Home జిల్లా వార్తలు కస్తూరిదేవి విద్యాలయం వివాదం! దొంగలెవరు.. దొరలెవరు…?

కస్తూరిదేవి విద్యాలయం వివాదం! దొంగలెవరు.. దొరలెవరు…?

గత నెల రోజుల నుండీ నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి విద్యాలయ సంస్థని మళ్ళీ వివాదాల్లోకి లాగారు. ఈ సంస్థ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేయాలని ఎవరు వచ్చినా వాళ్ళను రోత పుట్టించే రాతలతో రచ్చకీడుస్తోంది జిల్లాలోని ఓ పాత పేపరు.

అసలు కస్తూరిదేవి చరిత్ర ఏమిటి? ఈ సంస్థ తొలినాళ్ళలో అంటే 1925లో కస్తూరిదేవి జాతీయ బాలికా పాఠశాల అని ప్రారంభించ బడి తరువాత కాలంలో కస్తూరిదేవి విద్యాల యంగా ఎలా రూపాంతరం చెందింది? 2 యకరాలలో వున్న సంస్థని 22యకరాలలోకి మార్చడానికి కారణభూతులెవరు? అసలు ఈ సంస్థ అభివృద్ధి కోసం ఆది నుండి నిరంతరం పాటుపడింది ఎవరు…?

1981లో ఈ సంస్థకు సంబంధించిన 3యకరాల స్థలాన్ని అప్పటి కమిటి సభ్యు లుగా వున్న కొందరు ఘరానా దొంగలు లీజు పేరుతో దోచుకోవాలని ప్రయత్నం చేసిన ప్పుడు వారిని అడ్డుకుంది ఎవరు? ఆ ఘరానా దొంగలకి అండగా నిలిచిన గజదొంగ ఎవరు?

1995 నుండి ఈరోజు వరకు ఈ సంస్థను, సంస్థ ఆస్తులను కాపలాకాసి కాపాడిందెవరు? 2001లో దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసి మల్లెతోటల పేరుతో పరుల ఆధీనంలో వున్న 5యకరాల స్థలాన్ని అక్రమార్కుల కబ్జా నుండి కాపాడింది ఎవరు..? 2007 తరువాత ఈ సంస్థల స్థలా లను బెంగుళూరుకు చెందిన ఓ బడా బిల్డర్‌కు జాయింట్‌ డెవలప్‌మెంటు కిస్తాం, లేదా ఆస్తులను అమ్మేసి ఊరు బయట మరో వంద యకరాలు కొందాం అని ప్రతి పాదిం చింది ఎవరు..?

1981 నుండి ఈనాటి వరకు ఈ సంస్థ అభివృద్ధి కోసం నిస్వార్ధంతో పోరాడుతున్న దెవరు? వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే సంస్థ ఆస్థులని అన్యాక్రాంతం కాకూడ దనే సంకల్పంతో, సంస్థ ఎప్పుడో వ్రాసుకున్న నియమనిబంధనలని తిరిగి వ్రాసుకుని భవి ష్యత్‌లో ఈ సంస్థలో ఎలాంటి లీజులాంటి గలీజు వ్యవహారాలుగాని లేదా విక్రయాల లాంటి అక్రమ కార్యకలాపాలు గాని జరగ కూడదని నిబద్ధతతో సంస్థ అభివృద్ధికి పాటు పడాలని వచ్చిన కొత్త కమిటీని భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నదెవరు…?

ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సమాధానం లేనివిగా మిగిలిపోయి వున్నాయి. వీటన్నింటికీ సమాధానాలతో పాటు కస్తూరిదేవి పుట్టు పూర్వోత్తరాలతో సహా సంస్థ చరిత్రని పాఠకుల కోసం సిద్ధం చేసింది ‘లాయర్‌’. వచ్చేవారం నుండి వారం వారం మా పాఠకుల ముంగి ళ్ళలో వాస్తవాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. గత నెల రోజులుగా ఈ సంస్థలపై జరుగుతున్న విషప్రచారాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ‘లాయర్‌’ని వాట్సాప్‌ల ద్వారా ఈ-మెయిళ్ళ ద్వారా, ఫోన్‌ ద్వారానే కాకుండా నేరుగా సైతం ప్రశ్నించిన, ప్రశ్ని స్తున్న కస్తూరిదేవి అభిమానులు, పూర్వవిద్యా ర్థినుల అభీష్టంపై పూర్తి వివరాలను, అసలు నిజాలను వచ్చేవారం నుండి అందించబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here