Home జిల్లా వార్తలు చెరొక సీటా!.. ఒకే సీటుకై ఫైటా?

చెరొక సీటా!.. ఒకే సీటుకై ఫైటా?

రాష్ట్రంలో వైసిపికి బలమైన ఓటు బ్యాంకు ముస్లింలు, క్రిస్టియన్‌లు. రానున్న ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకుకు కన్నం వేయాలనేది చంద్రబాబు పన్నాగం. బీజేపీతో పొత్తు వదులుకున్నది కూడా అందుకే! ఈమధ్య ముస్లిం, క్రిస్టియన్‌లను ఆయన దువ్వడం ఎక్కువైంది. చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ భగవద్గీతను చదివి వుండడు గాని, క్రైస్తవ ప్రచార సభల్లో మాత్రం బైబిల్‌ వాక్యాలు చదువు తుంటాడు. ఇక ముస్లింలకు రకరకాల వరాలు ప్రకటిస్తున్నాడు. ఇవన్నీ వారి ఓట్ల కోసం పన్నుతున్న వల.

మరి ఓట్లు కావాలంటే మైనార్టీలకు సీట్లు కూడా ఇవ్వాలి కదా! రాష్ట్రంలోని 175అసెంబ్లీలలో కనీసం అయిదారు సీట్లన్నా ముస్లింలకు కేటాయించాల్సి వుంటుంది. ఈ లెక్కన చూస్తే ముస్లింలకు ఇవ్వదగిన సీట్లలో నెల్లూరు నగరం కూడా ఒకటిగా కనిపిస్తోంది. ముస్లిం ఓటర్లు అధికంగా వున్న నియోజకవర్గమిది. 2014 ఎన్నికలలోనే నెల్లూరు సిటీ వైసిపి సీటు కోసం అప్పుడు ఆ పార్టీలో వున్న అబ్దుల్‌ అజీజ్‌ ప్రయత్నించాడు. ఆయనకు ఎమ్మెల్యే సీటు బదులు మేయర్‌ సీటిచ్చారు. ఆయన ఆ పార్టీ తరపున మేయర్‌గా గెలిచి తర్వాత తెలుగుదేశంలో చేరడం జరిగింది.

ఇప్పుడు తెలుగుదేశం నెల్లూరు సిటి సీటు కోసం అజీజ్‌ గట్టిగా పోరాడుతు న్నాడు. ఈ విషయమై చంద్రబాబును కలిసాడు. ఇక లోకేష్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. మరోపక్క మైనార్టీల ద్వారా కూడా ముస్లింలకే నెల్లూరు సీటు ఇవ్వాలనే ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు.

నిన్నటివరకు నెల్లూరు సిటి అభ్యర్థి నారాయణ అన్న ప్రచారం నడిచింది. నారాయణ ఈ సీటు కావాలని పంతం పట్టడం లేదు. కాకపోతే చంద్రబాబు పోటీ చేయమని ఆదేశిస్తే మాత్రం దూకడానికి సిద్ధంగా వున్నాడు. సీటు విషయంలో ఆయనకు పేచీలు లేవు. కాకపోతే అజీజ్‌కు నెల్లూరు సిటి ఇచ్చి, నారాయణను నెల్లూరు రూరల్‌లో దించాలనే ప్రతిపాదన కూడా వుంది. నెల్లూరు పార్లమెంట్‌కు టిడిపి అభ్యర్థిగా ప్రచారంలో వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా నారాయణను నెల్లూరు రూరల్‌ అభ్యర్థిగా రావాలని కోరుకుంటు న్నాడు. నారాయణ వస్తే రూరల్‌లో బలమైన పోటీ వుంటుందని, తద్వారా ఎంపీగా తనకు కలిసొస్తుందని ఆయన ఆశ. మరి నెల్లూరు నగరం కాకుండా రూరల్‌కు పొమ్మంటే, నారాయణ ఒప్పుకుం టాడా? లేదా అన్నదే అనుమానం.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here