Home రాష్ట్రీయ వార్తలు చీలుద్దాం… గెలుద్దాం!

చీలుద్దాం… గెలుద్దాం!

అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలన అందించడం… ప్రజలు మెచ్చేలా పని చేయడం… ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో చూపించడం… మళ్ళీ అయిదేళ్ళ తర్వాత మనం ప్రజల ముందుకు వెళితే మన పరిపాలన మెచ్చి ప్రజలు తిరిగి గెలిపించడం… దేశ రాజకీయాలలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అనుసరించే విధానం ఇదే! జ్యోతిబసు, నవీన్‌ పట్నాయక్‌, రాజశేఖరరెడ్డి, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణసింగ్‌… ఇలా ఆయా రాష్ట్రాలను ముఖ్యమంత్రులుగా పరిపాలించిన వీళ్ళంతా కూడా తమ పాలనా కాలంలో మంచి పరిపాలన అందించి, దాని రెఫరెండంగానే మళ్ళీ ఎన్నికలకు పోయినవాళ్ళే!

కానీ, దేశ రాజకీయాలలోనే ఈ సాధారణ శైలికి భిన్నంగా పోయే నాయకుడు చంద్రబాబునాయుడు. ఆయన తన పరి పాలనకంటే కూడా పరిస్థితులను ఎక్కువుగా నమ్ముతాడు. ప్రత్యర్థుల బలహీనతలకు గురిపెడతాడు. పరిస్థితులకు అనుగు ణంగా రాజకీయ వాతావరణం ఎలా వుందో చూసుకుంటాడు. టైంకు తగ్గట్లు ఎవరిని పట్టాలో పట్టుకుంటాడు.

పొత్తులతోనే గెలిచాడు…

తన పరిపాలనా రెఫరెండంతో చంద్రబాబు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. 1995లో ఆయన సీఎం అయ్యిందే ఎన్టీఆర్‌ను దించేసి. 1999లో వాజ్‌పేయి సానుభూతి వుందని తెలిసి బీజేపీతో పొత్తుతో గెలిచాడు. 2004, 2009లలో ఓడిపోయాడు. 2009లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి తన పరిపాలననే రెఫరెండంగా చేసుకున్నాడు. ప్రజలు అనుకూలంగా తీర్పిచ్చారు. 2014లో చంద్రబాబు రాష్ట్రం విడిపోయిన నేప థ్యంలో విభజిత ఆంధ్రాలోనే 13జిల్లాల్లో పరిస్థితులను అంచనా వేశాడు. మోడీ గాలి వుందని తెలుసుకున్నాడు. బీజేపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా పైరవీలు చేయించి బీజేపీతో పొత్తు పెట్టుకు న్నాడు. పవన్‌ వస్తే కాపుల ఓట్లు కొల్లగొట్టొచ్చనుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్లి మద్దతు అడిగాడు. మోడీ ఇమేజ్‌, పవన్‌ మద్దతు, ఆనాటి జగన్‌ వ్యక్తిగత పొరపాట్లు… వెరసి 2014లో తెలుగు దేశం అధికారంలోకి వచ్చింది.

అడ్డదారుల్లోనే…

చంద్రబాబు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఈ ఐదేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధి పనులు, సాగించిన పరిపాలనపై నమ్మకముంటే ఆయన తన గెలుపు కోసం వాటినే నమ్ముకోవాలి. వాటినే ప్రచారం చేసుకోవాలి. కాని, ఆయన వాటిని ఎక్కువుగా నమ్ముకోలేదు. రహదారి కంటే అడ్డదారులనే వెదుక్కొంటున్నాడు. ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కోసం మూడెంచెల వ్యూహం అమలు చేస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక, జగన్‌ అనుకూల ఓట్లను చీలుద్దాం, గెలుద్దాం అనే యాక్షన్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టాడు. పవన్‌ కళ్యాణ్‌తోకలిసి పోటీ చేస్తే ఈసారి కాపులు ఓట్లేయరని తెలుసుకున్నాడు. అందుకే కాపుల ఓట్లు వైసిపికి పోకుండా చీలగొట్టడం కోసం బి-టీమ్‌గా జనసేనను రంగంలోకి దిం చాడు. సిబిఐ మాజీ జె.డి లక్ష్మీనారాయణ తెలుగుదేశంలోకి వస్తానంటే, జగన్‌ కేసుల వ్యవహారంలో తమ లాలూచీ ఎక్కడ బయటపడుతుందోనని భావించిన చంద్రబాబు, ఆయనను టిడిపిలోకి కాకుండా జనసేనలో చేర్చాడు. ఇక రహస్య ఒప్పం దంలో ప్రధాన అంశం పపన్‌, జె.డిలు పోటీ చేసే స్థానాలలో టిడిపి బలహీన అభ్యర్థులను పెట్టడం. తన పార్టీ కార్యాలయమున్న మంగళగిరిలో జనసేన పోటీ చేయకుండా లోకేష్‌ కోసం సిపిఐకు ఆ సీటివ్వడం. ఇదంతా బాబు, పవన్‌ల మధ్య రహస్య అవగా హనే! అలాగే పొత్తులో భాగంగా బిఎస్పీ, వామపక్షాలకు సీట్లన్నీ కూడా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కేటాయించారు. పవన్‌ ప్రభావం వుంటుందనుకున్న గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం జనసేన పోటీ చేస్తుంది. ఇదంతా బాబు డైరెక్షన్‌లో జరుగుతున్నదే అనే సంగతి వేరే చెప్పనక్కరలేదు. దక్షిణాది పార్టీల మీద ఉత్తరాది పార్టీల పెత్తనమేంటి అంటూ ఈమధ్యంతా పవన్‌కళ్యాణ్‌ పలు సభలలో ప్రశ్నించాడు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో అసలు లేని ఉత్తరప్రదేశ్‌ పార్టీ బిఎస్పీని ఏపికి పిలిచి మరీ ఎందుకు పొత్తు పెట్టుకున్నట్లు? ఎందుకు సీట్లిచ్చినట్లు? కాపుల ఓట్లు చీల్చడానికి జనసేన… దళితుల ఓట్లు చీల్చడానికి బిఎస్పీ!

అలాగే రెండో ప్లాన్‌ కాంగ్రెస్‌ ద్వారా అమలు చేయడం. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఆ పార్టీతో కలిసే వెళ్లాడు. ఆంధ్రాలో కలిసి పోటీ చేస్తే జనం వ్యతిరేకిస్తారని ఆ పార్టీ చేత విడిగా పోటీ చేయిస్తున్నాడు. వైసిపికి బలమైన ఓటు బ్యాంకుగా వున్న రెడ్లు, మైనార్టీల ఓట్లు చీల్చే దిశగా ఆయా నియోజక వర్గాలలో ఈ సామాజికవర్గాలకు చెందిన వారినే అభ్యర్థులుగా దించారు.

పచ్చమీడియాలో రొచ్చువార్తలు…

చంద్రబాబు గెలుపు కోసం అన్నింటికంటే ఇంకా ఎక్కువ ఆధారపడింది పచ్చమీడియా! ఇది ఇంకో వ్యూహం. జగన్‌ మీద వ్యతిరేక కథనాలను వ్రాయించడం, ప్రసారాలు చేయిం చడం, వాటిని ప్రజలు నమ్మేటట్లు చేయడం… చంద్రబాబు అనుకూల పత్రికలు, ఛానెల్స్‌ ఈ బాధ్యతలను ఇప్పటికే భుజాల కెత్తుకుని, తమ నైతికతను కూడా వదులుకుని బాగానే పని చేస్తున్నాయి. చేసిన పరిపాలన ద్వారా కాకుండా పక్కదారుల గుండా తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. మరి ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలు ఫలించి 2014ను తలపిస్తాయో, లేక ఆయన పరిపాలనకు విరక్తి

చెంది ప్రజలు తీర్పు ఇచ్చిన 2004 నాటి ఫలితాలను ప్రతిబింబి స్తాయో చూడాలి!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here