బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గజ’ తుఫాన్ ప్రభావం నెల్లూరుజిల్లాపై తీవ్రంగా వుండే అవకాశాలున్నాయి. సోమవారం నుండే వాతావరణంలో మార్పులు సంభవించాయి. పెనుతుఫాను దృష్ట్యా అధికారులు ప్రజలను, తీర్రపాంతాలవారిని అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి వరకు నెల్లూరు, చెన్నైల మధ్య వున్న తుఫాన్ గమన దిశ సోమవారం ఉదయానికి చెన్నైకి ఉత్తరంగా మళ్లింది. మంగళవారం ఉదయానికి గాని తుఫాన్ దిశపై ఓ అంచనా వచ్చే అవకాశాలు లేవు.
