Home జిల్లా వార్తలు కస్తూరిదేవిలో అభివృద్ధి మొదలైంది

కస్తూరిదేవిలో అభివృద్ధి మొదలైంది

బాలికల విద్య కోసం 90ఏళ్ళ క్రితం ఏర్పడ్డ చారిత్రాత్మక విద్యాసంస్థ శ్రీ కస్తూరిదేవి విద్యా లయాన్ని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసి నెల్లూరు మహిళా లోకానికి కానుకగా అందిం చాలనే సంకల్పంతో జివికె రెడ్డి సారధ్యంలోని నూతన కమిటి సన్నాహాలు ప్రారంభించింది.

ఇప్పటికే తరగతులు నిర్వహిస్తున్న పురాతన భవనాలకు దాదాపు 50లక్షల నుండి కోటి రూపా యలతో మరమ్మతులు చేపట్టారు. ఇక్కడ బాలికల కోసం అధునాతన టాయిలెట్లు, మంచినీటి వసతి కల్పించడంతో పాటు తరగతి గదులన్నీ ఆధునీక రిస్తున్నారు. బీటలు వారిపోయిన భవనాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి విద్యాలయ ప్రాంగణానికి కొత్త కళను తేనున్నారు. పూర్తిగా శిధిలావస్థకు చేరిన తలుపులు, కిటికీలను తీసేసి కొత్తవాటిని ఏర్పాటు చేయడంతో పాటు అన్ని తరగతి గదులను అధునాతన టైల్స్‌తో ఫ్లోరింగ్‌ను రూపుదిద్దుతున్నారు.

కస్తూరిదేవి ప్రాంగణాన్ని ఎవరో కబ్జా చేసేస్తు న్నారంటూ వచ్చిన అబద్ధపు పుకార్లను, స్వార్ధపూరిత వార్తలను పటాపంచలు చేస్తూ అభివృద్ధి అంటే ఏమిటో, పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగితే ఎలా వుం టుందో… చూపించే పనికి జివికె రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక్కడ బాలికల హైస్కూల్‌కు అనుసం ధానంగా ఒక మహిళా జూనియర్‌ కాలేజీని, అలాగే ఎల్‌కెజి నుండి 5వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అతి సామాన్యుడికి అందించే విధంగా ప్రైమరీ స్కూల్‌ను నెలకొల్పే ఆలోచనలో కమిటి ప్రయత్నాలు సాగిస్తోంది. రానున్న రోజుల్లో కస్తూరిదేవి విద్యాలయం జిల్లా విద్యారంగా నికే తలమానికంగా నిలిచేలా ఈ విద్యాలయాన్ని అభివృద్ధిచేసి నెల్లూరుజిల్లా మహిళా రంగానికి అంకితం చేసే ఆలోచనతో జివికె రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అభివృద్ధిలో భాగంగా ముందుగా పాత భవనాల మరమ్మతులను చేపట్టి, శరవేగంగా పూర్తిచేస్తున్నారు. నిరాధార నిందలు వేస్తూ, నేడు విమర్శిస్తున్నవాళ్ళే రేపు విస్మయం చెందేలా శ్రీ కస్తూరిదేవి విద్యాలయ సంస్థలను అభివృద్ధి చేసే పనికి కమిటి సమాయత్తమైంది.

సిబ్బంది ఆనందం…

ఇన్నాళ్ళకు తమ సంస్థలకు మంచిరోజులు వచ్చా యని అటు బిజిఆర్‌ ఉమెన్స్‌ అకాడమీ మరియు కస్తూరిదేవి బాలికా పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20మంది టీచర్లు

ఉండాల్సిన స్కూల్లో, గత 15ఏళ్ళకు పైగా కేవలం 5మంది ఎయిడెడ్‌ టీచర్లు మాత్రమే పని చేస్తున్నారని, మిగతా సిబ్బందిని కమిటి దాతల సహాయంతో నియమించుకుని ఇప్పటివరకు జీతాలు చెల్లిస్తూ వచ్చిందని, వీలైనంత త్వరలో మిగిలిన ఖాళీలను భర్తీచేసి సంస్థ పురోగతికి దోహద పడాలని సిబ్బంది కోరుతున్నారు. పెద్ద మనసుతో కోట్లాదిరూపాయలు వెచ్చించి తమ సంస్థలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన జి.వి.కె.రెడ్డి, దొడ్ల శేషారెడ్డి, జె.వి.రెడ్డి, మాగుంట పార్వతమ్మ తదితర కమిటీ సభ్యులను అభినందిస్తూ… తమ పూర్తి సహాయ సహకారాలను వారికి అందిస్తామని సిబ్బంది తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here