Home జిల్లా వార్తలు క్షమాపణతో… విజ్ఞత చాటుకున్నాడు అనిల్‌

క్షమాపణతో… విజ్ఞత చాటుకున్నాడు అనిల్‌

రాజకీయాలలో భావోద్వేగాలు సహజం. అయితే నాయకులకు సహనం కూడా అంతే అవసరం. వారి సహనమే వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. వారి మాట తీరే పదిమందిని ఆకట్టుకునేలా చేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో నాయకులు నోరు జారడం సాధా రణం. కొందరు ఆ మాటలను సమర్ధించుకుంటారు. అది మూర్ఖత్వం. కాని కొందరు మొదట ఆవేశంలో ఏదేదో మాట్లాడేసినా తర్వాత తప్పు తెలుసుకుంటారు. అలా మాట్లాడ్డం పొరపాటే నని ఒప్పుకుంటారు. మన్నించమని కోరడం ద్వారా తమ తప్పును సరిదిద్దుకుంటారు. అది విజ్ఞుల లక్షణం. రాజకీయాలలో ఎంతో మంచి భవిష్యత్‌ వున్న నెల్లూరునగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ అలాంటి విజ్ఞతనే చాటుకున్నాడు.

విశాఖ ఎయిర్‌పోర్టులో తమ ప్రియతమ నేత వై.యస్‌.జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజున అనిల్‌ ఆవేశంతో వూగిపోయాడు. మా నాయకుడికి ఏమన్నా అయ్యిందంటే… ఒక్క టీడీపీ —- వుండడంటూ మాట్లాడేసాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జరిగిన సంఘటనపై ఆవేశం రావడం సహజమే గాని, అలాంటి సమయంలోనే సహనం చూపాలి. అనిల్‌ ఆరోజు పొరపాటున నోరుజారాడు. జగన్‌ సంఘటన జరిగాక 29వ తేదీన నెల్లూరొచ్చిన అనిల్‌ ఆరోజు తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాడు. అయితే జగన్‌ హత్యాయత్నంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్న కొందరు తెలుగుదేశం నాయకుల తీరు మాత్రం దారుణమని, అలాంటి వారికి మానవత్వం లేదని మీడియాతో మాట్లాడుతూ విమర్శించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here