Home జిల్లా వార్తలు కోవూరు… పెరిగిన సీటు పోరు!

కోవూరు… పెరిగిన సీటు పోరు!

కోవూరు తెలుగుదేశం టిక్కెట్‌ ఎవరి దనే దానిపై ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ సీటు వ్యవహారం అధినేత చంద్రబాబుకే తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మళ్లీ కూడా సీటు నాదే అనే ధీమాతో ఉన్నాడు. సీటు కోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు.

ఇక 2014లో ఈ సీటును పోలంరెడ్డి కోసం వదులుకున్న పెళ్లకూరు శ్రీనివా సులురెడ్డి ఈసారి వెనక్కు తగ్గడం లేదు. 2019లో సీటు నాకే ఇస్తానని మాటి చ్చారు. అందుకే 2014లో వదులుకున్నా, ఈసారి వెనక్కి తగ్గేది లేదు. బ్యాలెట్‌లో నా పేరు ఖచ్చితంగా ఉంటుందంటూ పంతం పట్టాడు. సిటింగ్‌ ఎమ్మెల్యే పోలం రెడ్డిపై వ్యతిరేకత వుందని, తనకైతే ఆ సమస్య లేదని, సీటును గెలుచుకుని వస్తా నని ధైర్యంగా చెబుతున్నాడు. అంతేకాదు, ప్రచారం కూడా మొదలుపెట్టేసాడు. పెళ్ల కూరును దారిలో పెడదామని చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడాడు. కోవూరు తనకు ఇవ్వాల్సిందేనని పెళ్లకూరు పట్టు బట్టడంతో అక్కడ సర్వే నిర్వహించి ఎవరు బెటర్‌ అని తేలితే వారికే టిక్కెట్‌ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అంతేకాదు, చెప్పిన అరగంటలోనే కోవూరు అభ్యర్థిగా ఎవరు కావాలనుకుంటున్నారు అని పోలంరెడ్డి, పెళ్ళకూరు పేర్లను ఐవిఆర్‌ఎస్‌ ద్వారా వదిలారు.

వీళ్లిద్దరి వ్యవహారం ఇలావుంటే పెన్నా డెల్టా కమిటి ఛైర్మెన్‌ యర్రంరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డిలు కూడా తెరమీద కొచ్చారు. వాళ్లిద్దరు కూడా పార్టీకి చాలా ఏళ్ళ నుండి సేవ చేస్తున్నామని, కోవూరు టిక్కెట్‌ తమకే కేటాయించాలని ఎవరికి వాళ్ళు అడుగుతున్నారు.

మొత్తానికి కోవూరు టిక్కెట్‌కు తీవ్ర పోటీవున్నా పోలంరెడ్డి, పెళ్లకూరులలో ఒకరు అభ్యర్థి కాగలరు. అభ్యర్థి ఏ శీనయ్య అవుతాడో త్వరలోనే తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here