Home జిల్లా వార్తలు కావలికి అటు ఇటు పోర్టులు

కావలికి అటు ఇటు పోర్టులు

ఎన్నికల స్టంటో లేక కావలి ప్రాంతా నికి సుడితిరగడమో ఏమోగాని ఆ ప్రాంత పరిధిలోకే రెండు పోర్టులు మంజూర య్యాయి. ఒకటి దగదర్తి ఎయిర్‌పోర్టు కాగా, రెండోది రామాయపట్నం సీ పోర్టు.

దగదర్తి ఎయిర్‌పోర్టు గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మంజూరైంది. భూ సేకరణ కూడా జరిగింది. ఈ ఎయిర్‌పోర్టు కాం ట్రాక్ట్‌ను నెల్లూరు పోర్టు అథారిటి అనే కంపెనీకి ఇచ్చారు. అయితే దీనికి ఇంకా శంకుస్థాపన జరగలేదు. ఇంకా పూర్తి కావాల్సిన లాంఛనాలు వున్నట్లుగా తెలు స్తోంది. కావలికి దక్షిణం వైపున ఎయిర్‌ పోర్టు వస్తుంటే ఉత్తరం వైపున రామాయపట్నం ఎయిర్‌పోర్టు మంజూ రైంది. రామాయపట్నం వద్ద పోర్టును నిర్మించాలని కావలి ప్రాంత నాయకులు ఉద్యమాలు చేయడం తెలిసిందే! అయితే ఇక్కడ పోర్టు నిర్మాణానికి కేంద్రం ముం దుకు రాలేదు. ఈ నేపథ్యంలో స్థానికంగా వున్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ పోర్టును ప్రకటించాడు. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇంత వరకు బాగానేవుంది. రాష్ట్ర ప్రభుత్వ నిధు లతో ఈ పోర్టు కడతారా? లేక ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కడతారా? కృష్ణ పట్నం పోర్టును నవయుగ కంపెనీవాళ్ళు వై.యస్‌. హయాంలో కట్టబట్టి సరిపో యింది. ఆయన కాలంలో పరిశ్రమలు పెద్దఎత్తున రావడం, ఎగుమతులు, దిగు మతులు వుండడం వల్ల కృష్ణపట్నం పోర్టు నడుస్తోంది. చంద్రబాబు వచ్చాక ఈ నాలుగున్నరేళ్ళలో కృష్ణపట్నం పోర్టులో ఒక్క బెర్త్‌ అదనంగా కట్టిందిలేదు. అలాంటి చంద్రబాబు హయాంలో రామాయపట్నం పోర్టు వస్తుందనుకోవడం వట్టి భ్రమే! కాకపోతే గతంలో ఇక్కడ పోర్టు వస్తుందని చెప్పి చాలామంది భూములు కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోర్టు ప్రకటనతో ఆ భూములు కొన్నవాళ్ళు బయటపడే అవ కాశాలున్నాయి. కావలి, కందుకూరు, కొండెపి నియోజకవర్గాలలో టీడీపీకి రాజ కీయంగా ప్రయోజనముంటుంది. దానికోస మైనా చంద్రబాబు త్వరలో అటు దగదర్తి ఎయిర్‌పోర్టుకు ఇటు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here