Home జిల్లా వార్తలు గూడూరుకు వరప్రసాద్‌?

గూడూరుకు వరప్రసాద్‌?

జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అత్యంత బలంగా వున్న నియోజకవర్గాలలో ఇప్పుడు గూడూరు అసెంబ్లీ మొదటి స్థానంలో వుంది. ఈ నియోజకవర్గంలో పార్టీకి బలమైన నాయకత్వముంది. ఓ పక్క నల్లపరెడ్లు, ఇంకో పక్క నేదురుమల్లి కుటుంబం, పేర్నాటి, పొణకా, వేమారెడ్డి వంటి రాజకీయ కుటుంబాలు వైసిపిలోనే వున్నాయి. పార్టీ బలంగా వున్నచోట అభ్యర్థి కూడా ఇంకా బలమైనోడైతే… గూడూరులో అదే జరగబోతుంది.

గూడూరు అసెంబ్లీకి వైసిపి అభ్యర్థిగా తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యులు వెలగపూడి వరప్రసాద్‌ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి తిరుపతి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన వరప్రసాద్‌, 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా విజయం సాధించాడు. ఎంపీగా ఈ ఐదేళ్ళు బాగా పనిచేశాడు. ప్రజలకు అందుబాటులో వున్నాడు. ప్రత్యేకహోదా ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఆయన మీద వ్యతిరేకత లేదు. మనిషి కూడా అందరితో కలిసిపోయే గుణమున్నోడు. గూడూరు అసెంబ్లీ అభ్యర్థి అయితే వర్గాలు, గ్రూపులు లేకుండా అందరూ పనిచేస్తారు కూడా!

తిరుపతి లోక్‌సభ వైసిపి అభ్యర్థిగా స్వచ్ఛంధ పదవీ విరమణ తీసుకున్న ఓ ఐఏఎస్‌ అధికారి రాబోతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here