Home జిల్లా వార్తలు కరువుతో.. తరలిపోతున్న రైతు కుటుంబాలు

కరువుతో.. తరలిపోతున్న రైతు కుటుంబాలు

కావలి రూరల్‌ మండలంలోని 18 పంచా యితీల్లో ఉన్న అనేక గ్రామాల్లో ఈ రబీసీజన్‌లో సాగునీళ్ళు లభించక రైతాంగం నానా అవస్తలు పడుతున్నారు. సేద్యం చేయలేక అనేకమంది రైతులు వలసబాట పడుతున్నారు. వర్షాభావంతో చెరువుల్లో చుక్క నీరు కూడా లేకపోవడంతో వ్యవసాయం చేయడం అసాధ్యంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చలంచర్ల గ్రామంలో 600 కుటుంబాలుంటే అందులో రెండువందల కుటుంబాలవారు పొట్టచేతపట్టుకుని తెలంగాణలోని పలు ప్రాంతాలకు వలసపోయారని, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, లేదా కూలిపనులు, బేల్దారిపనుల కోసం వెళ్లిపోయారని స్థానికులు ఆవేదనగా చెప్తున్నారు. కావలి నుండి తుమ్మలపెంట వెళ్ళే రహదారి వెంబడి వేలాది ఎకరాలన్నీ బీడు పడిపోయాయి. ఎక్కడా పచ్చదనం అన్నది కని పించడం లేదు. రుద్రకోట గ్రామంలో కనీసం తాగునీరు కూడా లభించక ఆ గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. కావలి రూరల్‌ ప్రాంతంలోని అనేక పల్లెల్లో నివాసం ఉంటున్న రైతు కుటుంబాలకు చెందిన మహిళలు ఇప్పుడు కూలిపనులు చేసుకుంటూ బతుకుజీవనం సాగి స్తున్న దయనీయ స్థితి. ఈ ప్రాంతానికి సాగునీటి వసతి కలిగిస్తే తప్ప ఈ ప్రాంత రైతాంగం కోలుకోదు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా కావలి రూరల్‌ ప్రాంతాలను సందర్శించి రైతాంగం సమస్యలపై దృష్టిసారించి వెంటనే చేయూతనిచ్చి ఆదుకోవాల్సి ఉందని రైతులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here