Home జిల్లా వార్తలు ఒక్క సీటు వద్దే పీకులాట!

ఒక్క సీటు వద్దే పీకులాట!

నెల్లూరుజిల్లాలో వైసిపిలో అంతా ప్రశాంతంగానే వుంది. అధికారికంగా ప్రకటించకపోయినా అభ్యర్థులు ఎవరెవ రన్నది తెలుసు. నెల్లూరు సిటి, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, కోవూరు అభ్యర్థులపై దాదాపు క్లారిటీ వుంది. సమస్య వున్నదల్లా కావలి,

ఉదయగిరి, ఆత్మకూరు సీట్ల వద్దే!

నెల్లూరు పార్లమెంటు, ఆత్మకూరు, ఉదయగిరి సీట్ల విషయంలో రచ్చేం టంటే… ఈ మూడు సీట్లు మేకపాటి కుటుంబసభ్యులకు ఇవ్వాల్సి రావడమే! ఈ ముగ్గురిలో ఇద్దరికి సీట్లు ఇచ్చి, ఇంకో సీటును ఇతర నాయకులకు అడ్జస్ట్‌ చేసినా సమస్య లేదు. అసలు ఉదయగిరి కూడా మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఇచ్చి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గౌతంరెడ్డిలలో ఒకరు నెల్లూరు పార్లమెంట్‌, లేదా ఆత్మకూరు అసెంబ్లీలలో ఒకదాని నుండి పోటీ చేస్తే మిగతాదంతా సర్దుకుంటుంది.

ఇక కావలిలో వుండే గొడవేంటంటే సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డిని మార్చమని. మాజీఎమ్మె ల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలు దీని మీదే పట్టు బట్టారు. పార్టీ అధిష్టానం తమ మాట వినకపోయేసరికి పార్టీకి రాజీనామా చేశారు. వాళ్లిద్దరినీ తమ పార్టీలోకి రమ్మని తెలుగుదేశం నాయకులు వారి ఇళ్లకు వెళ్లి మరీ ఆహ్వానించారు. వాళ్లు ఇంకా వేచి చూసే ధోరణిలో వున్నట్లు తెలుస్తోంది. కావలి అభ్యర్థిగా ప్రతాప్‌ను మారిస్తే తమకు సీటు ఇవ్వకపోయినా, ఇంకెవరికి ఇచ్చినా పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా వున్నారు.

తెలుగుదేశంలోని ఓ నాయకుడు మొన్నటివరకు టిక్కెట్‌ ఇస్తే వైసిపిలోకి రావడానికి సిద్ధంగా వుండినాడు. ఆయ నను వైసిపిలోకి తీసుకుని కావలి సీటిచ్చి వుంటే అంతా సర్దుకుని వుండేది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here