Home సింహపురి సమాచారం చెత్తనగరి… సింహపురి!

చెత్తనగరి… సింహపురి!

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అంటూ మున్సిపల్‌ మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌లు ఈమధ్యంతా తెగ కష్టపడ్డారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో జాతీయ స్థాయిలో టాప్‌ర్యాంకు తెచ్చుకోవాలని శ్రమించారు. గత ఏడాదిలో పారిశుద్ధ్య పనుల పరంగా ఫర్వా లేదనిపించారు. గతంతో పోలిస్తే నగరంలో పారిశుద్ధ్యం పనులు కొంతవరకు మెరు గయ్యాయనే చెప్పవచ్చు.

అయితే ఏం లాభం… ఒక ఏడాదంతా చేసిన కృషి ఒక్క వారం పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే చెత్తలో కలిసిపోతుంది. ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులు 279 జి.ఓకు వ్యతిరేకంగా సమ్మెకు దిగడం తెలిసిందే! కార్మికుల సమ్మెతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ గుట్టలు గుట్టలుగా పోగుబడుతుంది. ఈ నెల 14వ తేదీ నుండి దాదాపు 1100 మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. శాశ్వత పారిశుద్ధ్య కార్మికులతో పాటు 150 మంది తాత్కాలిక కార్మికులు మొత్తం 600మంది కార్మికులే ప్రస్తుతం పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. దీంతో తగిన సిబ్బంది లేక ప్రధాన రహదారులలో తప్పితే సందు గొందుల్లో చెత్తను సేకరించడం లేదు. దీనివల్ల 54డివిజన్‌లలోని కాలనీలు, వీధులలో టన్నుల కొద్దీ చెత్త పేరుకు పోయింది. కార్మికులు సమ్మె విరమిస్తే కాని చెత్తను తొలగించే పరిస్థితి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here