ఎంతుంటుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా వుంది. 2009లో ప్రజారాజ్యంకు జిల్లాలో కొద్దోగొప్పో బలం వుండింది. ఆ పార్టీలో ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, అజీజ్‌, ద్వారకానాథ్‌ వంటి నాయకులుండినారు. ప్రతి నియోజకవర్గంలోనూ తెలిసిన నాయకుడు ఒకడన్నా వున్నాడు.

ఇప్పుడు జిల్లాలో జనసేనకు ఆ మాత్రం నాయకత్వం కూడా లేదు. రాజకీయంగా చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కడూ ఆ పార్టీలో లేడు. నెల్లూరు నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా పవన్‌ అభిమానులున్నారు. కాని స్థానికంగా బలమైన నాయత్వం అన్నది లేకుండా ఆ పార్టీ రాజకీయంగా ఎలా పోరాడగలదు. ఇప్పటివరకు చూస్తే జిల్లాలో ఆ పార్టీ ఉనికి నామమాత్రమేననుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here