Home రాష్ట్రీయ వార్తలు ఓటు బ్యాంకులపై కన్ను

ఓటు బ్యాంకులపై కన్ను

రాజకీయాలలో సమర్ధమైన నాయకత్వం, నీతివంతమైన పాలన, సుస్థిర అభివృద్ధి, పేద, బడుగుల సంక్షేమం అనే అంశాల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోంది. గతంలో వీటి ఆధారంగానే ఎన్నికలలో రాజకీయ పార్టీల గెలుపోటములు వుండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని కులం, ధనం ఆక్రమించాయి. ఈ రెండింటి ప్రభావం ఎన్నికలపై ఎక్కువవుతుండడంతో అవినీతి పార్టీలు సైతం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగవు తున్నాయి. తాత్కాలిక కులం, ధనం ప్రయోగాల వల్ల ఐదేళ్ళ పాటు సాగిన ప్రభుత్వ అవినీతి, అరాచక పాలన కూడా తాత్కాలికంగా తెరమరుగయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

రాష్ట్ర విభజనకు ముందువరకు కూడా ఉమ్మడి ఏ.పి రాజకీయాలలో ఒక ఆరోగ్య కరమైన వాతావరణం వుండేది. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డ ప్రభు త్వాలను ఏపి ప్రజలు తిరిగి ఎన్నుకునే వాళ్ళు. అవినీతి, అరాచకాలతో పాలన సాగిస్తే అధికారం నుండి దించేసేవాళ్ళు. ఈ రాష్ట్రంలో 2009 వరకు ఏ ఎన్నికల లోనూ కులం, ధనం ప్రభావం పని చేయ లేదు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఈ రెండు అంశాలు పాక్షికంగా పని చేసాయి. వచ్చే ఎన్నికలనాటికి ఈ రెండింటి ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలు ఆయా ఓటు బ్యాంకులను కొల్లగొట్టడం లేదా చీలగొట్ట డమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. గడిచిన నాలుగేళ్ళ చంద్రబాబు పరిపాల నను చూస్తే రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతి రేకతవుంది. ఆయన ఇచ్చిన హామీలు కొండంత వుంటే… వాటిలో నెరవేరుస్తు న్నవి గోరంత. అన్ని వర్గాల ప్రజలలోనూ తెలుగుదేశం ప్రభుత్వంపై సానుకూల ధోరణి లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతి రేకత వుందని చంద్రబాబుకు తెలుసు. కాని, దానిని అధిగమించే ఉపాయాలు కూడా ఈ నలభై ఏళ్ళ అనుభవజ్ఞుడి దగ్గర లేకపోలేదు. రాష్ట్రంలో తెలుగుదేశంకు ఒక సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. ఇది ఎన్టీఆర్‌ పార్టీని పెట్టినప్పటి నుండి ఏర్పడ్డ ఓటు బ్యాంకు. చంద్రబాబు ఎంత చెత్తగా పరిపాలన చేసినా ఈ ఓట్లు తెలుగుదేశంకే పడతాయి. చంద్రబాబు సొంత సామా జికవర్గమైన ‘కమ్మ’తో పాటు బీసీలు, బ్రాహ్మణ, వైశ్య, గిరిజనులు అత్యధికంగా తెలుగుదేశం ఓటు బ్యాంకుగానే వున్నారు. ఆ ఓట్లు ఎక్కడికీ పోవు. 2014లో టీడీపీలో చేరిన కాపులలో ఎక్కువ శాతం మంది ఆ పార్టీలోనే వుండే అవకాశా లున్నాయి.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గురంతా కూడా వైసిపికి మూల స్థంభమైన మూడు వర్గాల ఓటు బ్యాంకులపైనే! వైసిపికి ‘రెడ్డి’ సామాజికవర్గం ఆయువు పట్టు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనూ వీరి రాజకీయ ఆధిపత్యం ఉంటుంది. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గురి పెట్టింది ‘రెడ్ల’పైనే! వైసిపిలో గెలిచిన ఈ వర్గం ఎంపీ, ఎమ్మెల్యేలను కొందరిని తన పార్టీలోకి లాక్కున్నాడు. పదవుల్లోనూ ఈ వర్గంకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ ఆరు జిల్లాల్లోను సాధ్యమైనంతవరకు ‘రెడ్ల’ ఓట్లలో చీలిక తేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. వైసిపికి అతిపెద్ద ఓటు బ్యాంక్‌లు క్రిస్టియన్‌లు, ముస్లింలు. 2014 ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు జగన్‌కే అండగా నిలిచాయి. వై.యస్‌. కుటుంబం క్రైస్తవ ఆచారాలను అనుసరిస్తుండడం వల్ల స్వతహాగానే క్రైస్తవులలో వైసిపి మా పార్టీ, జగన్‌ మావాడు అనే అభిప్రాయం ఏర్ప డింది. ఇక ఈ రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్‌లు అమలు చేసిన ఘనత దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డిది. ఆయన మీదున్న అభిమానం కొద్దీ ముస్లింలు ఎక్కువ శాతం మంది జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ రెండు వర్గాల ఓట్లలో తన ధన ప్రయోగం ద్వారా చీలిక తెచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపు తున్నాడు. ఇప్పుడు ముస్లిం, క్రైస్తవ సభలకు శ్రీకారం చుట్టారు. ఈ సభలలో రెండు వర్గాల వారికి ప్రత్యేక తాయిలాలు ప్రక టించనున్నారు. ఎన్నికల సమయంలోనూ ఈ రెండువర్గాల ఓటు బ్యాంకులు లక్ష్యంగా డబ్బు వెదజల్లబోతున్నారు. చంద్రబాబు ఎత్తుగడ ఫలించి ఈ రెండు ఓట్ల బ్యాంకులలో చీలిక వస్తే మాత్రం జగన్‌కు తీరని నష్టం ఖాయం.

అదే సమయంలో తెలుగుదేశం ఓటు బ్యాంకులను జగన్‌ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నాడు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశంకు అండగా నిలిచిన కాపు ఓటు బ్యాంకు ఈసారి చెల్లాచెదురు కానుంది. కాపు ఓట్లలో ఈసారి అంతో ఇంతో వైసిపికి పెరగవచ్చు. అదే సమ యంలో ‘కాపు’ రిజర్వేషన్‌పై జగన్‌ చేసిన వ్యాఖ్యలు బీసీల అభిమానానికి పాత్రమ య్యాయి. కాపు రిజర్వేషన్‌ పేరుతో చంద్రబాబు అటు బీసీలను ఇటు కాపు లను మభ్యపెడితే… జగన్‌ మాత్రం

ఉన్నది ఉన్నట్లు మాట్లాడి బీసీల మన్ననలు పొందాడు. ఈసారి బీసీ ఓటు బ్యాంకులో కొంతవరకైనా చీలిక వచ్చి వైసిపికి ప్రయోజనం కలగవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీకి గట్టి అండగా నిలిచిన బ్రాహ్మణులు ఈసారి చంద్రబాబును గట్టిగా వ్యతిరేకి స్తున్నారు. ఐ.వి.కృష్ణారావు, రమణదీక్షితుల వివాదాలు, పుష్కరాల పేరుతో గుళ్ళను కూలగొట్టడం వంటి సంఘటనలు బ్రాహ్మ ణులలో టీడీపీపై వ్యతిరేకతను పెంచాయి. అదే సమయంలో జగన్‌ అందరినీ కలుపు కుంటూ, అందరి విశ్వాసాలను సమంగా ఆదరిస్తుండడం బ్రాహ్మణులను అతని వైపు ఆకర్షించేలా చేసింది. ఇవే కాకుండా జగన్‌ తన పాదయాత్రలో పలు కుల సంఘా లకు ఇచ్చిన హామీలు కూడా ఆయా కులాలలో వైసిపి ఓట్ల శాతాన్ని పెంచా యనే చెప్పవచ్చు. రాష్ట్రంలో ఒకరి ఓటుపై ఒకరు కన్నేసారన్నది నగ్నసత్యం. తన ఓటు బ్యాంకును కాపాడుకుంటూ అవతల వారి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ అవతల వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టినవాడే రేపు ఎన్నికల్లో నిలదొక్కుకోగలడు.

ఈ విషయంలో చంద్రబాబు అను భవం పని చేస్తుందో, జగన్‌ ముక్కుసూటి తనం, మడమతిప్పని నైజం ఫలితాన్ని ఇస్తుందో వేచిచూద్దాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here