Home రాష్ట్రీయ వార్తలు కేసీఆర్‌ సై.. బాబు నై!

కేసీఆర్‌ సై.. బాబు నై!

నాయకుడంటే ఎలాఉండాలి. ఏదైనా కుండ బద్ధలు కొట్టేట్లు వుండాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అలాగే వుంటాడు. ఏదీ నాన్చడు. అప్పటికప్పుడే తేల్చేస్తాడు. ముందస్తు ఎన్నికల విషయంలో కూడా ఆయన వైఖరి అలాగే వుంది. ఎవరు వచ్చినా రాకున్నా తాను డిసెంబర్‌లోనే ఎన్నికలకు పోతున్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ అనే నినాదంతో ఏకకాల ఎన్నికల కోసం ప్రయత్నిస్తున్న కేంద్రప్రభుత్వం దానిపై లా కమిషన్‌, ఎన్నికల కమిషన్‌ల ద్వారా పెద్దఎత్తునే కసరత్తు చేయించింది. దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిం చడం కష్టమే! ఎందుకంటే సగానికిపైగా రాష్ట్రాలలోని ప్రభుత్వాల పదవీకాలం గడువు చాలానే వుంది. కాని, అన్నీ సవ్యంగా జరిగితే 11 రాష్ట్రాలకు మాత్రం లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేయవచ్చు. అది కూడా డిసెంబర్‌లోనే! దీనికి దాదాపు అన్ని రాష్ట్రాలు సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అయితే కేంద్ర ప్రకటనతో పని లేకుండానే డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోతున్నట్లు ప్రకటించాడు. కాని ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాడు. ముందస్తు ఎన్నికలకు భయపడుతున్నాడు. ఎన్నికలంటే కేసీఆర్‌లో భయం లేదు. ఏరోజు ఎన్నికలు జరిగినా తిరిగి అధికారంలోకి వస్తాననే ధీమాతో వున్నాడు. అందుకే పార్టీ సమావేశంలో తన మంత్రులు ముందస్తుకు పోవద్దని చెప్పినా కేసీఆర్‌ వినలేదు. కేసీఆర్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవు. భారీ కుంభకోణాలు లేవు. పెద్దఎత్తున సంక్షేమ పథకాలతో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల ఆదరణ పెంచుకుంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు.

కాని, ఏపిలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలున్నాయి. ఏ సంక్షేమ పథకం సక్రమంగా అమలు జరగడం లేదు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో చంద్రబాబు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడు. అమరావతి రాజధాని గ్రాఫిక్‌ సినిమాగా తయారైంది. దీనికితోడు రాష్ట్రంలో కుల రాజకీయాలు పెరిగాయి. బీజేపీ తెగదెంపులు ఏ తల నొప్పి తెస్తుందోనని బాబు భయపడుతున్నాడు. ఇక మైనింగ్‌ మాఫియా, పి.డి అకౌంట్లపై ఆరోపణలు చంద్రబాబును ఊపిరాడనీయడం లేదు. పచ్చమీడియా అండ లేకుండా వాళ్ళు వాస్తవాలు వ్రాసే పనైతే చంద్రబాబు ఎప్పుడో గబ్బుపట్టేవాడు. వాళ్ళు సమర్ధిస్తున్నారు కాబట్టే చంద్రబాబు ఈ మాత్రం నిలబడ్డాడు. వీటన్నింటి నుండి బయటపడాలంటే చంద్రబాబుకు ఇంకా కొంత సమయం కావాలి. అందుకే ముందస్తుకు నై అంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here