Home గల్పిక చంద్రబాబు చొరవతోనే అభినందన్‌ విడుదల

చంద్రబాబు చొరవతోనే అభినందన్‌ విడుదల

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా తన ఛాంబర్‌లో కూర్చుని ఎన్నికల ఏర్పాట్లపై రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నాడు. అంతలో ఆయన సెల్‌ఫోన్‌ మోగింది. ఆయన ఫోన్‌ ఎత్తాడు. అవతల నుండి ఏమండి… ఇది బాధగా వుండదండి… నా రక్తం మరిగి పోతుందిక్కడ… మోడీతో కుమ్మక్కై మీరు ఫస్ట్‌ఫేస్‌లోనే మా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్‌ పెడతారా… మేం సర్దుకోవడానికి టైం ఇవ్వరా? ఇదేం ప్రజాస్వామ్యమండి… చాలా బాధేస్తుందండి అని హైటెక్‌రత్న, నవ్యాంధ్ర సీఎం చంద్రబాబునాయుడు చెప్పాడు. దానికి సిఇసి అరోరా… భలే వారు చంద్రబాబు గారు… మీరు అన్నిం ట్లోనూ ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో వుందని చెబుతుంటారు కదా… అందుకే మేము కూడా మొదటి దశలోనే ఎన్నికలు పెట్టామని అన్నాడు. అందుకు చంద్ర బాబు… ఇది టూమచ్‌ అండి… రేపు కేంద్రంలో చక్రం తిప్పబోయేది నేనే… జాగ్రత్తగా వుండండి అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

——

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం. ఎన్నికల కోడ్‌ వచ్చిందని తెలియగానే మంత్రులు, తెలుగుదేశం నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పచ్చమీడియా ప్రతినిధులు, మాస్క్‌ మేధావి శివాజీ తదితరులంతా వచ్చే శారు. అప్పుడే లోకేష్‌ స్వీట్స్‌ బాక్స్‌తో అక్కడకు వచ్చి అందరికీ పంచసాగాడు. అక్కడున్న కోడెల శివప్రసాద్‌రావుకు ఒళ్లు మండి… మేం టైం లేకుండానే ఎన్నికలు పెట్టేస్తున్నారని ఆందోళన చెందుతుంటే, నువ్వేంటి స్వీట్లు పంచు కుంటున్నావని కోపంగా అడిగాడు. అందుకు లోకేష్‌… ఒక మధుకోడా, ఒక సురేష్‌కల్మాడీ, ఒక రాజా, ఒక లాలూ ప్రసాద్‌యాదవ్‌, ఒక మాయావతి… వీళ్లందరి పేర్లు ఏదో ఒక కుంభకోణం ద్వారా దేశమంతా తెలిశాయి. ఈరోజు డేటా చోరీ స్కాంతో అతి చిన్నవయసులో నా పేరు దేశమంతా తెలిసింది. స్వీట్లు పంచుకోవడానికి ఇంతకంటే ఆనంద కరమైన క్షణాలేముంటాయి చెప్పండి అని అడిగాడు. ఆ మాటకు అక్కడున్న వాళ్ళకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. లోకేష్‌ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా స్వీట్లు పంచుకుంటున్నాడు.

తర్వాత అందరూ హాల్‌లో కూర్చు న్నారు. మీడియా ప్రతినిధులు అహో న్యూస్‌ కీర్తి, టి.వి.6.5 ప్రతినిధి రాస్కో సాంబా, ఏబిఎఫ్‌ ఛానెల్‌ అధిపతి వ్యధ కృష్ణ, ఏపి 24I5=124 ఛానెల్‌ ప్రతినిధి వంకరకృష్ణలు చంద్రబాబుతో… సార్‌, మీరు మళ్ళీ గెలవడం మీకు ఎంత అవ సరమో మాకు తెలియదుగాని మాకు మాత్రం అత్యంత అవసరం. మీరు గెల వకపోతే మేం టీవీలలో మా ముఖాలు కూడా చూపించుకోలేం… మేం పసుపు చొక్కాలు వేసుకుని, చేతిలో జెండాలు పట్టుకోలేదన్న మాటేగాని, ఈ ఐదేళ్లు కూడా తెలుగుదేశం పార్టీ కోసం మీ కార్యకర్తలు, నాయకుల కంటే కూడా మేమే ఎక్కువ కష్టపడ్డాం అని చెప్పారు. చంద్రబాబు అందుకు ఇందులో ఎలాంటి సందేహం లేదు. నా కోసం మీరు చాలా వదులుకున్నారు, ఇప్పటిదాకా నా కోసం పోరాడారు. ఈ నెల కూడా ఇంకొంచెం ఎక్కువ పనిచేసి నన్ను గట్టెక్కించే మార్గం చూడండి అని బ్రతిమలాడుకున్నాడు. వ్యధకృష్ణ వుండి… మీరు పెట్టిన పథకాలు గాని, ఇచ్చిన పసుపు – కుంకుమ వల్ల గాని పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కాబట్టి మీపై సడెన్‌గా ప్రజలకు అభిమానం వచ్చిపడే సంఘటన ఏదన్నా జరగాలి అని అన్నాడు. వెంటనే బాలాజీ అందుకుని… మొన్న పాకిస్థాన్‌లోని

ఉగ్ర శిబిరాలపై బాంబు దాడులతో ప్రధాని నరేంద్ర మోడీకి అమాంతం ఇమేజ్‌ పెరిగింది కదా… అలాగన్న మాట అని వివరించాడు. వెంటనే వంకరకృష్ణ అందుకుని… మోడీ ఇమేజ్‌ పెరగడంలో పాకిస్థాన్‌ పాత్ర కూడా వుంది… పట్టుబడ్డ ఫైలట్‌ అభినందన్‌ను వాళ్ళు ఏదో ముంచుకు పోతున్నట్లు అప్పుడే విడుదల చేసి మోడీకి క్రేజ్‌ పెంచారు. ఇంకా ఓ వారం పాటు వుంచుకుని, భారత జైళ్లలో వున్న ఓ పాతికమంది ఉగ్రవాదులను విడిపించు కుని ఆపై అభినందన్‌ను విడుదల చేసుంటే మోడీ ప్రతిష్ట మసకబారి వుండే దని నిట్టూర్చాడు. అప్పుడే అహో న్యూస్‌ ప్రతినిధి కీర్తి సెల్‌ఫోన్‌కు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ వచ్చింది… అది నరేంద్ర మోడీ అభిమాన సంఘం నుండి వచ్చిన మెసేజ్‌. ‘అభినందన్‌ను పాకిస్థాన్‌ ఆఘమేఘాల మీద ఎందుకు విడుదల చేసిందో తెలుసా… మోడీ దెబ్బకు జడుసుకుని… కాందహార్‌ విమానం హైజాక్‌ సంఘటన లాగే అభినందన్‌ను విడుదల చేయడానికి భారత్‌కు కొన్ని కండిషన్లు పెట్టాలని పాకిస్థాన్‌ భావించింది. కాని, మోడీ వాళ్ళకు ఆ అవకాశమివ్వలేదు. పాకిస్థాన్‌ వైపుకు బ్రహ్మాస్‌ మిస్సైల్స్‌ను గురిపెట్టాడు. 48గంటల్లో అభినందన్‌ను విడుదల చేయకపోతే 49గంటలో పాకిస్థాన్‌ వుండదని అమెరికా, రష్యా, చైనా దేశాల అధినేతలకు తెలియజేశాడు. దాంతో ఆ దేశాధినేతలు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఒత్తిడి తెచ్చారు. మోడీతో పెట్టుకుంటే నీకు మూడినట్లేనని హెచ్చ రించారు. దాంతో ఇమ్రాన్‌ తోక ముడిచి అభినందన్‌ను విడుదల చేశాడు. జయహో… మోడీజీ…. ఇదీ ఆ మెసేజ్‌! దీనిని చదువగానే అహో న్యూస్‌ కీర్తి మెదడులో ఒక మెరుపు మెరిసింది. వెంటనే ఆయన వారితో… చంద్రబాబు గారిని ఈ ఎన్నికల్లో హైప్‌ చేసే ఐడియా వచ్చింది. రేపు ఉదయం 9గంటలకు మా అహో న్యూస్‌లో దానిని బ్లాస్ట్‌ చేస్తాను. తర్వాత మా పచ్చ ఛానెల్స్‌ అన్నీ దానిని కంటిన్యూ చేస్తాయి… రేపు ఉదయం 9గంటలకు మిస్‌కాకండి… మీ అహో న్యూస్‌ అంటూ అక్కడ నుండి వెళ్లి పోయాడు.

——-

పక్కరోజు ఉదయం 9గంటలైంది. చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులంతా టిఫిన్‌లు కానిచ్చేసి టివి ఆన్‌చేసి ‘అహో’ ఛానెల్‌ పెట్టుకుని చూస్తున్నారు. అప్పుడే న్యూస్‌లోకి కీర్తి వచ్చాడు. రావడంతోటే… దేశ ప్రజలకే ఒళ్లు పులకించే సంచలన వార్తతో మీ ముందుకొచ్చింది ‘అహో న్యూస్‌’… భారత ఫైలట్‌ అభినందన్‌ విడుదల కావడంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కీలకపాత్ర… మోడీ బాంబులకు లొంగని పాకిస్థాన్‌, బాబు వ్యూహానికి లొంగి అభినందన్‌ను విడుదల చేసింది. ఉగ్ర సంఘటనల తర్వాత భారత్‌తో యుద్ధానికి పాక్‌ సిద్ధపడింది. మోడీ సై అంటే ఇమ్రాన్‌ సైసై అన్నాడు. ఎట్టి పరిస్థితు లలోనూ ఫైలట్‌ అభినందన్‌ను విడిచి పెట్టేది లేదని ఖరాఖండీగా చెప్పాడు. మీరు అణుబాంబులు వేసినా బెదిరేది లేదని సవాల్‌ విసిరాడు. ఈ దశలో అభినందన్‌ను ఏ విధంగా విడిపించాలనే విషయమై జాతీయ భద్రతా నిపుణులు, ప్రపంచ శాంతి సంఘం నేతలు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబును సంప్ర దించారు. దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబునాయుడు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఫోన్‌ చేశారు. 48గం టల్లో మా ఫైలట్‌ అభినందన్‌ను విడుదల చేయకుంటే 49వ గంటలో పాకిస్థాన్‌లో లక్ష పన్నుల ఐఆర్‌ 20 – 420 నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలను వదులుతాము… ఇక జీవితాంతం నరక యాతన అనుభవిస్తారని హెచ్చరించాడు. ఇమ్రాన్‌ వెంటనే బాబ్బాబు… ఆ పని చేయొద్దు. వెంటనే మీ అభినందన్‌ను పంపిస్తున్నాం… అని చెప్పి మన ఫైలట్‌ను విడుదల చేశాడు. దటీజ్‌ బాబూ… దటీజ్‌ 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ అహో న్యూస్‌ కీర్తి ఆ బులిటిన్‌ ముగించాడు. ఆ వార్త చూస్తూ… చంద్రబాబుతో సహా తెలుగు దేశం నాయకులంతా… ఉగ్రవాదులు బాంబులు, తుపాకులు పట్టుకుంటారని తెలుసు… ఇలా మైకులు, పెన్నులు కూడా పట్టుకుని వుంటారా… అని ఆశ్చర్య పోసాగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here