Home రాష్ట్రీయ వార్తలు ఎవరి నాటకం వారిదే!

ఎవరి నాటకం వారిదే!

‘ఫ్లడ్‌ లైట్ల వెలుగులో దాగుడుమూతలు ఆడు తున్నాం…’ అత్తారింటికి దారేది సినిమాలో హీరో పవన్‌కళ్యాణ్‌ డైలాగ్‌ ఇది. రాజకీయాలలో కూడా ఇలాంటి దాగుడు మూతల ఆటలు కొనసాగుతుం టాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రెండు జాతీయ పార్టీలు, మూడు ప్రాంతీయ పార్టీల మధ్య ఇలాంటి ఫ్లడ్‌లైట్‌ దాగుడు మూతల ఆటలే జరుగుతున్నాయి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటకొచ్చేసాడు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని చెప్పి తెగ హడావిడి చేస్తున్నాడు. ఈమధ్య బెంగుళూరులో కర్నాటక సీఎం కుమార స్వామి ప్రమాణస్వీకారోత్సవమప్పుడు బీజేపీ వ్యతిరేక నేతలతో ఇలాంటి షోనే ఏర్పాటు చేసి, ఆ సభలోనే రాహుల్‌గాంధీని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. వీళ్ళ ‘అనుబంధం’ సినిమా ఇక్కడితో ఆగిపో లేదు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌ ఎన్నిక సందర్భంగా మరో మారు బయటపడింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్‌ అభ్యర్థికి బహిరంగంగానే మద్దతు తెలిపింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు ఆ విధంగా కాంగ్రెస్‌కు సహకరిస్తున్నాడు. రేపు తెలం గాణలోనూ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతోంది. హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీని చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మిణి భేటీ కావడం ఈ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయడానికి సంకేత మనుకోవచ్చు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీపై వున్న వ్యతి రేకత తన పార్టీపై పడకుండా చూసుకు నేందుకే చంద్రబాబు ఎన్డీఏ నుండి బయ టకు వచ్చాడు. ఇప్పుడు బీజేపీ శత్రుత్వం, కాంగ్రెస్‌తో మిత్రత్వం ఏపిలో రేపటి అవస రాల కోసమేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా! బీజేపీని దూరంగా వుంచితే మైనార్టీ ఓట్లు వచ్చి పడతాయి. కాంగ్రెస్‌తో స్నేహంగా వుండి ఆ పార్టీని రెచ్చగొడితే ఏపిలో అన్ని సీట్లకు పోటీచేస్తుంది. వైసిపి ఓట్లకు బొక్కపెడుతుందని చంద్రబాబు ఆలోచన. రేపు మూడో ఫ్రంట్‌కో, కాం గ్రెస్‌కో కేంద్రంలో అధికారం దక్కే ఛాన్స్‌ వుంటే తాను చక్రం తిప్పొచ్చు. మళ్ళీ బీజేపీయే వస్తే నోరు మెదపకుండా మళ్ళీ మోడీకే జైకొట్టొచ్చు. అందుకే బీజేపీ మార్గం మూసుకుపోకుండా తన రాజ గురువును ఆ పార్టీ అధ్యక్షుడికి లైన్‌లో వుంచాడు. ఇలా చంద్రబాబు అటు కాం గ్రెస్‌తోనూ, ఇటు బీజేపీతోనూ ఫ్రెండ్‌షిప్‌ అనే డ్రామాను కంటిన్యూ చేస్తున్నాడు. కాంగ్రెస్‌వాళ్ళు కూడా తెలంగాణలో అవ సరం దష్ట్యా, అలాగే కేంద్రంలో రేపు అతని అవసరం రావొచ్చనే ఉద్దేశ్యంతో చంద్రబాబుకు వంత పాడుతున్నారు.

అన్నింటికంటే బీజేపీ ఆడుతున్న డబుల్‌గేమే ఆసక్తికరంగా వుంటోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులేమో చంద్రబాబు అవినీతి, అక్రమాలను తూర్పారబడుతుం టారు. ఢిల్లీ నాయకులేమో విడిపోయినా చంద్రబాబు ఇప్పటికీ మా స్నేహితుడేనం టుంటారు. పోలవరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి, అక్రమాల గురించి కేంద్రానికి పక్కాగా తెలుసు. అయినా విచారణకు ఆదేశించరు. ఓటు-నోటు కేసు గురించి పక్కాగా తెలుసు. దానిని ముందుకు తీసు కెళ్ళరు. రాజధాని పేరుతో జరుగుతున్న భూదోపిడీ, మైనింగ్‌ మాఫియా, ప్రభుత్వ దుబారా… ఎన్నో అక్రమాలు కళ్ళకు కనిపిస్తున్నా బీజేపీ చూసీ చూడనట్లు పోతుంది. రాష్ట్రంలో జరిగే పలు అక్ర మాలపై సాధారణ విచారణ జరిపినా ఎన్నో అక్రమాలు వెలుగుచూస్తాయి. కేంద్రం దాని జోలికే పోవడం లేదు. అదే సమయంలో వైసిపిపై కూడా కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరించడం లేదు. జగన్‌ కేసులపై ఒత్తిడి పెంచడం లేదు. రేపు ఎన్నికల తర్వాత ఎవరి అవసరం ఎలా వుంటుందోనన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ డబుల్‌ డ్రామా ఆడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీల మధ్య ట్రయాం గిల్‌ లవ్‌ స్టోరీ నడుస్తోంది. వైసిపి మాత్రం ఈ మూడు పార్టీలకు దూరంగానే వుంటోంది. తెలుగుదేశంతో ఎలాగూ పోరాటం తప్పదు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించినందుకు కాంగ్రెస్‌తో, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీతో వైసిపి శత్రుత్వాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర రాజకీయాలలో పానకంలో పుడకలా తయారైన పవన్‌కళ్యాణ్‌ అయితే సినిమాల్లోకంటే బయటే బాగా నటిస్తున్నాడు. కాకపోతే ఆయన నటనకు డైరక్షన్‌ చేస్తున్నది టీడీపీయా లేక బీజేపీయా అన్నదే కొంతవరకు అంతుబట్టడం లేదు. బహుశా ఎన్నికలు దగ్గరకొచ్చే సమయానికి వీళ్ళు ఆడుతున్న దాగుడుమూతలపై ఓ క్లారిటీ రావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here