Home గల్పిక కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా కె.ఏ.పాల్‌

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా కె.ఏ.పాల్‌

ఏప్రిల్‌ 11వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట.. పాతిక ప్రపంచ మేటి నగరాలను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి బయటకు తీస్తే వచ్చిన అమరావతి నగరం. కరకట్ట మీద హైటెక్‌రత్న, సీఎం చంద్రబాబు నివాసం. ఆరోజే పోలింగ్‌ ముగిసింది. ఆరోజు వరకు ఎలక్షన్‌ టెన్షన్‌లో అలసి సొలసిన నాయకులంతా తమ బెడ్‌రూముల్లో కాళ్లెత్తి పడుకున్నారు. చంద్రబాబు కూడా ఆరోజు పది గంటలకే బెడ్‌ మీదకు చేరి గురకపెట్టి నిద్రపోయాడు. కాని, ఒంటి గంట సమయంలో నెల్లూరు నుండి వచ్చిన ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలు కరుస్తున్నట్లనిపించ డంతో భువనేశ్వరీదేవికి టక్కున మెలకువ వచ్చింది. లేచి కూర్చుని పక్కకు చూసింది. అంతే… ఆమె షాక్‌… పక్కన చంద్రబాబు నాయుడు లేడు. ఈ టైంలో ఈ మనిషి ఎక్కడకు పోయాడనే ఆందోళన ఆమెలో మొదలైంది. వెంటనే లోకేష్‌ బెడ్‌రూమ్‌ వద్దకు వెళ్ళింది. లోకేష్‌… లోకేష్‌ అంటూ కేకేసింది. లోపల నుండి మాత్రం… ఏప్రిల్‌ 9వ తేదీ పోలింగ్‌… మార్చి 23 కౌంటింగ్‌… నన్ను 5లక్షల మెజార్టీతో గెలిపించండి… అనే మాటలు వినిపి స్తున్నాయి. భువనేశ్వరీదేవి లోపలకు వెళ్లింది. లోకేష్‌ నిద్రలో కలవరిస్తున్నాడు. భువనేశ్వరీ అక్కడే వున్న వాటర్‌బాటిల్‌ చేతిలోకి తీసుకుని లోకేష్‌ ముఖంపై

నీళ్ళు చల్లింది. ఆ దెబ్బకు లోకేష్‌ టక్కున లేచాడు. ఏమైందమ్మా… ఎన్నికల ప్రచా రంలో వుంటే డిస్ట్రబ్‌ చేసావని అడిగాడు. ఎన్నికల ప్రచారమా, నీ మొహమా, నిద్రలో కూడా సరిగా మాట్లాడలేవా, అవతల మీ నాన్న కనిపించడం లేదు. ఎక్కడకు వెళ్లాడో చూద్దాం పద అంటూ భువనేశ్వరీదేవి కోపంగా అంది. అందుకు లోకేష్‌… ఈ నాన్నారు ఒకడు… తను నిద్రపోడు, పక్కనోళ్లను నిద్రపోనివ్వడు… పద వెదుకుదాం అంటూ భారంగా లేచాడు. ఆయనతో పాటు బ్రాహ్మణి కూడా బయలుదేరింది. ముగ్గురూ కారెక్కి ఆ చుట్టుపక్కల వెదకసాగారు. అలా వెదుకుతుండగా… ”తమ్ముళ్ళూ నేను మోడీకి భయపడతానా” అనే మాటలు వినిపించాయి. లోకేష్‌ ఆ మాటలు వినిపిస్తున్న వైపుగా కారును పోనిచ్చాడు. వెలగపూడి సచివాలయం వద్ద రోడ్డుపై చంద్రబాబు ప్రచార వాహనం వుంది. క్రింద నైట్‌ సెక్యూరిటీ సిబ్బంది ఓ పాతిక మంది దాకా వున్నారు. చంద్రబాబు చెవుల్లో మైక్‌ సిస్టం పెట్టుకుని వున్నాడు. ఆయన వారినుద్దేశించి మాట్లాడుతూ… తమ్ముళ్ళూ మోడీ, కేసీఆర్‌, జగన్‌లు ఒక్కటయ్యారు. ఇక్కడ జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే… మన రాష్ట్రంపై పెత్తనం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నాడు. వీళ్ళ ఆటలు నా దగ్గర సాగవు. నేను ఇందిరాగాంధీతో పోరాడాను, జార్జి బుష్‌తో పోరాడాను, జనరల్‌ డయ్యర్‌తో పోరాడాను, రాజీవ్‌గాంధీతో పోరా డాను… అలాంటి పోరాటాల చరిత్ర వున్న నేను ఈరోజు కోడికత్తి పార్టీతో పోరాడుతున్నాను. తమ్ముళ్ళూ జగన్‌ గెలిస్తే రౌడీరాజ్యం వస్తుంది. ఒక్కసారి అవకాశమివ్వమంటున్నాడని మీరు మోసపోవద్దు. ఒక్కసారి కదా అని కరెంట్‌ తీగలు పట్టుకుంటామా… కాబట్టి మీరంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి బంపర్‌ మెజార్టీతో గెలిపించాలి… అని చెప్పుకుంటూ పోతున్నాడు. భువనేశ్వరీ దేవికి పరిస్థితి అర్ధమైపోయింది. నెల రోజులుగా తిరిగి తిరిగి ప్రచార యావకు అలవాటుపడ్డాడని, నిద్రలోనూ ఆ పిచ్చి పోలేదని గ్రహించింది. ఈలోపు లోకేష్‌ ప్రచార వాహనంపైకి ఎక్కాడు. ఆయన చేతిలోని మైకును లాగేసి, క్రిందకు తీసుకొచ్చాడు. ఏమిటండీ ఇది… ఎన్ని కలు అయిపోయాయి కదా… ఈ రోజన్నా ప్రశాంతంగా పడుకోకుండా ఏమిటి ఈ హింస అని భువనేశ్వరి అడిగింది. చంద్రబాబు అప్పటికి ఈ లోకంలోకి వచ్చి… ఏం చేయమంటావ్‌ భువ… నాకు ఇలా రోజుకు రెండు ప్రచార సభల్లోనన్నా మాట్లాడనిదే నిద్రపట్టడం లేదు. నా బాడీ ఆ విధంగా అలవాటై పోయింది అని చెప్పాడు. దానికి భువ నేశ్వరి… ఇంకా మీరు మీటింగ్‌లు పెట్టడానికి రాష్ట్రంలో ఎన్నికలు లేవుగా అని అంది. అప్పుడు లోకేష్‌… ఏపిలో ఎన్నికలు అయిపోతేనేం మమ్మీ… ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ అంకుల్‌, పశ్చిమ బెంగాల్‌లో మమతా ఆంటీ, జమ్మూ కాశ్మీర్‌లో ఫరూక్‌ తాతయ్య, కర్నాటకలో దేవేగౌడ పెద్దయ్య తరపున నాన్నను ప్రచారానికి పంపిద్దాము… అలాగన్నా ఆయన ప్రశాంతంగా వుంటాడు అని ఐడియా ఇచ్చాడు. భువనేశ్వరీదేవి అందుకు సరేనంది. వెంటనే లోకేష్‌ ఫోన్‌ తీసి… అరవింద్‌ కేజ్రీవాల్‌కు కొట్టాడు. ఆయన అవతల ఫోన్‌ ఎత్తగానే లోకేష్‌ వుండి… హలో అంకుల్‌… మీరు మా పార్టీ తరపున ఆంధ్రాలో ప్రచారం చేశారు కదా.. అలాగే నాన్నగారు కూడా ఢిల్లీలో మీ తరపున ప్రచారానికి వస్తా రట… ఎప్పుడు రమ్మంటారు అని అడి గాడు. దానికి అరవింద్‌ కేజ్రీవాల్‌… నాకున్నదే ఏడు లోక్‌సభ నియోజక వర్గాలు… నాకే ఇక్కడ పని లేకుండా ఖాళీగావున్నాను, మళ్ళీ మీ నాన్నెం దుకు… రెస్ట్‌ తీసుకోమని చెప్పులే అని ఫోన్‌ పెట్టేశాడు. లోకేష్‌ మళ్ళీ మమతా బెనర్జీకి ఫోన్‌ చేశాడు. ఆమె ఫోన్‌ ఎత్త గానే.. ఆంటీ ఎలక్షన్‌ అయిపోయి నాన్న గారు ఫ్రీగా వున్నారు. మీకు ప్రచారానికి పంపమంటారా అని అడిగాడు. అందుకు మమత… నాకు ఇక్కడ అంత అవసరం లేదు. మా ప్రజలకు కొంత ఎంటర్‌టైన్‌ మెంట్‌ అవసరం, వీలైతే నువ్వు రా అని అంది. లోకేష్‌ ఫోన్‌ పెట్టేసి… నాన్న గారు… పబ్లిక్‌లో మీకంటే నాకే ఎక్కువ క్రేజ్‌ వుంది. మమతా ఆంటీ నన్ను ప్రచారానికి పిలుస్తుంది అని చెప్పాడు. ఏడ్చావుగాని… ఆ రాహుల్‌గాంధీకన్నా ఫోన్‌చెయ్‌… ఆయన ప్రచారం చేయ మంటే మే 18వ తేదీ దాకా ఖాళీ లేకుండా తిరగొచ్చు అని చంద్రబాబు చెప్పాడు. వెంటనే లోకేష్‌ రాహుల్‌ గాంధీకి ఫోన్‌ చేశాడు. ఆయన ఫోన్‌ ఎత్తగానే లోకేష్‌ వుండి… అన్నగారు, ఏపిలో ఎన్నికలైపోయి నాన్నగారు ఖాళీగా వున్నారు, ఆయనకు ప్రతిరోజూ ఎన్నికల సభలలో పాల్గొనకపోయినా, నరేంద్ర మోడీ, కేసీఆర్‌లను తిట్టకపోయినా నిద్ర పట్టడం లేదంట… కాంగ్రెస్‌పార్టీకి మద్ద తుగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తా నంటున్నారు. ఎప్పుడు రమ్మంటారని అడిగాడు. అందుకు రాహుల్‌… ఇప్పుడు మా ప్రచారానికి చంద్రబాబు గారి అవసరం లేదు. మా స్టార్‌ క్యాంపెయి నర్‌గా కె.ఏ.పాల్‌ను పెట్టుకున్నాం. ఆయన ప్రసంగాలను జనం భలే వింటు న్నారు. రావాలనుకుంటే పాల్‌కు సహా యకుడిగా నువ్వురా… నీకూ సొంత ఇమేజ్‌ వచ్చింది అని రాహుల్‌ చెప్పాడు. ఆ మాటతో లోకేష్‌ ఫోన్‌ పెట్టేసి… నాన్నా… మీకంటే ఆ కె.ఏ.పాల్‌కే ఈ ఎలక్షన్‌తో ఎక్కువ క్రేజ్‌ వచ్చింది. ఇక నా పోటీ జగన్‌తో కేటీఆర్‌తో కాదు… కె.ఏ.పాల్‌తోనే… అంటూ తన బెడ్‌రూం లోకి వెళ్లిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here