Home రాష్ట్రీయ వార్తలు గబ్బుపడుతున్న గబ్బర్‌సింగ్‌

గబ్బుపడుతున్న గబ్బర్‌సింగ్‌

నా వెనుక పిచ్చి అభిమానులున్నారు. ఈ అభిమానాన్ని సొమ్ము చేసుకుందామనే ఉద్దేశ్యం తప్పితే, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఇంకే రాజకీయ ఆశయాలు కనిపించడం లేదు. అసలు రాజకీయాలలో పోరాటం చేయాలి, ప్రజలవైపు నిలబడాలన్న చిత్తశుద్దే ఆయనలో కనిపిం చడం లేదు. అవేమీ లేకపోగా, ఈయన చంద్రబాబు మనిషే… అనే విషయాన్ని రోజురోజుకీ బలంగా ఋజువు చేసు కుంటున్నాడు.

2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఉపయోగపడ్డ పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు ప్రత్యేక జెండాతో తిరుగుతున్నాడు. నాలుగున్నరేళ్ళుగా తాను మద్దతునిచ్చిన తెలుగుదేశం పార్టీయే అధికారంలో వుంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని సక్రమంగా అమలు చేయ లేదు. ఆరోజు మాత్రం చంద్రబాబు ఇస్తున్న హామీల అమలుకు నాది గ్యారంటీ అని… కావా లంటే బాండ్‌ పేపర్‌ రాసిస్తానన్నాడు. కాని, ఈ నాలుగున్నరేళ్ళుగా ఆయన ఏ ఒక్క హామీ అమలుకు కూడా బాధ్యత వహించిన దాఖలాలు లేవు. హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తానన్న ఆయన గొంతు గావుకేకలు వేయ డానికి తప్పితే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తెరుచుకోలేదు. బంగారు పంటలు పండే భూములను సింగపూర్‌ రాజధాని పేరుతో లాక్కుంటున్నప్పుడు, అధికారులను అధికారపార్టీ నాయకులు ఇసుకలో ఈడ్చి కొట్టినప్పుడు, కాల్‌మనీ సంఘటనలు బయటపడినప్పుడు, ఎయిర్‌ పోర్టుల పేరుతో భూములు కబ్జా చేసి నప్పుడు, ప్రత్యేకహోదా అక్కర్లేదని ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు, వివిధ ఆర్భాటాలకు వేలకోట్లు దుర్వినియోగం చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తానన్న ఆ గొంతు పెగలలేదు. మరి ఈ గొంతు ఎక్కువుగా ఎవరిమీద లేస్తుం దంటే ప్రతిపక్ష నేత జగన్‌ మీద. భారత దేశ రాజకీయ చరిత్రలోనే అవినీతి, అక్ర మాలతో సాగుతున్న ప్రభుత్వాన్ని వదిలేసి, ఏ ఒక్కరోజు కూడా పరిపాలన చేయని ప్రతిపక్ష నేతను విమర్శిస్తున్న నాయకుడెవ రైనా వున్నారంటే అది ఒక్క పవన్‌ కళ్యాణే!

ఇటీవల వరకు వైసిపిలో కూడా కొంత మంది నాయకులు పవన్‌ను చంద్రబాబుతో పోట్లాడుతున్నాడనే నమ్మేవాళ్ళు. ఇప్పుడు వైసిపి నాయకులే కాదు, జనం కూడా పవన్‌ను నమ్మడం లేదు. అతను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి చంద్రబాబు ప్రయోగించిన అస్త్రం అని అందరికీ ఇప్పు డిప్పుడే అర్ధమవుతోంది. అతను పక్కా చంద్రబాబు తొత్తు అని తెలిసాక జగన్‌ కూడా పవన్‌ విమర్శలకు ఘాటుగా బదు లిస్తున్నాడు. పవన్‌ చంద్రబాబు మనిషని, అతని చేతిలో కీలుబొమ్మని అందరికీ అర్ధమవుతోంది. ఇక అర్ధం చేసుకోవా ల్సింది పవన్‌ గారి పిచ్చి అభిమానులే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here