Home గల్పిక చంద్రబాబును క్షమాపణ కోరిన కేసీఆర్‌

చంద్రబాబును క్షమాపణ కోరిన కేసీఆర్‌

జరిగిన కథ : తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబును కేసీఆర్‌ ‘థూ నీ బ్రతుకుచెడ’ అని తిడతాడు. మీడి యాలో ఆ తిట్టు బాగా హైలెట్‌ అవు తుంది. చంద్రబాబు పడుకున్నా గాని చెవిలో ‘థూ నీ బ్రతుకు చెడ’ అనే డైలాగే రిపీట్‌ అవుతుంటుంది. కేసీఆర్‌ అన్న డైలాగ్‌ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపో తుంది. పక్కరోజు ఐక్యరాజ్య సమితి ప్రధానకార్యదర్శి, సింగపూర్‌ ప్రధాని, ట్రంప్‌, బిల్‌క్లింటన్‌, బిల్‌గేట్స్‌, పుతిన్‌లు చంద్రబాబుకు ఫోన్‌లు చేసి కేసీఆర్‌ తిట్టిన తిట్లపై పరామర్శిస్తారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కూడా ఉండవల్లి లోని ఆయన నివాసానికి విచ్చేసి వుంటారు. ‘థూ నీ బ్రతుకు చెడ’ అన్న కేసీఆర్‌ డైలాగ్‌పై అంత రాద్ధాంతం జరుగుతుండే సరికి చంద్రబాబు ఆవేశంతో ఆ కేసీఆర్‌కు బుద్ధి చెప్పేవారే లేరా? అని అరుస్తాడు. అప్పుడే అక్కడకు యువరత్న నందమూరి బాలకృష్ణ, నవరత్న నారా లోకేష్‌ ఎంట్రీ ఇస్తారు.

ఆ తర్వాత…

ఎప్పుడూ పున్నమి చంద్రుడిలా వుండే తన తండ్రి ముఖం ఆరోజు అమావాస్య చంద్రుడిలా వుండడాన్ని నారా లోకేష్‌ గమనించాడు. తండ్రితో ఆయన… ఏమైంది నాన్నారు, అలా వున్నారు. ఆ రిపబ్లిక్‌ టీవీ సర్వే చూసి గాని నిజమనుకుంటున్నారా? సర్వేలో చెప్పినట్లు వైసిపికి 21 లోక్‌సభ స్థానాలు, మనకు 4స్థానాలు వస్తాయనుకుంటు న్నారా? ఆ సర్వేలను నమ్మాల్సింది మనం కాదు. జగన్‌. ఆ సర్వేను ఆయన గట్టిగా నమ్మితేనే మనం 2014 ఎన్నికల్లో లాగా మళ్ళీ గెలవగలం. నమ్మకుండా తన పని తాను చేసుకున్నాడో మనకు అగచాట్లే అని చెప్పాడు. అప్పుడు ఎంపీ శివప్రసాద్‌ కలగజేసుకుని… మీ నాన్నారు బాధ పడుతున్నది అందుకు కాదు బాబు… ఆ కేసీఆర్‌ మీ నాన్నగారిని చాలా ఘోరంగా తిట్టాడు అని చెప్పాడు. అందుకు లోకేష్‌… ఏం తిట్టాడు… వరదల్లో వాటర్‌ అమ్ముకునే ఫేసు అని తిట్టాడా… శీతాకాలంలో మట్టి కుండ లమ్ముకునే వాళ్ళన్నాడా… ఎండా కాలంలో హీటర్లు అమ్ముకునేవాళ్ళమని తిట్టాడా… ఏమని తిట్టాడు అని లోకేష్‌ గద్దించి అడిగాడు. అప్పుడు మురళీ మోహన్‌ వుండి… మీ నాన్నోరిని ఆయన అన్ని మాటలు అనలేదు బాబూ… నువ్వు కొత్త డైలాగ్‌లు సృష్టించమాకు… ఆ కేసీఆర్‌ అన్న డైలాగ్‌తోనే మీ నాన్నగారు కోలుకోలేకున్నారు అని అన్నాడు. అసలు కేసీఆర్‌ ఏమన్నాడో చెప్పండి టెన్షన్‌ పెట్టకుండా అని కోపంగా అడిగాడు. ‘థూ నీ బ్రతుకు చెడ’ అని మీ నాన్నగారిని తిట్టాడు బాబు అని శివప్రసాద్‌ చెప్పాడు. ఆ మాట వినగానే లోకేష్‌లో ఆవేశం పెరిగింది. ఆ కేసీఆర్‌ అంతు చూస్తా… మా నాన్న కాలిగోటికి కూడా పనికిరాడు, మా నాన్ననే అంత మాటంటాడా అని అరవసాగాడు. కూల్‌ బాబూ కూల్‌ అని మురళీమోహన్‌ అన్నాడు. నేను కూల్‌ కావాలంటే ఒక లస్సీ చెప్పండి అని లోకేష్‌ చెప్పాడు. అంతలో అక్కడకు సింహపురి చాణక్య సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి వచ్చాడు. పరిస్థితిని గమ నించి ఏమైందని పత్తిపాటి పుల్లారావును అడిగాడు. జరిగిందంతా పుల్లారావు చెప్పాడు. అప్పుడు చంద్రబాబుతో సోమిరెడ్డి… ఆ కేసీఆర్‌కు బుద్ధి చెప్పే అణ్వాయుధాలు మన దగ్గరే వున్నాయి సార్‌, వాటిని ప్రయోగిద్దామన్నాడు. చంద్రబాబు ఉలిక్కిపడి… అణ్వాయు ధాలా… ఈ మాట వింటే ఆ ట్రంప్‌ మన మీద బాంబులేసిపోతాడు. గట్టిగా అనకు మీడియా వింటుంది. నువ్వు చెప్పేదేదో క్లారిటీగా చెప్పు అని అన్నాడు. అందుకు సోమిరెడ్డి… మన లోకేష్‌, బాలకృష్ణలు అణ్వాయుధాలతో సమానం సార్‌. ఒకరు పృధ్వి క్షిపణి అయితే ఇంకొకరు అగ్ని క్షిపణి… ఆ కేసీఆర్‌ను ధ్వంసం చేసి వస్తారు. తెలంగాణలో ప్రచారానికి ఆ రెండు క్షిపణులను వదలండి అని చెప్పాడు. నాకైతే నమ్మకం లేదని చంద్రబాబు అన్నాడు. నాకైతే నమ్మకం వుంది సార్‌, ముందు మీరు ఆ రెండు క్షిపణులను తెలంగాణ మీదకు వదలండి అని సోమిరెడ్డి ధైర్యంగా చెప్పాడు.

——

కరెక్ట్‌గా వారంరోజుల తర్వాత…

ఉండవల్లిలోని తన ఇంట్లో చంద్ర బాబు నిద్రలేచి హాల్‌లో కొచ్చాడు. తన కంటే ముందే నిద్రలేచి టీవీ చూస్తున్న దేవాన్ష్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడసాగాడు. ఆయన మనుమడితో కాలక్షేపంలో వుండగా ”నన్ను క్షమించండి దొర” అనే మాటలు వినిపించాయి. కింద చూస్తే కేసీఆర్‌ తాను కూర్చుని వున్న సోఫా కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు. కేసీఆర్‌… అవి నా కాళ్ళు కాదు, సోఫా కాళ్ళు అని చెప్పాడు. ఏవైనా కాళ్ళే కదా… మీ కాళ్ళు పట్టుకోలేకే వాటి కాళ్ళు పట్టుకున్నాను, ఏదో బుద్ధి గడ్డి తిని మీపై మాట తూలాను, నోటికొచ్చినట్లు తిట్టాను. నన్ను మన్నించండి, ఇంకెప్పుడూ తప్పుగా మాట్లాడను. ముందు ఆ లోకేష్‌ను, బాలకృష్ణలను వెనక్కు పిలిపించండి అని ప్రాధేయపడ్డాడు. చంద్రబాబు అతనిని లేవదీసి అలాగే పిలిపిస్తాలే అని హామీ ఇచ్చాడు. చంద్రబాబు హామీతో కేసీఆర్‌ ఊపిరి పీల్చుకుని వెళ్ళిపోయాడు. కేసీఆర్‌ వచ్చి క్షమాపణ కోరడంతో చంద్రబాబుకు ఏమీ అర్ధం కాలేదు. తెలంగాణలో లోకేష్‌, బాలకృష్ణలు ఏం చేసారో తెలుసు కోవాలని ఆయన మనసు ఆతృత చెంద సాగింది. అంతలో అక్కడకు సోమిరెడ్డి వచ్చాడు. చంద్రబాబు ఆయనతో కేసీఆర్‌ వచ్చి క్షమాపణలు కోరిన విషయం చెప్పి అసలు అక్కడ ఏం జరిగివుంటుందని అడిగాడు. అప్పుడు సోమిరెడ్డి చేతివేళ్ళతో ఎయిర్‌ స్క్రీన్‌ గీసి సీన్‌లు ప్లే చేసాడు.

——–

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో తెలుగుదేశంపార్టీ బహిరంగ సభ… లోకేష్‌ మాట్లాడుతున్నాడు. అన్నలారా, తమ్ముల్లారా, ఈ దేశంలో కులపిచ్చి మత పిచ్చి అత్యంత అవినీతి పార్టీ ఏదైనా వుందంటే అది తెలుగుదేశమే… సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే మీ ఉరి మీరు బిగించు కున్నట్లే అని చెప్పాడు. లోకేష్‌ ప్రసంగా నికి సభకు వచ్చిన జనాలందరూ ఆశ్చర్యపోయారు.

——–

అది అదిలాబాద్‌జిల్లా బెల్లంపల్లి… యువరత్న బాలకృష్ణ రోడ్‌షో జరుగు తోంది. ఎండ ఎక్కువుగా వుండడంతో ఆయన చొక్కా విప్పేసీ రోడ్‌షోలో పాల్గొన్నాడు. తనపైకి పూలదండలు విసిరిన ఇద్దరిని మధ్యలో కొట్టాడు కూడా! తర్వాత ఒక జంక్షన్‌లో బహిరంగ సభ… బాలకృష్ణ హిందీ, ఇంగ్లీష్‌, చైనీస్‌, మిల్లీ, జపనీ, లాటిన్‌, అరబిక్‌, ఉర్దూ భాషలను మిక్స్‌ చేసి కేసీఆర్‌పై తిట్ల దండకం మొదలుపెట్టాడు. అన్ని రకాల భాషలు వింటుండేసరికి జనాలు హుషారుగా చప్పట్లు కొట్టసాగారు.

ఎయిర్‌ స్క్రీన్‌పై ఈ రెండు సీన్‌లు చూసాక చంద్రబాబు… మా పుత్రరత్నం లోకేష్‌ మన పార్టీనే విమర్శించి సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే ఉరేసుకున్నట్లేనని చెప్పా డుగా… అలాగే బాలయ్య అన్ని భాషలు మిక్స్‌ చేసి కేసీఆర్‌ను తిట్టాడు… దీనికి, కేసీఆర్‌ నన్ను క్షమాపణ కోరడానికి సంబంధమేంటని అడిగాడు. అందుకు సోమిరెడ్డి… లోకేష్‌ సొంత పార్టీనే తిట్టడంపై తెలంగాణ ప్రజల్లో అనుమాన మొచ్చింది. సొంత పార్టీనే తిట్టిన నాయ కుడిని ప్రజలు ఇంతవరకు చూడలేదు. లోకేష్‌ నిజాయితీ అక్కడి ప్రజలకు నచ్చి… మాకు మీ నాయకత్వమే కావాలని ఆయ నకు బ్రహ్మరథం పట్టసాగారు. అలాగే బాలయ్య ఆల్‌ లాంగ్వేజీ తిట్లు తెలంగాణ ప్రజలను బాగా ఆకట్టుకోసాగాయి. ఇంకో వారం ఆయన తెలంగాణలో తిరిగితే కేసీఆర్‌ ఆయన ముందు ఎందుకూ పనికిరాడు. వీళ్ళిద్దరూ తెలంగాణలో వుంటే తన ఇమేజ్‌ డామేజీ అవుతుందనే కేసీఆర్‌ మీ వద్దకు కాళ్ళ బేరానికి వచ్చాడని చెప్పాడు. దాంతో చంద్రబాబులో పుత్రో త్సాహం తన్ను కొచ్చినట్లు కనిపించి… మనసులోనే ‘ఐ లవ్‌యు మై సన్‌’ అనుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here