Home గల్పిక కలియుగ కృష్ణుడు చంద్రుడే..!

కలియుగ కృష్ణుడు చంద్రుడే..!

డిసెంబర్‌ 31వ తేదీ.. 2018 రాత్రి సమయం… ఐఆర్‌20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురు దోమలకు ప్రసిద్ధి గాంచిన నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో బార్‌ అండ్‌ రెస్టా రెంట్‌… 2018కి మందు, విందుతో వీడ్కోలు పలుకుదామని చెప్పి హైటెక్‌ విక్రమార్కుడు, భేతాళుడు బార్‌లో కూర్చుని మందు కొడుతున్నారు. అలా ఇద్దరూ కలిసి ఫుల్‌ తాగాక అప్పుడే అర్థరాత్రి 12గంటలైంది. బార్‌లో వున్నోళ్ళు ఒక్కసారిగా ‘విష్‌యు హ్యాపీ న్యూఇయర్‌’ అంటూ కేరింతలు కొడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకో సాగారు. విక్రమార్కుడు, భేతాళుడు కూడా వారితో కలిసిపోయి చిందులు వేశారు. అలా చిందులు వేస్తున్నప్పుడే మత్తు ఎక్కువై భేతాళుడు పడిపోయాడు. అప్పుడు విక్రమార్కుడు భేతాళుడి బాడీని భుజాన వేసుకుని అతని నివాసమైన శ్మశానంలో వదిలిపెడదామని చెప్పి బోడిగాడితోటలోని రోటరీ క్లబ్‌ శ్మశాన వాటిక వైపు నడవసాగాడు. అయితే అలా నడుస్తుండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది… ఆ వర్షంలో తడవడంతో భేతాళుడికి మత్తు దిగిపోయింది. స్పృహ లోకి వచ్చిన భేతాళుడు… రాజా ఎము కలు కొరికే ఇంత చలిలో కూడా నీ స్నేహితుడిని భుజాన మోస్తున్న నీ కష్టం చూస్తుంటే నాకు జాలేస్తుంది. మోసింది చాలు… నన్ను కిందకు దించి… అలా డిఆర్‌ హోటల్‌లో రూమ్‌ తీసుకుందాం… 2018లో జరిగిన కొన్ని అద్భుతాలు చూపిస్తాను. ఎంజాయ్‌ చేద్దువు పద అంటూ డిఆర్‌ వైపు నడిపించాడు. ఇద్దరూ గదిలోకి వెళ్లాక భేతాళుడు ల్యాప్‌ టాప్‌ ఓపెన్‌ చేశాడు. ‘వండర్స్‌-2018’ ఫైల్‌ను ఓపెన్‌ చేశాడు. స్క్రీన్‌పై ఒక్కో నాయకుడి స్కిట్‌లు రాసాగాయి.

ప్రధాని నరేంద్ర మోడీ స్కిట్‌…

పార్లమెంటు హాల్‌లో ఆయన రైతుల పరిస్థితులపై మాట్లాడుతూ, రెండు నిముషాలు మౌనంగా వుండిపోయాడు. తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ తర్వాత కన్నీళ్ళు తుడుచుకున్నాడు. నా అంతిమ శ్వాస వరకు ఈ దేశం కోసమే పనిచేస్తానని చెప్పి కూర్చున్నాడు.

రాహుల్‌గాంధీ స్కిట్‌…

లోక్‌సభలో సీన్‌… రాఫెల్‌ పెద్ద కుంభకోణం… లక్షకోట్ల రూపాయల అవినీతి జరిగింది. నేను అవినీతి ఆరో పణలు చేస్తే వాళ్ళు నన్ను పప్పు అంటు న్నారు… నేను పప్పునో… నిప్పునో రేపు ప్రజలు తేలుస్తారు అంటూ తన సీటు నుండి వెళ్ళి నేరుగా మోడీని కౌగిలించు కున్నాడు. తర్వాత తన సీట్లోకి వచ్చి కూర్చుని తన సభ్యుల వైపు చూసి కన్నుకొట్టాడు.

కేసీఆర్‌ స్కిట్‌…

తెలంగాణ ఫలితాల అనంతరం హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను నిర్మించాం… అందుకే ప్రజలు మమ్మల్ని మళ్ళీ గెలిపిరచారు. మరో ఐదేళ్ళు ఇలాగే కష్టపడతాం… తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా చేస్తాం. రాష్ట్రం కోసం ఎవరి తోనైనా కొట్లాడతాం… మా అభివృద్ధిని మెచ్చే ప్రజలు మాకు ఓట్లేసారు. మేమె క్కడా ఓట్లకు నోట్లు పంచలేదు. నిజా యితీగా ఎన్నిలు చేసామని చెప్పాడు.

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్కిట్‌…

అమెరికాలోని ప్రవాస భారతీయుల సదస్సు. పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతు న్నాడు… నేను డబ్బుల కోసం రాజకీయా లలోకి రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయటం కోసమే వచ్చాను. నాకు డబ్బు కావాలంటే సినిమాలు చేసుకుంటే చాలు. డబ్బు మీద వ్యామోహం కూడా లేదు. కారుకు కూడా ఈఎంఐ కట్టలేక అమ్మేసినవాడిని… ఈ పేద నాయకుడికి మీరే దండిగా విరాళాలిచ్చి ముందుకు నడిపించాలి. నేను ఎవరి వద్ద ప్యాకేజీలు తీసుకోలేదు… ముఖ్యంగా చంద్రబాబు వద్ద అస్సలు తీసుకోలేదు. చంద్రబాబుపై ధర్మయుద్ధం చేద్దామనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. జగన్‌ అవినీతిపరుడు. చంద్రబాబు అనుభవజ్ఞుడు… కాబట్టి ఆలోచించి ఓట్లేయండని చెప్పి కూర్చున్నాడు.

వై.యస్‌.జగన్‌ స్కిట్‌…

ఆత్మసాక్షి టీవీ ఇంటర్వ్యూ సీన్‌… అధికారంలోకి వస్తే మొదట ఏమి చేస్తా రని ఆ టీవీ ప్రతినిధి గోగినేని గోస్వామి ప్రశ్నించాడు. అందుకు ఆయన జగన్‌ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే… అవినీతి అనేదే రాష్ట్రంలో లేకుండా చేస్తాడు. దోపిడీని అరికడతాడు. రాజన్న రాజ్యం తెస్తాడు… అని చెప్పాడు.

హైటెక్‌ రత్న చంద్రబాబు స్కిట్‌…

అది తెలంగాణ ఎన్నికల ప్రచార సభ… హైటెక్‌రత్న చంద్రబాబు మాట్లాడు తున్నాడు… తమ్ముళ్ళూ… ఈ హైదరా బాద్‌ నిర్మించింది నేనే… ఈ హైటెక్‌ సిటీ నాదే… గచ్చీబౌలి ఈరోజు ఓ స్విట్జర్లాండ్‌లాగా వుందంటే కారణం నేనే! శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నా పుణ్యమే… ఔటర్‌ రింగ్‌రోడ్డు వేయించింది నేనే… సైబరాబాద్‌ పెట్టింది నేనే… కంప్యూటర్లు కనిపెట్టింది నేనే… ఇండియాకు సెల్‌ ఫోన్‌లను తెచ్చింది నేనే… సింధుకు ఒలింపిక్స్‌ పతకం నా చలవే! తమ్ముళ్ళు ఆ చెట్టు నుండి గాలి వచ్చినా, ఈ నేల నుండి మట్టి వచ్చినా ఆకాశంలో విమానం ఎగురుతూ వున్నా, శ్రీహరికోట నుండి రాకెట్లు పోతున్నాయన్నా, అసలు ఈ సృష్టి మీద సకల జీవరాశి మనుగడ సాగిస్తుందన్నా… అన్నింటికీ మూలం నేనే… అందరికీ జీవం నేనే అని చెప్పాడు.

ఇక్కడితో అందరి స్కిట్‌లు అయి పోయాయి. అప్పుడు భేతాళుడు… చూసావుగా రాజా అందరి పెర్ఫార్మెన్స్‌… వీరిలో ఈ ఏటి మేటి యాక్టర్‌ ఎవరు? ఈ చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయావో మున్సిపల్‌ మంత్రి, నైట్‌రైడర్‌ నారాయణకు పి.ఏగా మారిపోయి నిద్రలేని రాత్రులతో నరకం అనుభవిస్తావని హెచ్చరించాడు. అందుకు విక్రమార్కుడు… ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు భేతాళా… ఈ ఏటికే కాదు, ఈ దశాబ్దానికే మేటి నటుడు చంద్రబాబునాయుడు. ఆయన స్పీచ్‌ను చూస్తుంటే.. నాకు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతాసారమే గుర్తుకొచ్చింది. ఈ గీతా సారాంశం కూడా అంతే కదా… మీరెవరిదీ ఏమీ వుండదు… ఆడేది ఆడించేదంతా నేనే అని చెబు తాడు. సేమ్‌ క్యారెక్టర్‌ ఇప్పుడు చంద్ర బాబుది. ఈయన కూడా ఆయన అవతారమే అనిపిస్తుంది. కలియుగ కృష్ణుడు చంద్రబాబునాయుడే అని చెప్పాడు. దీంతో సంతృప్తి చెందిన భేతాళుడు ఆ టైంలో స్మశానంకు పోయే ఓపిక లేక అక్కడే ముసుగుతన్ని పడు కున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here