Home జిల్లా వార్తలు చిర్రెత్తిస్తున్న సెల్‌ నెట్‌వర్క్‌లు

చిర్రెత్తిస్తున్న సెల్‌ నెట్‌వర్క్‌లు

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనిషికి ఎంతగా ఉపయోగపడుతుందో, అంతగా నష్టం కూడా కలిగిస్తుంది. ఇది సెల్‌ఫోన్‌ల యుగం. సాయిబాబా గుడి ముందు భిక్షమెత్తుకునే వాని చేతిలో కూడా స్మార్ట్‌ఫోన్‌లున్న రోజులివి. మనిషి జీవితంలో నీళ్ళు, ఆహారం లాగే, సెల్‌ఫోన్‌ ఒక భాగంగా మారిపోయింది. ప్రతిఒక్కరికీ ఫోన్‌ ఉండడమే కాదు, కొందరికైతే రెండు, మూడేసి నెంబర్లు కూడా వుంటున్నాయి. అయితే సెల్‌ఫోన్‌లు పెరిగినట్లుగా సెల్‌ కంపెనీలు నెట్‌వర్క్‌ కెపాసిటీని పెంచలేకపోతున్నాయి. సెల్‌నెట్‌వర్క్‌ సమస్యలతో కాల్‌డ్రాప్స్‌ కావడం, ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఫోన్‌ కలవకపోవడం వంటివి వినియోగదారులకు చిర్రెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రెండు నిముషాలు సిగ్నల్‌ వుంటే మరో ఐదు నిముషాలు సిగ్నల్‌ వుండదు. అర్జంట్‌ టైమ్‌లో ఫోన్‌లు చేయాలంటే సిగ్నల్‌ లేక వినియోగదారుడికి పిచ్చి కోపమొస్తుంటుంది. ఒకప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెత్త నెట్‌వర్క్‌ అనే పేరుండేది. ఇప్పుడు ఆ జాబితాలో ఎయిర్‌టెల్‌, వొడా, ఐడియా నెట్‌వర్క్‌లు కూడా చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here