Home జిల్లా వార్తలు గిరిజనుల సంక్షేమానికి కృషి – మంత్రి సోమిరెడ్డి

గిరిజనుల సంక్షేమానికి కృషి – మంత్రి సోమిరెడ్డి

ఈరోజు(10న) ముత్తుకూరు మండలంలోని పైనాపురంలో రాష్ర్ట వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఆ గ్రామంలో 61 ఎన్టీఆర్ గృహాలతో పాటు 98 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, 59లక్షలతో నిర్మించిన రెండు తాగునీటి పథకాలను ప్రారంభించారు. అలాగే 46లక్షలతో చేపట్టనున్న మరో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ అమాయకులైన గిరిజనులకు ఈ రాష్ర్ట ప్రభుత్వం అన్ని విధాలా అండగా వుంటుందన్నారు. సిజెఎఫ్ ఎస్ సొసైటీలను రద్దు చేసి దళితులు, గిరిజనులు, బీసీలు, పేదలకు భూయాజమాన్య హక్కులు కల్పించడంతో ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని, 6,600కోట్ల విలువైన భూములకు సంబంధించి 60,505మంది పేదలకు పట్టాలు అందజేయబోతున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పరిమితిని 75 యూనిట్ల నుండి 100 యూనిట్లకు పెంచినట్లు చెప్పారు. రాష్ర్టంలో 2.70కోట్ల మంది పేదలకు బీమా చేసిన ఖనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. పైనాపురం పంచాయితీలోనే 4కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here