Home గల్పిక కాంగ్రెస్‌తో పొత్తు లేదన్న లోకేష్‌

కాంగ్రెస్‌తో పొత్తు లేదన్న లోకేష్‌

జరిగిన కథ: దేవేంద్ర లోకం రాజధాని అమరావతిలో నందమూరి హరికృష్ణకు వెల్‌కం ఫంక్షన్‌ని ఏర్పాటు చేస్తారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఎస్వీ రంగారావు, ఆనం వివేకా తదితరులు ఆటపాటలతో అలరిస్తారు. తర్వాత ఎన్టీఆర్‌ తన కొడుకు హరికృష్ణను ఆప్యా యంగా కౌగిలించుకుని ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన మన తెలుగుదేశంపార్టీ ఎలా వుందని అడుగు తాడు. తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగు తుందో తన నోటితో చెప్పలేని హరికృష్ణ, అక్కడ జరిగేదేదో మీరే లైవ్‌లో చూపిం చండని నారదుడిని వేడుకుంటాడు. నారదుడు ఒక స్క్రీన్‌ ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంట్లో చోటుచేసుకున్న సన్నివేశాలను చూపి స్తాడు. చంద్రబాబు ఇంట్లోకి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు వెళ్లడం, చంద్ర బాబు వారితో పొత్తు గురించి మాట్లాడి సీట్లు సర్దుబాటు చేసుకోవడం చూసి ఎన్టీఆర్‌ ఆవేశంతో వూగిపోయి స్పృహ తప్పి పడిపోతాడు.

ఆ తర్వాత…

ఎన్టీఆర్‌ నెమ్మదిగా కళ్లు తెరిచాడు. స్వర్గలోకంలోని ‘ఆరోగ్యరక్ష’ ఆసుపత్రి లోని ఒక బెడ్‌మీద వున్నాడాయన! దేవకన్యలు సెలైన్‌లు ఎక్కిస్తున్నారు. ఎదురుగా హరికృష్ణ, వివేకా, నారద మహర్షి వున్నారు. అంతకుముందు స్క్రీన్‌పై చూసిన సన్నివేశాలు ఆయనకు అప్పుడప్పుడే మళ్ళీ గుర్తుకురాసాగాయి. అంతలో అక్కడ హడావిడి మొదలైంది. ఏంటా అని అందరూ అటువైపు చూసారు. దేవేంద్రుడితో పాటు యమ ధర్మరాజు, శివుడు, విష్ణుమూర్తులు ఎన్టీఆర్‌ను పరామర్శించడానికి వచ్చారు. ఇప్పుడెలా వుందని ఎన్టీఆర్‌ను వారు అడిగారు. నాకు బాగానేవుంది. ఈ అల్పుడిని చూడడానికి మీరు మీ లోకాల నుండి వచ్చారా అని ఎన్టీఆర్‌ ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు శివుడు… మేం ఎలా వుంటామో భూలోకవాసులకు తెలి యదు. కాని ఇలా వుంటామని వాళ్ళకు తెలియపరిచింది నీవే… అందుకే నువ్వంటే మాకు అభిమానం అని చెప్పాడు. విష్ణుమూర్తి వుండి… సడెన్‌గా ఎందుకు స్పృహ తప్పి పడిపోయారు అని అడిగాడు. ఎన్టీఆర్‌ దానికి తెలుగుదేశం – కాంగ్రెస్‌ పొత్తు ఎపిసోడ్‌ను కూలం కుషంగా వివరించి… అది నేను పెట్టిన పార్టీ సిద్ధాంతానికే విరుద్ధం. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే నా ఆత్మ క్షోభిస్తూనే వుంటుంది అని చెప్పాడు. దీనికి తరుణోపాయం ఏమిటని దేవేంద్రుడు అడిగాడు. తరుణోపాయం అనగానే అక్కడే వున్న వివేకా బుర్రలో ‘యముడికి మొగుడు’ సినిమా గుర్తుకొచ్చింది. దానినే ఆయన వారితో వివరించి ఎన్టీఆర్‌ ఆత్మను భూలోకంలో ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశపెడితే ఆయనే మార్పు తీసుకొస్తాడు అని సలహా ఇచ్చాడు. వెంటనే శివుడు, విష్ణు, దేవేంద్ర, యముడులు గ్రౌండ్‌లో క్రికెట్‌ ప్లేయర్స్‌ మాదిరిగా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని రౌండప్‌ అయ్యి ఒక్క నిముషం మాట్లాడుకున్నారు. తర్వాత విష్ణుమూర్తి వచ్చి… ఎన్టీఆర్‌ గారు మీకు ఒక్క ఛాన్స్‌ ఇస్తున్నాను, మీ ఇష్టం వచ్చిన వారిలో ప్రవేశించండి అని చెప్పాడు. నా మనువడిలో ప్రవేశిస్తాను అని ఎన్టీఆర్‌ కోరాడు. ఆయన మనసులో జూనియర్‌ ఎన్టీఆర్‌ వున్నాడు. కాని విష్ణుమూర్తికేమో మనువడు అంటే నారా లోకేష్‌ మైండ్‌లో వున్నాడు. విష్ణుమూర్తి తన మైండ్‌సెట్‌ ప్రకారం తధాస్తు అని దీవించాడు.

—–

ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యా లయం. తెల్లారుజామున 4గంటల సమయం. లోకేష్‌ నిద్రలేచాడు. ఎక్సర్‌ సైజులు చేసాడు. కొంతసేపు యోగా, ధ్యానం… ఐదు గంటల సమయంలో నిద్రలేచి లోకేష్‌ను చూసిన చంద్రబాబు, భువనేశ్వరి, బ్రాహ్మణిలు ఆశ్చర్య పోయారు. ఏడైనా లేవనివాడు, ఈరోజేం టబ్బా ఇలా వున్నాడనుకున్నారు. అయినా మంచిదేలే అని ఎవరిపాటికి వాళ్ళు వూరుకున్నారు. ఎక్సర్‌సైజులయ్యాక లోకేష్‌ ఒక లీటర్‌ తిరుమల డెయిరీ పాలు తాగాడు. అటు తర్వాత ఆరోజు వచ్చిన ఆస్థాన పత్రికలను చేతికందుకున్నాడు. ‘బాబ్లీ కేసులో చంద్రబాబుకు అరెస్ట్‌ వారెంట్‌’ అనే హెడ్డింగ్‌తో పెద్ద వార్త. అది చూసి లోకేష్‌ ఆవేశపడిపోయాడు. వెంటనే పి.ఏను పిలిచి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చెయ్యమని ఆదేశించాడు. అదంతా గమనిస్తున్న చంద్రబాబు భువనేశ్వరితో.. చూసావా మన వాడి ఆవేశం… నాకు కోర్టు నుండి అరెస్ట్‌ వారెంట్‌ వచ్చిందనగానే ఎలా రియాక్ట్‌ అయ్యాడో. వీడిలో ఇంత రియాక్షన్‌ వస్తుందని తెలిస్తే నెలకొకటి చొప్పున నేనే అరెస్ట్‌ వారెంట్లు తెప్పించుకునేవాడిని కదా అని మురిసిపోసాగాడు. పది నిము షాలలోనే మీడియా ప్రతినిధులందరూ వచ్చారు. లోకేష్‌ ప్రెస్‌మీట్‌ స్టార్ట్‌ చేసాడు. మీరు పత్రికలు నడుపుతున్నారా, కర పత్రాలు వేసుకుని బ్రతుకుతున్నారా? ”బాబ్లీ కేసులో చంద్రబాబుకు అరెస్ట్‌ వారెంట్‌’ ఇదొక వార్త… దీనికొక హెడ్డింగ్‌. ఇంత బిల్డప్పు… ఆయనేమన్నా బ్రిటీష్‌ తెల్లదొరలకు తన గుండెను చూపిం చిన టంగుటూరు ప్రకాశం పంతులు అనుకుంటున్నారా? పాతికసార్లు కోర్టు వాయిదాలకు హాజరుకాకపోతే అరెస్ట్‌ వారెంట్‌ పంపక మా ఇంట్లో పెళ్లికి రమ్మని జడ్జిలు ఆహ్వానపత్రిక పంపి స్తారా? ఇప్పటికైనా ఈ చెత్త రాతలు మానండి అని ఆవేశంగా హెచ్చరించాడు. లోకేష్‌ మాటలతో వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ దిమ్మ తిరిగింది. అంతా వింటున్న చంద్రబాబు అయితే అక్కడే కళ్లు తిరిగి కిందపడిపోబోయి తమాయించుకుని నిలబడ్డాడు. లోకేష్‌ షాక్‌ నుండి కోలుకున్న విలేకరులు… మీ పార్టీలో ఎమ్మెల్యేలపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, వాటికి మీ సమాధానం అని అడిగారు. లోకేష్‌ ఆవేశంగా… అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కడినీ వదలను బ్రదర్‌… ఆరోపణలు వచ్చిన అందరు ఎమ్మెల్యేల మీద సిబిఐ దర్యాప్తు చేయిస్తా! అమరావతి రాజధాని నిర్మాణంలో అన్నీ అక్రమాలే… వాటి మీదా ఎంక్వయిరీ వేయిస్తాం.. 16వేల కోట్లతో చేయాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ను 58వేల కోట్లకు పెంచారు. దాని అంతు కూడా ఏదో తేలుస్తా… తహశీల్దార్‌ వనజాక్షిని ఇసుకలో ఈడ్చి కొట్టిన చింతమనేని ప్రభాకర్‌నే కాదు అధికా రులు, ప్రజలపై దాడులు చేసిన ఏ ఒక్కరినీ వదలను… రాష్ట్రంలో ప్రైవేట్‌ విద్యను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తా అని చెప్పుకుంటూ పోతున్నాడు. అంతలో టీవీ 10.5 విలేకరి వితండం కలుగజేసుకుని… సార్‌, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు వుంటుందా అని అడిగాడు. అప్పుడు లోకేష్‌ ఆవేశంగా కుర్చీలో నుండి లేచి… దానవీరశూర కర్ణలో ఎన్టీఆర్‌ తరహాలో… ”ఏమంటివి ఏమంటివి ఆ విదేశీయులు స్థాపించిన కాంగ్రెస్‌తో తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక అయిన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడమా… ఒక ఇటలీ వనితతో మేము కలిసి ప్రచారం చేయడమా… ఢిల్లీ వాసులకు మేం దాసోహం అనడమా… ఇది జరగదు.. జరగనేరాదు.. మా కంఠంలో ప్రాణం వున్నంతవరకు ఆకాశం, భూమి ఏకం కావచ్చునేమోగాని తెలుగుదేశం, కాంగ్రెస్‌లు కలవవు అని చెప్పాడు. ఆ సమయంలో చంద్రబాబుకు లోకేష్‌ భక్తప్రహ్లాదుడి మాదిరిగా కని పించాడు. వీడు నా కొంప ముంచడానికే పుట్టినట్లున్నాడని ఆయన అయోమ యంతో చూడసాగాడు. ఈలోగా ఛానెల్స్‌ అన్నింటిలో లోకేష్‌ స్టేట్‌మెంట్స్‌ రాసా గాయి. ఆ స్టేట్‌మెంట్లతో రాష్ట్ర రాజ కీయాలలో గందరగోళం రేగింది. అప్పుడే ఎన్టీఆర్‌ ఆత్మ లోకేష్‌ను వీడింది. లోకేష్‌ మామూలు స్థితిలోకి వచ్చాడు. ఎదురుగా వున్న టీవీలో బ్రేకింగ్‌ న్యూస్‌ చూసాడు. తన పేరు మీద వస్తున్న ప్రకటనలు చూసి… అయ్యో! నాన్నారు అవన్నీ నేను చెప్పినట్లుగా వస్తున్నాయి, అసలు నేనెప్పుడు మాట్లాడాను అని అన్నాడు. దానికి చంద్రబాబు… చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఈ నాట కాలేందిరా… మీ తాత ఎన్టీఆర్‌ను నేను వెన్నుపోటు పొడిచానని అది నువ్వు మనసులో పెట్టుకుని నాకు వెన్నుపోటు పొడిచావు కదా అని అడిగాడు. అమ్మ తోడు నాన్నారు అదేమీ లేదు అని లోకేష్‌ బ్రతిమలాడుకోసాగాడు.

—–

ఎన్టీఆర్‌, ఇంద్రుడు, యముడులతో స్వర్గలోకానికి పోతుండగా ఎన్టీఆర్‌ వారితో… విష్ణుమూర్తి నన్ను జూనియర్‌ ఎన్టీఆర్‌లో కాకుండా లోకేష్‌లోకి పం పించి మేలే చేసాడు. ఇన్ని మాటలన్నా కూడా నా అల్లుడు లోకేష్‌ను ఏమీ చేయ లేడుగా? అదే జూనియర్‌ను అయితే తొక్కేసుండేవాడు. ఏదేమైనా నాకు నా కొడుకులతోనే వెన్నుపోటు పొడిపిం చాడు… ఇప్పుడు అతని కొడుకుతోనే అతనిని ఏడిపించాను… చెల్లుకు చెల్లు అని ఎన్టీఆర్‌ ఆనందంగా చెప్పాడు.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here