Home రాష్ట్రీయ వార్తలు చుక్కలు చూపిస్తారా?

చుక్కలు చూపిస్తారా?

”నన్ను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు… ఎవరైనా నన్ను పట్టు కోవడానికి వచ్చినప్పుడు మీరంతా నాకు రక్షణవలయంగా ఏర్పడి నన్ను కాపాడుకోవాలి”… కొన్నిరోజుల క్రితం ఓ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఎంత భయం లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఇంత బేలగా మాట్లాడుతాడు. ఏ తప్పు చేయకపోతే ఇంతగా ఎందుకు భయపడుతాడు!

ప్రత్యర్థులపై కక్ష సాధించడంలో గతంలో కాంగ్రెస్‌ నాయకులను అనుకునేవాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్‌షాలు వారి రికార్డును బద్ధలు కొడుతున్నారు. వాళ్ళ దెబ్బకు కొమ్ములు తిరిగిన నాయకులు సైతం తలలు వంచుతున్నారు. జాతీయ రాజకీయాలలో తమకు కొరుకుడు పడని కొయ్యగా మారిన లాలూ ప్రసాద్‌యాదవ్‌ చేత ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. తమతో రాజీపడని శశికళను జైలులో తోసారు. కరుడుగట్టిన కాశ్మీరీ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా చేత జై భారత్‌మాత అనిపిం చారు. శారద చిట్‌ స్కాంలో మచ్చలేని నాయకురాలిగా గుర్తింపుబడ్డ మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టించారు. ఏం భయంపెట్టారో ఏమో మాయావతిని మహాకూటమితో కలవకుండా చేశారు. ఇంతమంది నాయకులను ఇన్ని తిప్పలు పెడుతున్న వారికి చంద్రబాబు ఓ లెక్కా!

మహాకూటమి అంటూ కాంగ్రెస్‌తో జతకట్టి నరేంద్రమోడీ క్రిందకు నీళ్ళు తేవాలని చూస్తున్న చంద్రబాబును వాళ్ళు వూరికే వదులుతారా? ఆయనకు చుక్కలు చూపించకుండా వుంటారా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబును చక్రబంధంలో బిగించడానికి పక్కా ప్రణా ళికను వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు మీద ‘ఓటు- నోటు’ కేసు వుంది. ఇది పక్కా కేసు. దీంట్లో నిజాలపై నిష్పాక్షికంగా విచారణ జరిగితే చాలు. చంద్రబాబుకు సమస్యలే. మహారాష్ట్రలోని బాబ్లీ కేసుకే చంద్రబాబు వణుకుతున్నాడు. అక్కడికి పోతే ఎక్కడ అరెస్ట్‌ చేస్తారోనని ధర్మాబాద్‌ కోర్టుకే పోకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగే ఆయనపై నమోదైన పలు కేసులపై స్టేలు న్నాయి. స్టేలు ఎత్తేసినా ఆయనకు ఇబ్బందే!

అన్నింటికి మించి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఈడి, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ల భయం టీడీపీని వెంటాడు తోంది. రాష్ట్రంలో పలువురు టీడీపీ నాయ కుల ఇళ్ళపై ఆదాయపన్ను, ఈడీల దాడులు జరగవచ్చనే సమాచారంతో ఆ పార్టీ నాయకులు హడలిపోతున్నారు. ఇప్పటికే చూచాయగా అలాంటి దాడులు మొదలయ్యాయి కూడా! ఇటీవల రాష్ట్రంలో టీడీపీ నాయకులపై శాఖాపరమైన విధుల్లో భాగంగా ఐటి అధికారులు దాడులు మొదలుపెడితే చంద్రబాబు వాటిని ఆంధ్రప్రదేశ్‌పైనే దాడిగా అభివర్ణించారు. దీనిని కూడా రాజకీయ లబ్దికి వాడుకోవా లని చూశారు. అంతేకాదు, ఐటి అధికారు లకు రాష్ట్ర పోలీసు భద్రత కల్పించకుండా ఆదేశాలిచ్చారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే చర్యలే!

ఇటీవలకాలంలో ప్రధాని మోడీపై తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే! అంతేగాక మోడీకి ప్రత్యామ్నాయ నాయ కుడిని నేనే అనే విధంగా ఆయన ఫోజు లుంటున్నాయి. ఈ పరిస్థితులన్నింటిని మోడీ షా ద్వయం గమనిస్తూనే వుంది. ఈ నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు వైపు బొచ్చెడు బొక్కలున్నాయి. వేలకోట్ల అవినీతి ఆనవాళ్ళున్నాయి. రాష్ట్ర ప్రభు త్వంలో ఏ ఒక్క ప్రాజెక్ట్‌, ఏ ఒక్క పథకం అమలుపై సిబిఐ, ఈడిల చేత దర్యాప్తు మొదలుపెట్టించినా చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here