Home జిల్లా వార్తలు జగన్ కు తోడుగా రామ్‌

జగన్ కు తోడుగా రామ్‌

ఇద్దరు మాజీముఖ్యమంత్రుల తనయులు వాళ్ళు. ఒకే పార్టీ నుండి వచ్చిన వాళ్ళు. ఒకరు ప్రజల కోసం మండుటెండలను, కుండపోత వర్షాలను లెక్కచేయకుండా ప్రజాసంకల్ప పాదయాత్రతో వేల కిలోమీటర్లు నడుస్తుంటే… మీకు నేను తోడుంటాను, మీ ప్రజాయజ్ఞంలో నేనూ భాగస్వామినవుతానంటూ మరొకరు ముందుకొచ్చారు. ఈ ఇద్దరు మాజీ సీఎంల తనయుల కలయికకు ఈ నెల 8వ తేదీన విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం వేదికగా నిలిచింది.

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరాడు. రామ్‌కుమార్‌కు పార్టీ ండువా కప్పి జగన్‌ ఎంతో ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించాడు. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో 7వ తేదీ మధ్యాహ్నమే వేలాదిమంది నేదురుమల్లి అభిమానులు, అనుచరులు పెద్దసంఖ్యలో వాహనాలలో వాకాడు నుండి విశాఖపట్నంకు బయలుదేరి వెళ్లారు. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన నాయకులు, అనుచరులు పెద్దసంఖ్యలో తరలి రావడం జరిగింది. నేదురుమల్లి రామ్‌కుమార్‌తో పాటు తిరుపతి మాజీ ఎంపి వి.వరప్రసాదరావు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసిపి సిఇసి సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి, గూడూరు వైసిపి ఇన్‌ఛార్జ్‌ మేరిగ మురళీ, కోట ఎంపిపి నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్‌ తదితరులు విశాఖకు వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here