Home గల్పిక ఐక్యరాజ్యసమితి సదస్సుకు బాబుకు ప్రత్యేక ఆహ్వానం

ఐక్యరాజ్యసమితి సదస్సుకు బాబుకు ప్రత్యేక ఆహ్వానం

అది హైటెక్‌రత్న చంద్రబాబు ఎంతో కష్టపడి కట్టిన హైటెక్‌ సిటీ ఉన్న హైదరా బాద్‌ నగరం. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు… అక్కడంతా కూడా పసుపు పచ్చ బ్యానర్లు… వాటి మీద ”ఐక్యరాజ్య సమితి సదస్సులో ప్రసంగించడానికి అమెరికాకు వెళుతున్న అంతర్జాతీయ నాయకుడు చంద్రబాబుకు శుభాకాంక్షలు” అని వ్రాసి వుంది. అప్పుడే చంద్రబాబు కాన్వాయ్‌ వచ్చి ఆగింది. కారు దిగిన చంద్రబాబుకు అక్కడే ఎప్పటినుండో వెయిట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, వి.హెచ్‌.హను మంతురావులు పూలబొకేలు చేతికిచ్చి విదేశీయాన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే మాటువేసి వున్న ఏబిసిడి, దామ్‌ధుమార్‌, టీవీ10I5 తదితర ఛానల్స్‌ వాళ్ళు… చంద్రబాబు అమెరికా ప్రయాణాన్ని లైవ్‌ ఇస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న మొట్టమొదటి తెలుగు మొనగాడు చంద్రబాబు నాయుడు… మొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేత ఉచ్చపోయించాడు… రేపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేత ఉచ్చపోయించబోతున్నాడు… అంటూ ఏబిసిడి ఛానల్‌ యాంకర్‌ గ్యాస్‌ గిరిజ గ్యాప్‌లేకుండా చెబుతోంది. అది అక్కడే వుండి వింటున్న ఒక పెద్దాయన, గ్యాస్‌ గిరిజ వద్దకొచ్చి… పాపా.. ఖచ్చి తంగా ఆయన ఉచ్చ పోయిస్తాడంటావా అని సందేహంగా అడిగాడు. అందుకు గ్యాస్‌ గిరిజ… ఇప్పుడున్న పొలిటికల్‌ ట్రెండ్‌లో ఎలాంటి కొమ్ములు తిరిగిన నాయకుడి చేతనైనా ఉచ్చపోయించగల దమ్మున్న మగాడు చంద్రబాబు నాయుడే. దీనికి మా ఛానెల్‌ పక్కా గ్యారంటీ అని చెప్పి… ఇంతకీ అంత గ్యారంటీ ఎందుకు అడుగుతున్నావని ప్రశ్నించింది. దానికా పెద్దాయన… ఏం లేదమ్మా, మా బంధు వొకాయనను అపోలో ఆసుపత్రిలో చేర్చాం. యూరినల్‌ బ్లాడర్‌ బ్లాక్‌ అయ్యింది. పెద్దపెద్ద డాక్టర్లకే ఆయన చేత ఉచ్చ పోయించడం సాధ్యం కావడం లేదు. చంద్రబాబు గారిని తీసుకెళితే ఏమన్నా ఫలితముంటుందేమోనని అని చెప్పాడు. దానికి గ్యాస్‌ గిరిజ… ఉచ్చ పోయించడం అంటే అదికాదు తాత… ఇంకో టైపులోలే, నీకు అర్ధం కాదు అని చెప్పి తన పనిలో తాను పడింది. ఈలోపు చంద్రబాబు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అధికారులు ఇమి గ్రేషన్‌ పూర్తి చేసుకుని లోపలకు వెళ్లి ఫ్లైట్‌లో కూర్చున్నారు. చంద్రబాబు పక్క సీట్లోనే సోమిరెడ్డి కూర్చున్నాడు. ఇంకా ఫ్లైట్‌ టేకాఫ్‌ కాకపోవడంతో సోమిరెడ్డి తన సెల్‌ఫోన్‌ బయటకు తీసి ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేశాడు. ఒక పోస్ట్‌లో బీజేపీ ఎంపి జి.వి.ఎల్‌.నరసింహరావు ప్రెస్‌మీట్‌… చంద్రబాబునాయుడు గారికి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించమని ఆహ్వానం వచ్చినట్లు ఊరూవాడా డప్పు వేసు కున్నారు. తెలుగుదేశం నాయకులైతే మా నాయకుడు అంతర్జాతీయ స్థాయి నాయకుడైపోయాడని, ఆమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసినా గెలిచేస్తాడని ఒకటే ఊదరగొడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడుకు ఐక్యరాజ్యసమితి వాళ్ళు ఆహ్వానం పంపారా? ఆహ్వానం పంపి వుంటే ఆ ఆహ్వాన పత్రికను చూపించమని చెప్పండి… ఆయన వెళుతున్నది న్యూ యార్క్‌లో జరిగే ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’ సదస్సుకు. ప్రచారం చేసుకుంటున్నది మాత్రం ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించ డానికని… ఐక్యరాజ్యసమితిలో ఈయనేం ప్రసంగిస్తారు… అవతల పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎలా కొనాలో వివరించి చెబుతారా? ఒక ఎమ్మెల్యేను ఎన్ని కోట్లకు బేరం చేయాలో ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తారా? గ్రాఫిక్స్‌ రాజధానిని ఎలా కట్టాలో వివరిస్తారా? పోలవరం ప్రాజెక్ట్‌ అంచనాలను 16వేల కోట్ల నుండి 56వేల కోట్లకు ఎలా పెంచాలన్నది చెబుతారా? పుష్కరాల పేరు చెప్పుకుని ఎన్ని వందల కోట్లు మింగచ్చో అనేదానిపై ప్రయోగత్మక వివరణ ఇస్తారా? ఏం ఉద్ధరిస్తారని ఈయనను ఐక్యరాజ్య సమితి వాళ్ళు పిలుస్తారు. పిలిచుంటే ఆ ఇన్వి టేషన్‌ బయట పెట్టమని చెప్పండి… అంటూ జి.వి.ఎల్‌.నరసింహరావు ఆవేశంగా ప్రశ్నించాడు. అక్కడితో అతని ప్రెస్‌మీట్‌ అయిపోవడంతో, సోమిరెడ్డి ఫోన్‌ ఆఫ్‌ చేసి చంద్రబాబు వైపు చూస్తూ… సార్‌, మనం వెళ్లేది ఐక్యరాజ్య సమితి సదస్సుకు కాదా? మనకు ఆహ్వానం లేదా…? మా చంద్రబాబు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడబోతున్నా డంటా, ఆయనతో పాటు నేనూ అమెరికా వెళ్తున్నాను… ఆయన ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేటప్పుడు అక్కడెక్కడో మూల కూర్చుని నేను కూడా వుంటానని మా నెల్లూరంతా గొప్పగా చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేనెక్కడ తలకాయ పెట్టుకోవాలి, మా నెల్లూరోళ్ళకు నా ముఖం ఎలా చూపించాలి… అసలు ఇన్విటేషన్‌ లేకుండా ఐక్యరాజ్యసమితి సదస్సుకు పోతున్నామని ప్రచారం చేసుకోవడమెందుకు అని వాపోసాగాడు. అప్పుడు చంద్రబాబు.. డోంట్‌ వర్రీ చంద్రమోహన్‌, నీకు కావాల్సింది ఇన్వి టేషనేగా అని అడిగాడు. అవును అని సోమిరెడ్డి చెప్పాడు. వెంటనే చంద్రబాబు ఎయిర్‌ హోస్టెస్‌ను పిలిచి ఐ వాంట్‌ ఒక వైట్‌పేపర్‌ అని అడిగాడు. ఆమె వెంటనే పేపర్‌ తెచ్చి ఇచ్చింది. చంద్రబాబు దానిని సోమిరెడ్డికిచ్చాడు. పెన్ను తీయమన్నాడు. సోమిరెడ్డి తన జేబులో వున్న పెన్ను తీసాడు. నేను చెప్పింది వ్రాయి అని చంద్రబాబు ఆదేశించాడు. సోమిరెడ్డి వ్రాయడానికి రెడీ కాగానే చంద్రబాబు చెప్పడం మొదలుపెట్టాడు.

ప్రపంచ దేశాధినేతలకే ఆదర్శ నాయకుడిగా అవతరించిన మహారాజశ్రీ పూజ్యులు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గారి పాదపద్మాలకు నమస్కరించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గట్టెరస్‌ పంపుతున్న ఆహ్వాన పత్రం.

సార్‌,

సెప్టెంబర్‌ 18 నుండి అక్టోబర్‌ 5 వరకు న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగుతున్నాయి. 30 రోజుల్లో తమిళం, 30రోజుల్లో ఆంగ్లం, 30రోజుల్లో హిందీ వంటి కాన్సెప్ట్‌ల లాగే ‘ఐదేళ్లలో కొత్త రాజధాని నిర్మాణం’ వంటి కాన్సెప్ట్‌ను తెచ్చిన మహనీయులు మీరు. సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ల వంటి సాంకేతిక పరికరాల ఆవిష్కర్తలు మీరు! మీ అను భవం, మీ విజ్ఞానం ప్రపంచ దేశాలన్నిం టికీ పంచాలి. మీ నుండి ప్రతిఒక్కరూ స్ఫూర్తిపొందాలి. మీ అడుగుజాడలలో నడిస్తే ప్రతి దేశం కూడా మీ ఆంధ్రప్రదేశ్‌ లాగే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అనుభవాలను ప్రపంచ దేశాలతో పంచు కోవాలని ఆశిస్తూ… ఈ సమావేశాలకు మిమ్మలను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తు న్నాము. మీరు రాకుంటే మేము చాలా అప్‌సెట్‌ అవుతాము… మీ ప్రసంగం వుంటుందని తెలిసే ఈ సదస్సుకు అన్ని దేశాల అధ్యక్షులు హాజరవుతున్నారు. మీరొస్తే మా అదృష్టం… మీరు రాకపోతే మా మనసుకు ఎంతో కష్టం. మీ కోసం లక్షల కళ్ళతో ఎదురుచూసే…

ఆంటోనియో గట్టెరస్‌

ప్రధాన కార్యదర్శి

ఐక్యరాజ్యసమితి

న్యూయార్స్‌, యూఎస్‌ఏ

అని చంద్రబాబు ముగించి… సోమి రెడ్డితో ఇప్పుడు ఇన్విటేషన్‌ వుందిగా… దీనినే ఫోటో తీసి మనవాళ్ళకు పం పించు… సోషల్‌ మీడియాలో పెట్టేస్తారు అని చెప్పాడు. చంద్రబాబు మాటలతో సోమిరెడ్డికి కళ్లు గిర్రున తిరిగి… కళ్ళ ముందే ‘కేడీ’ సినిమాలోని బ్రహ్మానందం సీన్‌ కదలాడసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here