Home రాష్ట్రీయ వార్తలు గెలుపే లక్ష్యంగా… కసరత్తు మొదలుపెట్టిన జగన్‌

గెలుపే లక్ష్యంగా… కసరత్తు మొదలుపెట్టిన జగన్‌

తెలిసో తెలియకో వేసిన తప్పటడుగులు 2014లో జగన్‌ను గెలవ కుండా చేశాయి. సరే, జరిగిందంతా మంచికే అని ఓ కవి పాటలో వ్రాసినట్లు ఈ ఐదేళ్ళ పరిణామాలు చూస్తే 2014లో జగన్‌ ఓడిపోవడమే కరెక్ట్‌ అనిపిస్తోంది. ముందు కష్టపడాలి… ఆ తర్వాత ఫలితం పొందాలి. కష్టపడ్డ తర్వాత తీసుకునే విశ్రాంతి ఎంతో హాయిగా వుంటుంది.

ఈ లెక్కలో తీసుకుంటే 2014 ఓటమి నుండి జగన్‌ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడనే అర్ధమవుతోంది. ముఖ్యంగా ఆయన జనంలోకి వెళ్లడానికి చూపిన తాపత్రయం, జనం సమస్యలు తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రజాసంకల్ప పాదయాత్ర, ప్రత్యేకహోదాపై ఆయన చేస్తున్న పట్టువిడవని పోరాటం రాష్ట్ర ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచాయి. 2014లో ఆయనకి అనుభవం లేదు, ఇతనికి ఓటేస్తే రాష్ట్రం ఏమైపోతుందో అని సంశయించినవాళ్ళు కూడా ఈ ఐదేళ్లలో జగన్‌ పోరాటపటిమను, నాయకత్వ సమర్ధతను, ముఖ్యంగా రాజకీయాలలో ఆయన పాటి స్తున్న విలువలను చూసి ఆకర్షితులవుతున్నారు.ఖచ్చితంగా ఒక్క మాటలో చెప్పాలంటే 2014 ఎన్నికల్లో తటస్థులు, మేధావులు నూటికి 90మంది చంద్రబాబువైపే మొగ్గు చూపారు. ఈసారి వారిలో 50శాతం మంది లేదంటే అంతకంటే ఎక్కువ శాతం మంది మద్దతునే జగన్‌ పొందబోతున్నా డని చెప్పవచ్చు.

గత ఎన్నికల సమయంలో వైసిపికి చాలావర్గాలు దూరమయ్యాయి. తెలుగు దేశం నాయకులు పుట్టించిన పుకార్లు, పవన్‌కళ్యాణ్‌ ఎఫెక్ట్‌, మతపరమైన ప్రచా రాల వల్ల కాపు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, బీసీ వర్గాలు వైసిపికి ఓట్లేయలేదు. కాని, ఈసారి జగన్‌ ఆ పరిస్థితి మార్చాడు. పార్టీలో కుల, మతపరమైన ముద్రలు లేకుండా చేశాడు. అన్ని కులాలు, అన్ని వర్గాల వారికి సమప్రాధాన్యతనిస్తున్నాడు. పలు కులాలకు అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తానని ఆయన ఇచ్చిన హామీ బీసీ వర్గాలపై బాగానే ప్రభావితం చూపుతోంది. ప్రధా నంగా పాదయాత్రలో జగన్‌ ప్రకటించిన నవరత్నాలు రైతులు, బీసీలు, మహిళలను పార్టీకి చేరువ చేసింది. ఋణమాఫీ వాగ్ధానం గత ఎన్నికలలో రైతులను తెలుగుదేశంకు ఓటేసేలా చేసింది. అధికా రంలోకి వచ్చాక చంద్రబాబు ఋణమాఫీని బోగస్‌గా మార్చాడు. బాబు చేతిలో దగాపడ్డ రైతాంగం జగన్‌ ప్రకటించిన ‘రైతు భరోసా’ పథకాన్ని విశ్వసిస్తోంది. ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష నేతగా, పోరాటాల ద్వారా, పాదయాత్రల ద్వారా ప్రజలలో విశ్వాసాన్ని పెంచుకున్న జగన్‌, కేవలం పథకాల ప్రకటన, పాదయాత్రల ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం లేదు. గత ఎన్నికల్లో చేసిన తప్పే అది. అప్పుడు ఒక ఎలక్షన్‌ టీమ్‌ అనేదే పార్టీకి లేదు. రాజకీయ వ్యూహాలు లేవు. సర్వేలు లేవు, అంచనాలు లేవు. ముఖ్యంగా ఆర్ధిక వనరుల్లో బాగా బలహీనం. ఇప్పుడా పరిస్థితులన్నీ మార్చుకుంటున్నారు. లోపా లను సరిచేసుకుంటున్నారు.

పాదయాత్ర ముగిసిన దరిమిలా… జగన్‌ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక పై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీకి, పార్ల మెంటుకు ఒకేసారి ఎన్నికలు జరుగు తాయి. అయితే పార్లమెంట్‌ అభ్యర్థుల ప్రభావం అసెంబ్లీ అభ్యర్థుల మీద కూడా పడబోతుంది. పార్లమెంటు అభ్యర్థులు అన్ని విధాలా గట్టోళ్లయితేనే వారినుండి అసెంబ్లీ అభ్యర్థులకు సహకారం అందు తుంది. ఈ కోణంలోనే 2014 ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థులుగా పోటీచేసిన కొందరికి ఈసారి సీట్లుండకపోవచ్చునని తెలుస్తోంది. పార్లమెంటు సీట్లకంటే అధికారానికి అసెంబ్లీ సీట్లు ముఖ్యం. అయితే పార్లమెంట్‌ అభ్యర్థులు అన్నివిధాలా శక్తివంతులైతేనే అసెంబ్లీ అభ్యర్థులు తమ నియోజకవర్గాలలో పోరాడగలరు. ఈ దృష్ట్యా బలమైన అభ్యర్థులను పార్లమెంటు సీట్లలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చంద్రబాబు అనుభవం, రాజకీయ వ్యూహాలు తట్టుకుని నిలబడాలంటే జగన్‌ ఈ మాత్రం వేగం పెంచక తప్పదు. అంతేకాదు, చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగితేనే ఎన్నికల యుద్ధంలో జగన్‌ నెగ్గుకురాగలడు.

ఆ నలుగురు

వై.యస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా నిత్యం ప్రజల్లో వుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, భారతదేశంలోనే ఇంతవరకూ ఎవ్వరూ చేయ నంతగా ప్రజాసంకల్పయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజల సమక్షంలోకి ప్రత్యక్షంగా వెళ్ళే విధంగా పాదయాత్ర చేపట్టి ఘనమైన నాయకుడిగా, నమ్మక మైన నేతగా, సరైన వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు డా|| వై.యస్‌.రాజశేఖరరెడ్డి తనయుడు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి.

రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతోంది. ఏ జిల్లాలో పరిస్థితి ఎలా వుంది. వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఏఏ వ్యూహాలు చేస్తున్నాయి వంటి అంశాలతో పాటు దేశ రాజదాని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడికి చేరవేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టే పనిలో అతికీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు నలుగురు. వేణుంబాక విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు జగన్‌ చుట్టూ నాలుగు స్థం భాల్లా ఉంటూ ఆయన నాయకత్వాన్ని పటిష్ట పరచడంతో పాటు ఆయన ఆలో చనలను, ఆశయాలను ప్రజల ముంగిళ్ళ లోకి తీసుకువెళ్ళడమే కాకుండా పార్టీలో వస్తున్న అరాకొరా సంక్షోభాలను సైతం అత్యంత చాకచక్యంతో పరిష్కరింపజేసే దిశగా ఈ నలుగురు పనిచేస్తున్నారన్న సమాచారం ఇప్పుడు దేశమంతా విన పడుతోంది. గల్లీ నుండి ఢిల్లీ వరకూ జరిగే అన్ని పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్య యనం చేస్తూ, ఎక్కడ ఎలా స్పందించాలో ఆ విధంగా తాము స్పందించడం, లేదా తమ నాయకుడి వాణిని వినిపింపజేయ డంలో కీలకపాత్ర ఈ నలుగురిదే కావడం, పార్టీ అధినాయకత్వానికీ ప్రజలకీ మధ్య వారధులుగా వ్యవహరిస్తూ… పార్టీ శ్రేణు లకు, కార్యకర్తలకు వీరు అందుబాటులో వుండి పార్టీ పటిష్టతకు అహరహం శ్రమి స్తుండడంతో 2019లో పార్టీ విజయం తధ్యమనే ఆశాభావం వై.యస్‌.ఆర్‌.పార్టీ క్యాడర్‌తో పాటు రాజకీయ మేధావుల్లో సైతం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here