Home జిల్లా వార్తలు గూడూరు వైసిపి సీటొస్తే లక్కీ ఛాన్స్‌!

గూడూరు వైసిపి సీటొస్తే లక్కీ ఛాన్స్‌!

నెల్లూరుజిల్లాలో ఇప్పుడు వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న నియోజకవర్గా లలో గూడూరు మొదటి స్థానంలో వుంది. ఉండాల్సి నోళ్లంతా ఇక్కడ వైసిపిలోనే వున్నారు. నల్లపరెడ్లు, నేదురుమల్లి కుటుంబం వైసిపిలోనే వుంది. ఆనం కుటుంబానికి చెందిన బంధువర్గమంతా కూడా వైసిపిలోనే వుంది. ఇక ఈమధ్య మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పొణకా దేవసేన దంపతులతో పాటు మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కోడూరు కల్పలత దంపతులు వైసిపిలో చేరివున్నారు. తాజాగా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి, రవి చంద్రారెడ్డి సోదరులు కూడా వైసిపిలో చేరడం జరిగింది. కోట మండలంలో గట్టి పట్టున్న పేర్నాటి శ్యాం వైసిపిలోనే వున్నాడు. నియోజకవర్గంలో వైసిపి అత్యంత బలంగా వుంది. వీటన్నింటికి తోడు సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ మీద, అలాగే తెలుగుదేశం మీద తీవ్ర వ్యతిరేకత వుంది. ఈ పరిస్థితుల్లో గూడూరు వైసిపి టిక్కెట్‌ తెచ్చుకున్న

వాళ్ళు అదృష్టవంతులనే టాక్‌ నడుస్తోంది. మరి ఈ టిక్కెట్‌ ఎవరిది? ఇన్‌ఛార్జ్‌గా వున్న మేరిగ మురళి టిక్కెట్‌ను ఆశించడం సహజం. పార్టీ పరిస్థితి బాగుందని చెప్పి ఎవరికి పడితే వారికి టిక్కెట్‌ ఇచ్చి లేనిపోని తలనొప్పి తెచ్చుకో వడం ఎందుకనే కోణంలో ఆయన పేరు వెనక్కిపోతోంది. తెలుగు దేశంతో పొత్తు కుదిరితే గూడూరు నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా దిగొచ్చని పనబాక కృష్ణయ్య భావించారు. అయితే పొత్తు లేదని తేలిపోయింది. ఇప్పుడు పనబాక కృష్ణయ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా దిగినా కష్టమే. అదే వైసిపి టిక్కెట్‌ తీసుకుంటే గెలుపు నల్లేరు మీద నడకే! అయితే ఆయన తన సతీమణి, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మితో కలిసి వైసిపిలో చేరాల్సివుంటుంది. ఆమెకు కూడా బాపట్ల లోక్‌సభ ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అవకాశాన్ని కృష్ణయ్య అందిపుచ్చుకుంటాడో లేదో చూడాలి. వీళ్లు కాకుండా బత్తిన విజయకుమార్‌, ప్రస్తుతం టీడీపీలో వున్న డాక్టర్‌ బి.జ్యోత్స్నలతలు కూడా వైసిపి టిక్కెట్‌ రేసులో వున్నట్లు వినికిడి. మరి ఎవరు లక్కీపర్సనో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here