Home జాతీయ వార్తలు కేరళ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సత్య

కేరళ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సత్య

కొద్దికాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ ఒక మాట చెప్పాడు. నేటి రాజకీయాలలో కూడా డబ్బులతో పనిలేకుండా పనిచేసే కార్యకర్తలున్నారంటే అది బీజేపీ కార్యకర్తలేనని ఆయన చెప్పడం జరిగింది. బీజేపీ కార్యకర్తల గురించి ఆయన అంతవరకే చెప్పారు. కాని, బీజేపీ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు కూడా వున్నారు. ఇళ్లు, వాకిలి, పెళ్లాం, బిడ్డలను వదిలేసి బీజేపీ కోసమే జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలు కూడా వున్నారు. బీజేపీ కోసం అలా అంకితమైన కార్యకర్తలలో ఒకడే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్య కుమార్‌. నెల్లూరీయులకు సత్యగా సుపరిచితుడైన ఒకప్పటి యం.వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శి!

దాదాపు పాతికేళ్ల పాటు వెంకయ్యనాయుడు వ్యక్తిగత జీవితంలో తోడుగా, వెన్నుదన్నుగా ప్రయాణం సాగించిన సత్య, ఆయన ఉపరాష్ట్రపతి కాగానే ఆయన అనుమతితో తిరిగి బీజేపీ సేవకై వెళ్లారు. దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించాలనే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాల సంకల్పంలో భాగస్వామి అయ్యారు. అమిత్‌షా బృందంలో చేరి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ పురోభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీలోనూ సత్య పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి, పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు.

సత్య సేవలను మరింతగా వినియోగించుకునే క్రమంలో బీజేపీ అధిష్టానం ఆయనకు కీలకమైన బాధ్యతను అప్పగించింది. కీలకం అనేదానికంటే కూడా ఇది కఠినతరమైన బాధ్యత అనుకో వచ్చు. కేరళ రాష్ట్రం బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించింది.

కేరళలో ఎన్నికల బాధ్యతలు అంటే మాటలు కాదు. కరుడు గట్టిన కమ్యూనిష్టు ప్రభుత్వం ఉందక్కడ! బీజేపీ, ఆరెస్సెస్‌ కార్య కర్తలపై అత్యంత పాశవికంగా దాడులు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. బీజేపీ అక్కడ కనీసం ప్రతిపక్షంలో కూడా లేదు.

ఇటీవల ఆ రాష్ట్రంలో సంభవించిన కొన్ని పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్టానం సంకల్పించింది. ఇందుకు సమర్ధుడిగా సత్యను భావించింది. బీజేపీ సైన్యాన్ని నడిపే బాధ్యతను ఆయనకు అప్పగించింది. పార్టీ బలంగా వున్న రాష్ట్రాలలో కాదు, పార్టీ ఉనికే లేని చోట సత్తా చూపాలి. ఆ అవకాశం ఇప్పుడు సత్యకు వచ్చింది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here