Home జాతీయ వార్తలు కాంగ్రెస్ సిగలో నెలవంక.. ప్రియాంక

కాంగ్రెస్ సిగలో నెలవంక.. ప్రియాంక

ఇరవైలో చేసుకోవాల్సిన పెళ్లి అరవైలో చేసుకుంటే ఎలా వుంటుంది. తుప్పు పట్టిన తుపాకీతో యుద్ధం చేస్తే ఏమవుతుంది. 27లో రాజకీయ రంగాన దూసుకెళ్లాల్సిన యువతి 47లో మహిళగా రాజకీయ తెరపైకి వస్తే ఎలా వుంటుంది?

ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ఇదే జరిగింది. 20ఏళ్ల క్రితం జాతీయ రాజకీయ తెరపైకి, ఇందిరాగాంధీ వారసురాలిగా తీసుకురావాల్సిన ఆమె మనుమరాలు ప్రియాంక గాంధీని 20ఏళ్ళు ఆలస్యంగా తెరపైకి తెచ్చారు. ఏఐసిసి ప్రధానకార్యదర్శి బాధ్యతలతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో జాతీయ రాజకీయాలలో కొంత కుదుపు మొదలైం దనే అనుకోవచ్చు. కాని, ఇంత ఆలస్యంగా ప్రియాంకను తెరమీదకు తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, ఆమె ఇమేజ్‌ను ఎంతవరకు సొమ్ము చేసుకోగలదన్నదే పెద్ద ప్రశ్న?

1992లో రాజీవ్‌గాంధీ మరణానం తరం దేశ వ్యాప్తంగా ప్రజల దృష్టి ఆయన కూతురు ప్రియాంక గాంధీపై పడింది. అచ్చు నానమ్మ ఇందిరాగాంధీ పోలికలతో వుండే ప్రియాంకను భావి కాంగ్రెస్‌ నేతగా, ఇందిరమ్మ వారసురాలిగా భావించారు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు. అయితే భర్తను కోల్పోయిన బాధలో కొన్నేళ్ళ పాటు సోనియాగాంధీ రాజకీయాలకు దూరంగా ఉండిపోయింది. 1996 నాటికి గాని ఆమె మళ్ళీ కాంగ్రెస్‌ పార్టీపై దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్‌ కేడర్‌ అంతా కూడా తమకు నేతగా ప్రియాంకగాంధీని కోరుకుంటున్న తరుణంలో సోనియా మాత్రం రాహుల్‌ గాంధీని తెరమీదకు తెచ్చింది. ప్రజల్లో ఎంతో ఆకర్షణ వున్న ప్రియాంకకు పెళ్లి చేసి ఆమెను భార్య క్యారెక్టర్‌కు పరిమితం చేసింది. 1998, 1999, 2004, 2009, 2014 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం తన తల్లి, సోదరుడు పోటీ చేసే రాయ్‌బరేలి, అమేది స్థానాలకే పరిమితమై వుండేది. తన బిడ్డ రాహుల్‌ను దేశ ప్రధానిగా చూడాలనేది సోనియా బలమైన కోరిక… 2004లో యూపిఏ అధికారంలోకి వచ్చినా కూడా మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిని చేయాల్సి వచ్చింది. 2009లో చూస్తే యూపిఏ మళ్ళీ గెలిచినా మన్మోహన్‌సింగ్‌నే ప్రధా నిగా కొనసాగించాల్సి వచ్చింది. మధ్యలో మన్మోహన్‌సింగ్‌ను తప్పించి రాహుల్‌ను ప్రధానిని చేయాలనుకున్నా, అప్పటికే బయటకొచ్చిన పలు కుంభకోణాలతో కేంద్ర ప్రభుత్వం పీకల్లోతు అవినీతి ఆరోపణలలో కూరుకుపోయింది. ఆ పరిస్థితుల్లో రాహుల్‌ను ప్రధానిని చేయడం మంచిది కాదని భావించిన సోనియా వెనుకడు గేసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. గత ఐదేళ్లలో రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ సాధిం చిన ఘనవిజయాలేమీ లేవు. అక్కడ్కడా కాంగ్రెస్‌ గెలిచినా, అవి స్థానిక ప్రభుత్వాల వ్యతిరేకత వల్ల తప్పితే రాహుల్‌ నాయ కత్వ సామర్ధ్యం వల్ల కాదు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ గెలవకపోతే రాహుల్‌ను ప్రధా నిగా చూడాలన్న సోనియా కోరిక నెరవేరక పోవచ్చు. అందుకే సోనియాగాంధీ అన్ని ప్రయోగాలకు సిద్ధమైంది. రాహుల్‌ ఒక్క డితో సాధ్యం కాదని, తమ పార్టీకి చివరి ఆకర్షణ అస్త్రంగా భావిస్తున్న ప్రియాంక గాంధీని బరిలోకి దించింది. మరి ప్రియాంక ఆకర్షణ 20ఏళ్ల క్రితం వున్నట్లు ఇప్పుడుందా? ఆమె సమ్మోహనాస్త్రం పని చేస్తుందా? మోడీ మానియా ముందు ఆమె గ్లామర్‌ నిలుస్తుందా? ఎందుకంటే ఆకర్ష ణల కంటే అభివృద్ధి మంత్రాన్ని ప్రజలు నమ్ముతున్నారు. మరి మోడీ జాతీయ భక్తి మంత్రం, దేశ అభివృద్ధి అనే రణతంత్రం ముందు ఆమె ఆకర్షణ ఎంతవరకు నిల బడుతుందో చూద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here